రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

2వ గ్లోబల్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ (జిసిపిఎంహెచ్‌)ని రేపు ప్రారంభించనున్న కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల మంత్రి


భారతదేశాన్ని గ్లోబల్ కెమికల్ మరియు పెట్రో-కెమికల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చడం ఈ సదస్సు లక్ష్యం

Posted On: 24 NOV 2021 4:20PM by PIB Hyderabad

 

2వ గ్లోబల్ కెమికల్స్ & పెట్రోకెమికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ (జిసిపిఎంహెచ్‌)ని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమం, రసాయనాలు & ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా రేపు కేంద్ర కొత్త మరియు పునరుత్పాదక శక్తిశాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖుబా సమక్షంలో ప్రారంభించనున్నారు.

భారత ప్రభుత్వ కెమికల్స్ & పెట్రోకెమికల్స్ డిపార్ట్‌మెంట్, కెమికల్స్ & ఫెర్టిలైజర్స్ మినిస్ట్రీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కి) సంయుక్తంగా ఫిజిటల్ ఫార్మాట్‌లో (భౌతిక మరియు డిజిటల్) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.  ప్రపంచ రసాయన మరియు పెట్రో రసాయన తయారీ కేంద్రంగా భారతదేశాన్ని మార్చడమే సదస్సు లక్ష్యంగా పెట్టుకుంది.

భారత రసాయనాలు మరియు పెట్రో రసాయనాల రంగం యొక్క నిజమైన సామర్థ్యాన్ని ప్రపంచానికి ఈ సమ్మిట్ తెలియజేస్తుంది. కొవిడ్ మహమ్మారి ప్రారంభమైన తర్వాత భారతదేశం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు ప్రాధాన్యత కలిగిన గమ్యస్థానంగా పరిగణించబడుతోంది. జిసిపిఎంహెచ్‌ యొక్క ఈ ఎడిషన్ భారత ఆర్థిక వ్యవస్థలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రధాన రంగం గురించి గొప్ప అవలోకనాన్ని అందిస్తుంది. పెట్టుబడిదారులు మరియు ఇతర వాటాదారులకు వేదికగా ఉంటుంది. సంస్థల మధ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి, సంబంధిత పెట్టుబడి ప్రాంతాలలో సెగ్మెంట్ వారీగా పెట్టుబడి అవకాశాలను హైలైట్ చేయడం మరియు ప్రోత్సహించడం, తద్వారా పరస్పర ప్రయోజనకరమైన మార్గంలో వాణిజ్యం మరియు పెట్టుబడులకు అపారమైన సామర్థ్యాన్ని ఈ సదస్సు అందిస్తుంది.

జిసిపిఎంహెచ్‌ 2021 సమయంలో పిసిపిఐఆర్‌ల సామర్థ్యాన్ని అన్వేషించడం మరియు ప్రాంతం, రంగం మరియు ఆర్థిక వ్యవస్థలో సమగ్ర వృద్ధికి మార్గం సుగమం చేయడం వంటి ముఖ్యమైన సమస్యలు; వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాలు; కోవిడ్ అనంతర కాలంలో కెమికల్ & పెట్రోకెమికల్ పరిశ్రమలో అవకాశాల పెరుగుదల; రసాయన మరియు పెట్రోకెమికల్ పరిశ్రమ యొక్క భవిష్యత్తును రూపొందించడంలో పర్యావరణ, సామాజిక మరియు కార్పొరేట్ గవర్నెన్స్ మరియు సర్క్యులర్ ఎకానమీ  ప్రాముఖ్యత; ఫీడ్‌స్టాక్  డైనమిక్స్; కెమికల్స్ & పెట్రోకెమికల్స్ పరిశ్రమలో సరఫరా వ్యవస్థలు; సస్టైనబుల్ గ్రీన్ కెమిస్ట్రీ; మరియు పారిశ్రామిక వేగాన్ని మరియు వృద్ధిని నిలుపుకోవడంలో డిజిటలైజేషన్ పాత్ర గురించి ఇందులో చర్చించబడుతుంది.

ఈ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలో కేంద్రమంత్రి ప్రారంభించనున్నారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు మరియు వాణిజ్య శాఖల మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి మరియు గౌరవనీయులైన తమిళనాడు ప్రభుత్వ పరిశ్రమల శాఖ మంత్రి తిరు తంగం తెన్నరసు కూడా హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిశా , రాజస్థాన్ మరియు తమిళనాడులు సమ్మిట్‌లో భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటున్నాయి.


 

****



(Release ID: 1774853) Visitor Counter : 133


Read this release in: English , Hindi , Marathi , Tamil