నీతి ఆయోగ్
సంకల్ప ప్రకటనపై సంతకాలు చేసి, నీతీ ఆయోగ్- బిఎంజెడ్ అభివృద్ధి సహకారంపై చర్చ / సమావేశం చొరవకు శ్రీకారం చుట్టిన నీతీ ఆయోగ్, ఫెడరల్ మినిస్ట్రీ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ & డెవలప్‌మెంట్ (బిఎంజెడ్)
प्रविष्टि तिथि:
23 NOV 2021 4:14PM by PIB Hyderabad
పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో భారత్, జర్మనీల మధ్య సహకారాన్ని ప్రోత్సహించేందుకు నీతీ ఆయోగ్ (NITI Aayog ), ఫెడరల్ మినిస్ట్రీ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ & డెవలప్‌మెంట్ (BMZ) నవంబర్ 23, 2021న సంకల్ప ప్రకటన ( Statement of Intent (SoI))పై సంతకాలు చేశాయి. భారత్ బృందానికి భారత ప్రభుత్వ నీతి ఆయోగ్ వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ రాజీవ్ కుమార్ నేతృత్వం వహించగా, జర్మన్ బృందానికి జర్మనీ ప్రభుత్వ బిఎంజెడ్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ డాక్టర్ క్లాడియా వార్నింగ్ నాయకత్వం వహించారు.
నియమిత కాలిక ద్వైపాక్షిక చర్చలు, అభివృద్ధి విధానాల అనుభవాన్ని పంచుకోవడం, కొనసాగుతున్న ఇతర ద్వైపాక్షిక కార్యక్రమాల అవలోకనం మార్గాల కోసం ఒక ఉమ్మడి వేదికను సులభతరం చేసేందుకు నీతీ ఆయోగ్- బిఎంజెడ్ అభివృద్ధి సహకారంపై చర్చ / సమావేశం అనే విస్త్రతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఎస్ఒఐ భావిస్తోంది.
ఈ ఎస్ఒఐ పరిధి కింద, నీతీ ఆయోగ్, బిఎంజెడ్ బహుళ రంగాల సవాళ్ళను పరిష్కరించేందుకు విధానాలను, రూపొందించేందుకు, పద్ధతులను అభివృద్ధి చేయడంలో తోడ్పడేందుకు సంయుక్త పరిశోధనను చేపడతాయి. ఇరువైపులకు చెందిన ప్రభుత్వ సంస్థలు, ప్రముఖ మేథోమథన కర్తలు (థింక్ ట్యాంకులు), పరిశ్రమలు, విద్యా సంస్థలు ఉచితమైన సమస్యలను విశ్లేషించి, పరస్పర చర్చల కోసం సమాచారాన్ని అందించేందుకు భాగస్వామ్యం వహిస్తాయి.
పర్యావరణం, నికర అప్రభుత్వ సంస్థలు, ప్రముఖ థింక్ ట్యాంక్‌లు, పరిశ్రమలు మరియు విద్యాసంస్థలు ఔచిత్యంతో కూడిన సమస్యలను విశ్లేషించడానికి మరియు రెండు వైపులా చర్చల కోసం ఇన్‌పుట్‌ను అందించడానికి రెండు వైపుల నుండి పాల్గొంటాయి.
పర్యావరణం, నికర అభివృద్ధి లక్ష్యాలు, ఇంధనం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వ్యవసాయ శాస్త్ర రంగాలలో ద్వైపాక్షిక సహకార ప్రాముఖ్యతను నీతీ ఆయోగ్, బిఎంజెడ్ గుర్తించాయి. ఇటీవలి కాలంలో ఇరు పక్షాలు కూడా ఈ రంగాలలో సహకారాన్ని ముందుకు తీసుకుపోవడంలో చురుకుగా నిమగ్నమై ఉన్నాయి. ఇరు వర్గాలు ఎస్ఒఐపై సంతకాలు చేయడం అన్నది ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేస్తుంది.
ఇరువైపులూ కీలకమని పరిగణించిన అంశాలపై చర్చించి, పరిజ్ఞానాన్ని పంచుకునేందుకు ద్వైవార్షిక చర్చగా నీతీ ఆయోగ్- బిఎంజెడ్ అభివృద్ధి సహకారంపై సమావేశంఉండనుంది. ఈ చర్చకు నీతీ ఆయోగ్ వైస్ చర్మన్, బిఎంజెడ్ దక్షిణాసియా సహకారాన్ని బాధ్యులైన బిఎంజడ్ డేరెక్టర్ జనరల్ నాయకత్వం వహిస్తారు. తొలి సమావేశాన్ని ఫిబ్రవరి 2022లో నిర్వహించాలని భావిస్తున్నారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని డాక్టర్ కుమార్, ప్రొఫెసర్ డాక్టర్ వార్నింగ్ ప్రారంభపు ఎస్‌డిజి అర్బన్ ఇండెక్స్ & డాష్ బోర్డ్ (2021-22)ను ఆరంభించారు. నికారభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డిజి) అర్బన్ ఇండెక్స్ & డాష్‌బోర్డ్ 56 పట్టణ ప్రాంతాలను 77 ఎస్‌డిజి సూచీల ఆధారంగా ర్యాంకింగ్ ఇస్తుంది. ఈ సూచీలపై డాటాను వివిధ మంత్రిత్వ శాఖలు, ఇతర ప్రభుత్వ డాటా ఆధారాలైన ఎన్ఎఫ్‌హెచ్ఎస్, ఎన్‌సిఆర్‌బి, యు-డిఐఎస్ఇ నుంచి తీసుకున్నారు. ఇండెక్స్&డ్యాష్ బోర్డ్ ఎస్డీజీ స్థానికీకరణను బలోపేతం చేసి, నగర స్థాయిలో ఆరోగ్యవంతమైన ఎస్‌డిజి పర్యవేక్షణను ఏర్పాటు చేస్తుంది. యుఎల్‌బి స్థాయి డాటా, పర్యవేక్షణ, నమోదు వ్యవస్థలలోని బలాలను, లోపాలను, పట్టి చూపుతుంది. భాగస్వాములందరూ కూడా డాటా ఆధారిత నిర్ణయాలు తీసుకుని, అమలు చేసేందుకు ఇండెక్స్& డాష్‌బోర్డ్ వంటి సాధనాలు తగిన వాతావవరణాన్ని సృష్టించేందుకు తోడ్పడటమే కాక వారు సన్నద్ధమవడానికి సహాయం పడతాయి. భారతదేశ అభివృద్ధి భవిష్యత్తును నిర్ణయించడంలో మన నగర, పట్టణ ప్రాంతాలకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరివర్తనాత్మక మార్పు అత్యవసరం.
ఫ్రాంటియర్ టెక్నాలజీ వంటి రంగాలలో సహకారం విషయంలో, పర్యావరణ మార్పుతో ముడిపడి ఉన్న సవాళ్ళను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పరిష్కరించేందుకు జర్మనీతో కలిసి పని చేసే సాధ్యతను నీతీ ఆయోగ్ అన్వేషిస్తుందని డాక్టర్ కుమార్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి పారదర్శకత, పక్షపాతం, నిజాయితీ, జవాబుదారీతనం, గోపత్యకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు జర్మన్ పక్షంతో కలిసి పని చేయాలని నీతీ ఆయోగ్ కోరుకుంటోంది.
***
(रिलीज़ आईडी: 1774413)
आगंतुक पटल : 171