సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
డిజిటలైజ్ , ఆటోమేట్ దిశగా ఎం ఎస్ ఎం ఇ రంగం..
Posted On:
29 NOV 2021 3:10PM by PIB Hyderabad
ఎస్ ఎం ఇ ఛాంపియన్స్ పధకాన్ని రూ. 273.24 కోట్ల తో స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదించింది. ఈ పథకంలో భాగంగా దేశంలోని ఎం ఎస్ ఎం ఇ ల డిజిటల్ సాధికారత కోసం ‘డిజిటల్ ఎం ఎస్ ఎం ఇ ' భాగాన్ని చేర్చారు. దీనికి అదనంగా, మంత్రిత్వ శాఖ క్రింద అనేక సాంకేతిక పరిజ్ఞాన కేంద్రాలు కూడా శిక్షణ మద్దతుతో పాటు సాంకేతిక ,ఆటోమేషన్ జోక్యాలపై సహాయం చేస్తున్నాయి.స్థానిక సంస్థల అంతర్జాతీయ వాణిజ్య డిజిటలైజేషన్ కు సంబంధించి స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ‘మొదటిసారి ఎగుమతిదారులతో’ కూడిన అంతర్జాతీయ సహకార పథకానికి, రు. 90 కోట్ల పెట్టుబడితో అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు ఆమోదం తెలిపింది
సృజనాత్మకతను సులభతరం చేయడానికి విద్యా సంస్థల్లో వ్యాపార ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయడానికి మంత్రిత్వ శాఖ రెండు పథకాలను నిర్వహిస్తోంది. మొదటిది "ఇంక్యుబేటర్ ల పధకం ద్వారా ఎమ్ ఎస్ ఎమ్ ఈల వ్యవస్థాపక , మేనేజీరియల్ డెవలప్ మెంట్ కు మద్దతు" పధకం కాగా, రెండవది సృజనాత్మకత, గ్రామీణ పరిశ్రమ ,వ్యవస్థాపకత ను ప్రోత్సహించే ‘ఏస్పైర్' పథకం.
డిజిటల్ ఎమ్ఎస్ఎమ్ఈ పధకం ద్వారా ప్రభుత్వం ఈ దిగువ లక్ష్యాలతో అవసరమైన చర్యలు తీసుకుంటోంది:
I . ఎం ఎస్ ఎం ఇ లు స్టాటిక్ ,డైనమిక్ రెండింటిలోనూ ఆన్ లైన్ కంటెంట్ ద్వారా తమ నిర్వహణ ,సాంకేతిక పరిజ్ఞానాన్ని నవీకరించుకుని మార్కెట్ లో ప్రవేశించడానికి ఐ టి ని కమ్యూనికేషన్ మాధ్యమంగా ఉపయోగించుకునే విధంగా సాధికారత కల్పించడం.
ii. వారికి సాఫ్ట్ వేర్ జోక్యాలు ఇవ్వడానికి, విస్త్రుతమైన ఐసిటి తీసుకోవడం ,ఖర్చు తగ్గింపు కోసం ఆటోమేటింగ్ ప్రక్రియ ద్వారా వారి అంతర్గత సామర్థ్యాలను అభివృద్ధి చేయడం, సమాచార ప్రాప్యత, ప్రాసెసింగ్, సహకారం, సమాచార వ్యాప్తి కోసం డిజిటల్ అక్షరాస్యత, సామర్థ్య పెంపుదలను అందించడం.
III. ఎమ్ఎస్ఎమ్ఈ లకు -పర్యావరణ వ్యవస్థ విభిన్న ఆవశ్యకతలను దృష్టిలో ఉంచుకొని, అవివేకమైన ,విచక్షణారహితమైన టెక్నాలజీని స్వీకరించడం వల్ల జరిగే కష్టాల నుంచి కాపాడేలా కస్టమైజ్డ్ డిజిటల్ సొల్యూషన్ల సురక్షితమైన , బలమైన వ్యవస్థను అందించడం.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే ఈ రోజు రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని ఇచ్చారు.
***
(Release ID: 1776260)