వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఆహార శాఖల మంత్రులతో సమావేశం కానున్న శ్రీ పియూష్ గోయల్


మోడల్ కమ్యూనిటీ కిచెన్ పథకంతో పాటు ఒక దేశం ఒక రేషన్ కార్డు అంశాలపై చర్చలు

రేషన్ కార్డులను ఆధార్ తో అనుసంధానం చేయడం, చౌక ధరల దుకాణాల్లో బయోమెట్రిక్‌ విధానంలో కార్యకలాపాలను అనుమతించే అంశాలపై కూడా చర్చలు

Posted On: 24 NOV 2021 6:50PM by PIB Hyderabad

కేంద్ర వినియోగదారుల వ్యవహారాలుఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ 25.11.2021న న్యూఢిల్లీలో ఆహార శాఖల మంత్రుల జాతీయ సమావేశాన్ని నిర్వహించనున్నది. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమలవినియోగదారుల వ్యవహారాలుఆహారం , ప్రజా పంపిణీ , జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ఆహార శాఖల మంత్రులు పాల్గొనే ఈ సమావేశంలో కమ్యూనిటీ కిచెన్ మరియు ఇతర అంశాలను చర్చిస్తారు. 

దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కిచెన్ వ్యవస్థను నెలకొల్పి  ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధికి మించి అవసరమైన పథకాన్ని రూపొందించి,  పేదలకు ఆహారాన్ని అందించడానికి  చర్యలు అమలు చేయాలనిఆకలి మరియు పోషకాహార లోపం లాంటి సమస్యలను పరిష్కరించడానికి  జాతీయ ఆహార గ్రిడ్‌ను రూపొందించాలని కోరుతూ ఇటీవల సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. 

దీనికి స్పందించిన సుప్రీంకోర్టు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా మూడు వారాల లోగా కమ్యూనిటీ కిచెన్స్ స్కీమ్‌ను రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే సమావేశానికి హాజరు కావాలని, పథకాన్ని అమలు చేయడానికి సహకరించాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే విధంగా పథకాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. 

ఢిల్లీలో జరగనున్న జాతీయ ఆహార శాఖల మంత్రుల సమావేశంలో  మోడల్ కమ్యూనిటీ కిచెన్ పథకంతో పాటు, ఒక దేశం ఒక రేషన్ కార్డు కార్యక్రమం అమలు జరుగుతున్న తీరు, రేషన్ కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానించడం,  చౌక ధరల దుకాణాల్లో బయోమెట్రిక్‌ విధానంలో కార్యకలాపాలను అనుమతించే అంశంతో పాటు ఇతర అంశాలు చర్చకు రానున్నాయి. 

అంతకుముందుమోడల్ కమ్యూనిటీ కిచెన్ పథకం పై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ  కార్యదర్శి 21 నవంబర్ 2021న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల  ముఖ్య కార్యదర్శులు మరియు ఆహార కార్యదర్శులతో చర్చలు జరిపారు. 

***



(Release ID: 1774777) Visitor Counter : 97