నౌకారవాణా మంత్రిత్వ శాఖ
సబర్మతీ నది వద్ద సీప్లేన్ సౌకర్యం
Posted On:
30 NOV 2021 3:34PM by PIB Hyderabad
ప్రాంతీయ అనుసంధాన పథకం (ఆర్‌సిఎస్) - ఉడాన్ ( UDAN-ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ) కింద సబర్మతీ నదీ తీరం నుంచి ఐక్యతా స్థూపం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ) కి సీప్లేన్ సేవలు 31 అక్టోబర్, 2020న ప్రారంభం అయ్యాయి. అనంతరం, అందుకోసం ఎంపిక చేసిన ఎయిర్‌లైన్ ఆపరేటర్ (ఎస్ఎఒ) 11 ఏప్రిల్, 2021 నుంచి కార్యాచరణ సమస్య కారణాలతో నిలిపివేశారు. సీప్లేన్ కార్యాచరణ సాధ్యతను గురించి సంబంధిత భాగస్వాములతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (ఎంఒసిఎ_ చర్చలను చేపట్టింది. ఎం/ఒ పోర్ట్స్, షిప్పింగ్ & వాటర్‌వేస్ (ఎంఒపిఎస్‌డబ్ల్యు)తో సీప్లేన్ సేవలను అభివృద్ధి చేసేందుకు ఎంసిఎ అవగాహనా పత్రం పై సంతకాలు చేసింది.
తదనంతరం జల విమానాశ్రయాలను గుజరాత్, అస్సాం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్& నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో ఉడాన్ పథకం కింద గుర్తించారు. వాటి వివరాలు -
1. సర్దార్ సరోవర్ డాం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ), గుజరాత్‌లో
2. సబర్మతీ నదీ తీరం, అహ్మదాబాద్, గుజరాత్
3. శతృంజయ డాం, గుజరాత్
4. స్వరాజ్ ద్వీప్, అండమాన్ & నికోబార్ దీవులు
5. హావెలాక్ దీవి, అండమాన్ & నికోబార్ దీవులు
6. షహీద్ ద్వీప్ (నీల్ ద్వీపం), అండమాన్ & నికోబార్ దీవులు
7. గువాహతీ నదీ తీరం, అస్సాం
8. ఉమ్రాంగ్సో రిజర్వాయిర్, అస్సాం
9. నాగార్జున సాగర్ డాం, తెలంగాణ
10. ప్రకాశం బ్యారేజీ, ఆంధ్రప్రదేశ్
11. మినీకోయ్, లక్షద్వీప్ దీవులు
12. కావరాత్తి, లక్షద్వీప్ దీవులు
13. పోర్ట్ బ్లెయిర్, అండమాన్ & నికోబార్ దీవులు
14. అగత్తీ, లక్షద్వీప్ దీవులు
ఈ సమాచారాన్ని కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రి సర్బానంద్ సోనోవాల్ మంగళవారం రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు.
సబర్మతీ నది వద్ద సీప్లేన్ సౌకర్యం
న్యూఢిల్లీ, నవంబర్ 30 (పిఐబి)ః ప్రాంతీయ అనుసంధాన పథకం (ఆర్‌సిఎస్) - ఉడాన్ ( UDAN-ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ) కింద సబర్మతీ నదీ తీరం నుంచి ఐక్యతా స్థూపం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ) కి సీప్లేన్ సేవలు 31 అక్టోబర్, 2020న ప్రారంభం అయ్యాయి. అనంతరం, అందుకోసం ఎంపిక చేసిన ఎయిర్‌లైన్ ఆపరేటర్ (ఎస్ఎఒ) 11 ఏప్రిల్, 2021 నుంచి కార్యాచరణ సమస్య కారణాలతో నిలిపివేశారు. సీప్లేన్ కార్యాచరణ సాధ్యతను గురించి సంబంధిత భాగస్వాములతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (ఎంఒసిఎ_ చర్చలను చేపట్టింది. ఎం/ఒ పోర్ట్స్, షిప్పింగ్ & వాటర్‌వేస్ (ఎంఒపిఎస్‌డబ్ల్యు)తో సీప్లేన్ సేవలను అభివృద్ధి చేసేందుకు ఎంసిఎ అవగాహనా పత్రం పై సంతకాలు చేసింది.
తదనంతరం జల విమానాశ్రయాలను గుజరాత్, అస్సాం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్& నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో ఉడాన్ పథకం కింద గుర్తించారు. వాటి వివరాలు -
1. సర్దార్ సరోవర్ డాం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ), గుజరాత్‌లో
2. సబర్మతీ నదీ తీరం, అహ్మదాబాద్, గుజరాత్
3. శతృంజయ డాం, గుజరాత్
4. స్వరాజ్ ద్వీప్, అండమాన్ & నికోబార్ దీవులు
5. హావెలాక్ దీవి, అండమాన్ & నికోబార్ దీవులు
6. షహీద్ ద్వీప్ (నీల్ ద్వీపం), అండమాన్ & నికోబార్ దీవులు
7. గువాహతీ నదీ తీరం, అస్సాం
8. ఉమ్రాంగ్సో రిజర్వాయిర్, అస్సాం
9. నాగార్జున సాగర్ డాం, తెలంగాణ
10. ప్రకాశం బ్యారేజీ, ఆంధ్రప్రదేశ్
11. మినీకోయ్, లక్షద్వీప్ దీవులు
12. కావరాత్తి, లక్షద్వీప్ దీవులు
13. పోర్ట్ బ్లెయిర్, అండమాన్ & నికోబార్ దీవులు
14. అగత్తీ, లక్షద్వీప్ దీవులు
ఈ సమాచారాన్ని కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రి సర్బానంద్ సోనోవాల్ మంగళవారం రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు.
***
(Release ID: 1776498)
Visitor Counter : 148