ఆర్థిక మంత్రిత్వ శాఖ

2021-22 ఆర్ధిక సంవత్సరంలో పెరుగుతున్న ధోరణిలో ఉన్న - స్థూల జి.ఎస్.టి. వసూళ్ళు

Posted On: 29 NOV 2021 5:50PM by PIB Hyderabad

 

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి తర్వాత 2021-22 ఆర్ధిక సంవత్సరంలో స్థూల జి.ఎస్.టి. వసూళ్ళలో పెరుగుతున్న ధోరణి కనబడుతోంది.  కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి ఈ రోజు లోక్‌ సభలో ఒక ప్రశ్నకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా మరిన్ని వివరాలు తెలియజేస్తూ, 2020-21 ఆర్ధిక సంవత్సరం మరియు 2021-22 ఆర్థిక సంవత్సరం (2021 అక్టోబర్ వరకు) స్థూల జి.ఎస్.టి. వసూళ్ళను, మంత్రి ఈ క్రింది విధంగా తెలియజేశారు: -

నెల 

2020-21

ఆర్ధిక సంవత్సరం 

(రూపాయలు కోట్లలో)

2021-22

ఆర్ధిక సంవత్సరం 

(రూపాయలు కోట్లలో)

ఏప్రిల్ 

32172

139708

మే 

62151

102709

జూన్ 

90918

92849

జులై

87422

116393

ఆగస్టు

86449

112020

సెప్టెంబర్ 

95480

117010

అక్టోబర్ 

105155

130127

నవంబర్ 

104963

--

డిసెంబర్ 

115174

--

జనవరి 

119875

--

ఫిబ్రవరి 

113143

--

మార్చి 

123902

--

మొత్తం 

1136805

810816

 

2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్ల గణాంక వివరాలను మంత్రి తెలియజేస్తూ,  2021-22 ఆర్థిక సంవత్సరంలో 23.11.2021 తేదీ వరకు 8,15,262.7 కోట్ల రూపాయల మేర స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు జరిగినట్లు చెప్పారు.  ఈ వసూళ్ళు 2021-22 మరియు 2019-20 ఆర్ధిక సంవత్సరాలలో సంబంధిత కాలంలో స్థూల సేకరణ గణాంకాలతో పోలిస్తే, వరుసగా 48.11 శాతం మరియు 18.15 శాతం వృద్ధిని నమోదు చేశాయి.  అదేవిధంగా, 2021-22 ఆర్ధిక సంవత్సరంలో 23.11.2021 తేదీ వరకు 6,92,833.6 కోట్ల రూపాయల మేర నికర ప్రత్యక్ష పన్ను వసూళ్ళు జరిగాయి.  ఈ వసూళ్ళు, 2020-21 మరియు 2019-20 ఆర్థిక సంవత్సరాలలో సంబంధిత కాలంలో నికర సేకరణ గణాంకాలతో పోలిస్తే, వరుసగా 67.93 శాతం మరియు 27.29 శాతం వృద్ధిని నమోదు చేశాయి.   

ఈ వివరాలను అనుబంధం-I లో పొందుపరిచినట్లు మంత్రి తెలియజేశారు. 

పరిహారం సెస్‌ కు సంబంధించి, జి.ఎస్.టి. (రాష్ట్రాలకు పరిహారం) చట్టం, 2017 లోని సెక్షన్ 8 కింద విధించబడిన జి.ఎస్.టి. పరిహారం సెస్ ను, చట్టంలోని సెక్షన్ 10(1) లో పొందుపరచిన విధంగా, భారత ప్రజా పద్దులో భాగమైన జి.ఎస్.టి పరిహార నిధి గా పిలిచే నాన్-లాప్సబుల్ ఫండ్ కు బదిలీ చేయడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.  జి.ఎస్‌.టి. విధానాన్ని అమలు చేయడం వల్ల ఐదేళ్ల పాటు ఉత్పన్నమయ్యే ఆదాయ నష్టాలకు, ఈ చట్టంలోని సెక్షన్ 10(2) ప్రకారం పరిహారం నిధి నుంచి రాష్ట్రాలకు పరిహారం చెల్లించడం జరుగుతుంది.  2017-18, 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి, జీ.ఎస్.టీ. పరిహారం ఇప్పటికే రాష్ట్రాలకు చెల్లించినట్లు మంత్రి తెలియజేశారు. 

మహమ్మారి కారణంగా ఆర్థిక ప్రభావం తక్కువ జి.ఎస్.టి. వసూళ్లతో పాటు, అదే సమయంలో జి.ఎస్.టి. పరిహారం సెస్ కూడా తక్కువగా వసూలైన కారణంగా అధిక పరిహారం చెల్లించవలసిన పరిస్థితి ఉత్పన్నమయ్యిందని, మంత్రి పేర్కొన్నారు.  ఈ నేపథ్యంలో, జి.ఎస్.టి. పరిహారనిధి లో ఉన్న నిధులు పూర్తి పరిహారం చెల్లించడానికి సరిపోని పరిస్థితి నెలకొన్న కారణంగా, 2020 ఏప్రిల్ నుండి 2021 మార్చి, మధ్య కాలానికి సంబంధించి, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెల్లించాల్సిన పరిహారాన్ని పాక్షికంగా తీర్చే ప్రయత్నంలో భాగంగా 1,30,464 కోట్ల రూపాయల మేర నిధులను  జీ.ఎస్.టి. పరిహారం చెల్లించడం కోసం విడుదల చేయడం జరిగింది.  జి.ఎస్‌.టి. పరిహారం విడుదల లో లోటు సమస్య పై,  41వ, 42వ జి.ఎస్‌.టి. మండలి సమావేశాల్లో చర్చించడం జరిగింది.   తదనుగుణంగా,  2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి, జి.ఎస్.టి. పరిహారం తక్కువగా విడుదల చేసిన కారణంగా సంభవించిన వనరుల లోటును తీర్చడం కోసం, కేంద్ర ప్రభుత్వం, బహిరంగ మార్కెట్ నుండి 1.1 లక్షల కోట్ల రూపాయల మేర రుణాన్ని సేకరించి, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బ్యాక్-టు-బ్యాక్ రుణంగా అందజేయడం జరిగింది.  అదేవిధంగా, 43వ జి.ఎస్.టి. మండలి సమావేశంలో చర్చించిన ప్రకారం,  గత సంవత్సరం చేసినట్లు గా, కేంద్ర ప్రభుత్వం 1.59 లక్షల కోట్ల రూపాయల మేర రుణాన్ని సేకరించి, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆ నిధులను బదిలీ చేసింది. 

రాష్ట్రాలకు విడుదల చేసిన జి.ఎస్.టి. పరిహారం మరియు బ్యాక్-టు-బ్యాక్ రుణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, రాష్ట్రాలు / కేంద్ర పాలిత  ప్రాంతాలకు పెండింగ్‌ లో ఉన్న జి.ఎస్.టి. పరిహారం వివరాలను అనుబంధం-II లో పొందుపరిచినట్లు మంత్రి తెలిపారు.

*****



(Release ID: 1776315) Visitor Counter : 203


Read this release in: English , Urdu , Marathi