గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
పిఎంఎవై (యు) కింద ఆమోదించిన 3.61 లక్షల గహాల నిర్మాణానికి ప్రతిపాదనలు
పిఎంఎవై-యు కింద జరిగిన 56వ సిఎస్ఎంసి సమావేశానికి అధ్యక్షత వహించి ఎంహెచ్‌యుఎ కార్యదర్శి
Posted On:
24 NOV 2021 10:03AM by PIB Hyderabad
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కేంద్ర మంజూరు, పర్యవేక్షణ కమిటీ ( సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ - సిఎస్ఎంసి) 56వ సమావేశం 23 నవంబర్ 2021న గృహ& పట్టణ వ్యవహారాల శాఖ (ఎంహెచ్‌యుఎ) కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా అధ్యక్షతన జరిగింది. భాగస్వామ్యంతో అందుబాటులో గృహనిర్మాణం (అఫర్డబుల్ హౌజింగ్ ఇన్ పార్ట్నర్‌షిప్ - ఎహెచ్‌పి), లబ్ధిదారుల నాయకత్వంలో నిర్మాణం (బెనిఫిషియరీ లెడ్ కనస్ట్రక్షన్ ( బిఎల్‌సి), పిఎంఎవై-యుకు సంబంధించిననిర్ధిష్ట పథకాలలో ఒకటైన సీతు మురికివాడల పునర్నిర్మాణం (ఐఎస్ఎస్ఆర్) కింద మొత్తం 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 3.61 లక్షల గృహాలను నిర్మించేందుకు అనుమతిచ్చారు.
మిషన్ కింద రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో గృహ నిర్మాణానికి సంబంధించిన సమస్యలను సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంహెచ్‌యుఎ కార్యదర్శి చేపట్టారు. గృహ నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు వీలుగా ఆయా సమస్యలను పరిష్కరించవలసిందిగా రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరారు.
బల్ల వద్ద కూర్చున్న వ్యక్తుల బృందానికి సంబంధించిన వివరణ యాంత్రికంగా తక్కువ విశ్వాసాన్ని కలిగించింది.
పిఎంఎవై-యు కింద గృహనిర్మాణాలు వివిధ దశలలో ఉన్నాయి. మిషన్ కింద మంజూరు చేసిన మొత్తం గహాల సంఖ్య 1.14 కోట్లు కాగా, ఇందులో 89 లక్షల గృహాల నిర్మాణం పనులు ప్రాథమికంగా ప్రారంభంగా కాగా, 52.5 లక్షల గృహాల నిర్మాణాన్ని పూర్తి చేసి, లబ్ధిదారులకు అందించడం జరిగింది. మిషన్ కింద మొత్తం పెట్టుబడి రూ. 7.52 లక్షల కోట్లు. ఇందులో కేంద్ర సాయం రూ. 1.85 లక్షల కోట్లు. ఇప్పటివరకూ రూ. 1.13 లక్షల కోట్ల నిధులను విడుదల చేశారు. దీనితోపాటుగా,14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన సవరణలకు సిఎస్ఎంసి ఆమోదాన్ని తెలిపింది. ఈ గృహాల సంఖ్య 3.74 లక్షలు.
పిఎంఎవై- యు కింద నిర్ధిష్ట కాలపరిమితిలో దేశవ్యాప్తంగా నిర్మాణాన్ని పూర్తి చేసి, 2022 నాటికి హౌజింగ్ ఫర్ ఆల్ అన్న లక్ష్యాన్ని సాధించాలని ఎంహెచ్‌యుఎ కార్యదర్శి పునరుద్ఘాటించారు.
సిఎస్ఎంసి సమావేశంలో ఎంహెచ్‌యుఎ కార్యదర్శి ఇ-ఫైనాన్స్ మాడ్యూల్ ను ప్రారంభించారు. ఇ-ఫైనాన్స్ మాడవ్యూల్‌ను పిఎంఎవై-యు ఎంఐఎస్ వ్యవస్థలతో ఏకీకృతం చేసి, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పద్ధతి ద్వారా అందించేందుకు, లబ్ధిదారుల ధృవీకరణకు ఇందులోని భాగస్వాములందరికీ నిధుల పంపిణీకి ఒక ప్రత్యేక వేదికను అందించే లక్ష్యంతో పిఎంఎవై-యు ఎంఐఎస్ వ్యవస్థను రూపొందించి అభివృద్ధి చేశారు.
ఎటువంటి తప్పుడు సమాచారాన్నైనా గుర్తించి, తొలగించాలన్న నిర్ధిష్ట ప్రయోజనంతో ఇ-ఫైనాన్స్ మాడ్యూల్‌ను ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు పారదర్శకత ఉంటుంది, ఆర్ధిక డాటా మొత్తాన్ని ఈ వేదికపై ఉంచడం జరుగుతుందని ఎంహెచ్‌యుఎ కార్యదర్శి ఈ మాడ్యూల్‌ను ప్రారంభిస్తూ అన్నారు. ఈ మాడ్యూల్ ను త్వరితగతిన అమలు చేసేందుకు అధికారులకు / ఎంఐఎస్ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలను రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా నిర్వహించవలసిందిగా ఆయన ఆదేశించారు.
తెలంగాణ, తమిళనాడులో అఫర్డబుల్ రెంటల్ హౌజింగ్ కాంప్లెక్సెస్ (ఎఆర్‌హెచ్‌సిలు)- మోడల్-2 ప్రతిపాదనలకు ఎంహెచ్‌యుఎ కార్యదర్శి ఆమోదాన్ని తెలిపారు. మొత్తం 19,535 పట్టణ వలసదారుల/ నిరుపేదలకు రూ. 39.11 కోట్ల టెక్నాలజీ ఇన్నొవేషన్ గ్రాంట్‌తో అనుమతి జారీ చేశారు.
ఖాళీగా ఉన్న జెఎన్ఎన్‌యుఆర్ఎం గృహాలను ఉపయోగించుకుని ఎఆర్‌హెచ్‌సిలను సరిగా అమలు చేసేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎంహెచ్‌యుఎ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. మోడల్ 2 ఎఆర్‌హెచ్‌సిల కింద మరిన్ని ప్రతిపాదనలతో ముందుకు రావలసిందిగా భాగస్వాములను ఆయన ప్రోత్సహించారు.
నగర ప్రాంతాలలో తమ పని ప్రదేశానికి సన్నిహితంగా నగర వలసదారులు/ పేదలకు అందుబాటులో అద్దె వసతిని కల్పించేందుకు ఎఆర్‌హెచ్‌సిలు అవకాశాన్ని ఇస్తాయి. ఎఆర్‌హెచ్‌సి పథకాన్ని రెండు నమూనాల కింద అమలు చేస్తారు. మోడల్ 1 కింద ఉనికిలో ఉన్న ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఖాళీ గృహాలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ లేదా ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఎఆర్‌హెచ్‌సిలుగా మారుస్తారు. మోడల్ -2 కింద తమ స్వంత ఖాళీ స్థలంలో ఎఆర్‌హెచ్‌సిల నిర్మాణం, నిర్వహణను పబ్లిక్ / ప్రైవేట్ సంస్థలు చేస్తాయి.
***
(Release ID: 1774760)
Visitor Counter : 114