రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2వ గ్లోబల్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ (జిసిపిఎంహెచ్)ను ప్రారంభించిన కేంద్ర రసాయనాలు,ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవియా


భారత్ ను ప్రపంచ రసాయన ,పెట్రో రసాయన తయారీ కేంద్రంగా మార్చాలనే తన దార్శనికతను పంచుకున్న కేంద్ర మంత్రి

వ్యాపార సౌలభ్యం, సంపద సృష్టికర్తలకు మద్దతు ఇవ్వడానికి అనేక చర్యలు: డాక్టర్ మాండవియా

Posted On: 25 NOV 2021 2:27PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ కృషి , పట్టుదల భారత దేశాన్ని ప్రపంచ రసాయన , పెట్రో రసాయన తయారీ కేంద్రంగా మారుస్తుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయన, ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవియా తెలిపారు.  ఈ రోజు ఢిల్లీలో రెండవ గ్లోబల్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ (జిసిపిఎంహెచ్) ప్రారంభ సమావేశంలో ఆయన ఈ విషయం తెలిపారు. కేంద్ర రసాయనాలు. ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖుబా నూతన ,పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి  శ్రీ భగవంత్ ఖుబా , కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి, తమిళనాడు ప్రభుత్వ పరిశ్రమల శాఖ మంత్రి తిరు తంగం తెన్నారసు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

ఈ సమావేశాన్ని ఉద్దేశించి డాక్ట ర్ మాండవియా ప్రసంగిస్తూ, భారత ప్రభుత్వం రైతులకు అనుకూలమైనదని, పరిశ్రమకు స్నేహపూర్వక మైనదని, భాగస్వాములందరి సహకారంతో మాత్రమే భారత్ ముందుకు సాగగలదని అన్నారు. . రాష్ట్ర అభివృద్ధికి సంపద సృష్టికర్తలను ప్రశంసించాలనే ఆచార్య చాణక్య ఆలోచనను ఆయన ఉటంకించారు. సంపద సృష్టి ఒక నైపుణ్యం అని, భారత ప్రభుత్వం తన సంపద సృష్టికర్తలకు సాధ్యమైనంత వరకు మద్దతు ఇవ్వడానికి అంకితమయిందని  ఆయన అన్నారు.

 

పిఎల్ ఐ పథకం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కార్పొరేట్ ట్యాక్స్ లో సంస్కరణలు, ఎంఎస్ ఎంఈ రంగానికి మద్దతు సహా అనేక కార్యక్రమాలను భారత ప్రభుత్వం చేపట్టిందని డాక్టర్ మాండవియా తెలిపారు. ఈ కార్యక్రమాలు భారతదేశాన్ని పరిశ్రమలకు ఒక ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చాయని అన్నారు. దేశంలో ఆర్ అండ్ డి ,సృజనాత్మకత  పెంచడానికి వాటాదారులంతా  కలిసి రావాలని ఆయన నొక్కి చెప్పారు.భారత శాస్త్రవేత్తల సూచనల మేరకు ప్రభుత్వం మ ద్ద తును అందిస్తోందని, ఈ రోజు మనకు ప్రయోజనం కల్పించిన శీఘ్ర వ్యాక్సిన్ ప రిశోధన కకోసం  వారికి ఎంతో అవసరమైన వాతావరణాన్ని ప్రభుత్వం అందించిందని చెప్పారు. అదేవిధంగా, పిఎల్ఐ పథకం దేశీయ పరిశ్రమలకు వారి ఉత్పత్తిని పెంచడంలోనూ, ప్రపంచ బ్రాండ్లను ఆకర్షించడంలోనూ  సహాయపడుతుందని,  తద్వారా దేశంలో తయారీ రంగాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తోందని తెలిపారు. ప్రభుత్వం వాటాదారుల నుండి నిరంతరం  ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ, తన  విధానాలను మెరుగుపరుస్తోందని,  భారత్ ఈ రోజు మానవ శక్తి ని, మరియు బ్రాండ్ శక్తి నీ రెంటినీ కలిగి ఉందని, నిర్ణయాలు తీసుకునేవారు, వ్యాపార నాయకులు ఈ శక్తిని దేశం మొత్తం అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని డాక్టర్ మాండవియా కోరారు.

 

శ్రీ భగవంత్ ఖుబా ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ఏడు సంవత్సరాల నుండి భారత్ ను కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ రంగంలో ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం స్థిరమైన ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.  ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులకు భారతదేశాన్ని ప్రాధాన్య గమ్యస్థానంగా మార్చడానికి స్వదేశీ ఉత్ప త్తి, మెరుగైన ఆర్ అండ్ డి, నూతన  ఆవిష్కరణలు  అవసరమని  ఆయన నొక్కి చెప్పారు.

 

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ)తో కలసి భారత ప్రభుత్వ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ విభాగం సంయుక్తంగా ఫైజిటల్ ఫార్మెట్ (ఫిజికల్ అండ్ డిజిటల్)లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

 

"ఇండియా: గ్లోబల్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్" 2021 (జిసిపిఎమ్ హెచ్ 2021) శిఖరాగ్ర సమావేశం కెమికల్ అండ్ పెట్రోకెమికల్పరిశ్రమలో ముఖ్యమైన కార్యక్రమాలలో ఒకటి.  ఇది ప్రపంచానికి భారతీయ రసాయనాలు ,పెట్రోకెమికల్స్ రంగం సామర్థ్యాన్ని చాటి చెబుతుంది. అలాగే, ప్రస్తుత మహమ్మారి నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు ప్రాధాన్య గమ్యస్థానంగా పరిగణించబడుతుంది.

 

జిసిపిఎమ్ హెచ్ ప్రస్తుత ఎడిషన్ భారత ఆర్థిక వ్యవస్థలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రధాన రంగం యొక్క గొప్ప అవలోకనం అందిస్తుంది. పెట్టుబడిదారులు ,ఇతర భాగస్వాములు పరస్పర సంబంధాలను ఏర్పరుచుకోవడానికి, సంబంధిత పెట్టుబడి ప్రాంతాల్లో సెగ్మెంట్ ల వారీగా పెట్టుబడి అవకాశాలను హైలైట్ చేయడానికి ,ప్రోత్సహించడానికి ఒక వేదికగా ఉంటుంది, దీని ద్వారా వాణిజ్యం పెట్టుబడులకు పరస్పర ప్రయోజనకరమైన మార్గంలో అపారమైన సామర్థ్యాన్ని అందిస్తుంది.

 

జిసిపిఎమ్ హెచ్ 2021 లో- పిసిపిఐఆర్ ల సామర్థ్యాన్ని అన్వేషించడం ,రీజియన్, సెక్టార్ ,ఎకానమీలో సమ్మిళిత వృద్ధికి మార్గం సుగమం చేయడం; వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాలు; కోవిడ్ అనంతర కాలంలో కెమికల్ ,పెట్రోకెమికల్ పరిశ్రమలో అభివృద్ధి చెందుతున్న అవకాశాలు; కెమికల్ , పెట్రోకెమికల్ ఇండస్ట్రీ భవిష్యత్తును రూపొందించడంలో పర్యావరణ, సామాజిక ,కార్పొరేట్ గవర్నెన్స్ ,సర్క్యులర్ ఎకానమీ ప్రాముఖ్యత; ఫీడ్ స్టాక్ డైనమిక్స్; కెమికల్స్ పెట్రోకెమికల్స్ ఇండస్ట్రీలో సప్లై ఛైయిన్ అంతరాయాలు; సస్టైనబుల్ గ్రీన్ కెమిస్ట్రీ; పారిశ్రామిక వేగాన్ని వృద్ధిని నిలుపుకోవడంలో డిజిటలైజేషన్ పాత్ర వంటి  ముఖ్య అంశాలను చర్చిస్తున్నారు.

 

ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు దేశాలు ఈ సదస్సులో భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటున్నాయి. కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ యోగేంద్ర త్రిపాఠి, హెచ్ పిసిఎల్-మిట్టల్ ఎనర్జీ మేనేజింగ్ డైరెక్టర్ , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ప్రభు దాస్, ఫిక్కీ నేషనల్ కెమికల్ కమిటీ విసి చైర్మన్ శ్రీ దీపక్ సి మెహతా కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

***


(Release ID: 1775147) Visitor Counter : 176


Read this release in: English , Marathi , Hindi