సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

కొంత మందికి ఉండడానికి అవకాశం కలుగుతుంది. మరికొందరు ఎందుకు వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ?",, ఇది సార్వత్రిక ప్రశ్న. దీనినే మేము 'ఎనీ డే నౌ' చిత్రం ద్వారా లేవనెత్తాం .... 52 వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమవుతున్న 'ఎనీ డే నౌ' చిత్ర రచయిత అంటి రౌతవా


శరణార్థి అనే పదాన్ని చెరిపి వేయడానికి ప్రయత్నించే భాగంగా రూపొందిన భావోద్వేగ చిత్రం 'ఎనీ డే నౌ'

Posted On: 26 NOV 2021 12:52PM by PIB Hyderabad

'శరణార్థులుఅని వేసిన వారిని కేవలం లెక్కలకు పరిమితం చేయకుండా  వారిని  వ్యక్తులుగా, మానవులుగా చూడాలన్న ఇతివృత్తంతో 'ఎనీ డే నౌచిత్రం రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న ' కొంత మందికి ఉండడానికి అవకాశం కలుగుతుంది. మరికొందరు ఎందుకు  వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది.' అన్న ప్రశ్నను చిత్రంలో లేవనెత్తామని చిత్ర రచయిత అంటి రౌతవా   తెలిపారు. 52 వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో అంతర్జాతీయ పోటీ విభాగంలో  'ఎనీ డే నౌపాల్గొంది. శరణార్థి అనేది గుర్తింపు కాదన్న సందేశాన్ని చిత్రం ద్వారా ఇవ్వడానికి ప్రయత్నం జరిగింది. 

 52 వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొడానికి వచ్చిన అంటి రౌతవా విలేకరులతో మాట్లాడారు. గోవాలో నవంబర్ 20 నుంచి  52 వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రారంభమయ్యింది. హైబ్రిడ్ విధానంలో ఇది నవంబర్   28 వరకు జరుగుతుంది. చలన చిత్రోత్సవంలో అంతర్జాతీయ పోటీ విభాగంలో  'ఎనీ డే నౌను ప్రదర్శించారు. 

 

హమీ రమేజాన్ దర్శకత్వం వహించిన 'ఎనీ డే నౌచిత్ర కథ ఫిన్‌లాండ్‌లోని శరణార్థి కేంద్రంలో తలదాచుకుంటున్న ఇరాన్ కి చెందిన పదమూడేళ్ల బాలుడు రామిన్ మెహదీపూర్ అతని కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుతుంది. వారు తమకు  ఆశ్రయం కల్పించాలంటూ చేసిన దరఖాస్తు తిరస్కరణకు గురవడంతో వారిని ఏ క్షణంలో అయినా  వెనక్కి తిప్పి పంపే పరిస్థితి ఏర్పడుతుంది. 

 

చిత్ర దర్శకుని జీవితంతో కూడా ముడి పడి ఉన్న అంశాన్ని తాను కథగా మలిచానన్న అంశాన్ని అంటి రౌతవా విలేకరుల సమావేశంలో వివరించారు. “ హమీ రమేజాన్   మరియు అతని కుటుంబం అతనికి  9 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఇరాన్ నుంచి ఫిన్‌లాండ్‌కు పారిపోయారు. ఈ చిత్రం అతనికి  చాలా సన్నిహితంగా మరియు వ్యక్తిగతంగా ఉంటుంది.' అని అంటి రౌతవా తెలిపారు. '   " తొలుత సిద్ధం చేసిన కథ ఒక  పీడకలగా, అర్థం కాని  విధంగా రూపొందింది. ఈ సమయంలో హమీ చిత్ర నిర్మాత తో మాట్లాడి  రచన భాగస్వామి కలిగి ఉండడం మంచిదని సూచించారు" అని వివరించారు. 

' కుటుంబ బంధాలను శక్తివంతమైన వ్యక్తీకరణల ద్వారా చిత్రీకరించడానికి ప్రయత్నించాము. వారు ఏ నిమిషంలోనైనా బహిష్కరించబడే అవకాశం ఉన్న సమయంలో వారు ఎదుర్కొన్న భయాందోళనల మధ్య వారు ప్రవర్తించిన తీరు, వ్యక్తిత్వాన్ని రక్షించుకోవడానికి చేసిన ప్రయత్నాలు, పరిస్థితులతో రాజీ పడి జీవిస్తూ భవిష్యత్తుపై వారు పెట్టుకున్న ఆశలు చిత్రంలో భాగంగా ఉంటాయి' అని వివరించారు. 

తాను, చిత్ర దర్శకుడు విభిన్న సంస్కృతులు, జాతులకు చెందిన వ్యక్తులం కావడంతో సమస్యలు, సవాళ్లు ఎదురయ్యాయని అయితే వీటిని సమన్వయంతో పరిష్కరించుకుని ముందుకు సాగామని అంటి రౌతవా అన్నారు. , “హామీ అందించిన సహకారంతో నా పని సులువైంది. అతను తన వ్యక్తిగత కథ, జీవన ప్రయాణాన్ని వివరించారు. ఏ ఒక్క చిన్న అంశాన్ని మరచి పోకుండా తన చిన్ననాటి నుంచి జరిగిన ప్రతి సంఘటనను వివరించారు; అని రచయిత వివరించారు. తన చిన్నతనాన్ని, కుటుంబ సభ్యులతో సాగించిన ప్రయాణాన్ని, చేసిన సాహసాలను కొన్ని నవ్వు తెప్పించే సంఘటనలను పూర్తిగా వివరించారని ఆయన చెప్పారు. లోతుగా సుదీర్ఘంగా సాగిన సంభాషణలతో కుటుంబ అంశాలను తాను అర్థం చేసుకుని కథను సిద్ధం చేశానని అన్నారు. 

 52 వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో చిత్రానికి లభిస్తున్న స్పందన ఆదరణ పట్ల రౌతవా హర్షం వ్యక్తం చేశారు. ' ప్రేక్షకులు చిత్రంలో తమను తాము చూసుకుంటూ కుటుంబ సభ్యుల మధ్య ఉండాల్సిన బంధం,ఐక్యత, ప్రేమానురాగాలను గుర్తు చేసుకుంటున్నారు. మెహదీపూర్ కుటుంబ సభ్యుల ప్రయాణం ఇటువంటి చలన చిత్రోత్సవాల ద్వారా కొనసాగుతుంది.' అని అన్నారు. 

ఎనీ డే హౌ  - కథ

 హామీ రమేజాన్ దర్శకత్వం వహించిన ఎనీ డే హౌ చిత్రం    ఫిన్‌లాండ్‌లోని శరణార్థి శిబిరంలో నివసిస్తున్న పదమూడేళ్ల రామిన్ మెహదీపూర్ మరియు అతని ఇరానియన్ కుటుంబం  కథ ఆధారంగా రూపొందింది.  రామిన్ పాఠశాల సెలవులు ప్రారంభం అయిన వెంటనే  ఆశ్రయం కోసం వారు చేసిన  దరఖాస్తు తిరస్కరించబడింది అనే  వార్త కుటుంబానికి అందుతుంది.  బహిష్కరణ ప్రమాదం పొంచి ఉంది.  రామిన్ కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించినప్పుడు  అతనికి ప్రతి క్షణంప్రతి స్నేహం గతంలో కంటే చాలా విలువైనది గా అనిపిస్తుంది. 

 

***



(Release ID: 1775308) Visitor Counter : 123