శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇస్రో ఆధ్వర్యంలో ఫ్యూచరిస్టిక్ మరియు డిస్ట్రప్టివ్ టెక్నాలజీస్ ప్రదర్శించబడే 5-రోజుల టెక్నాలజీ కాన్క్లేవ్-2021ని ప్రారంభించిన కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్


ప్రతి పౌరుడి జీవితాన్ని స్పృశించేలా ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలలో ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ యొక్క స్పిన్-ఆఫ్ అప్లికేషన్లు తప్పనిసరిగా అమలు చేయబడాలని చెప్పారు.

భవిష్యత్ సాంకేతికతల అభివృద్ధికి పరిశ్రమలు మరియు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం తప్పనిసరి అని మంత్రి చెప్పారు.

Posted On: 22 NOV 2021 5:53PM by PIB Hyderabad

కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ఎర్త్ సైన్సెస్ సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యత) ; ఎంవోఎస్‌ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్ డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ఇస్రో  5-రోజుల టెక్నాలజీ కాన్క్లేవ్-2021ని ప్రారంభించారు.  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ద్వారా అభివృద్ధి చేయబోయే భవిష్యత్తు మరియు ఆధునిక సాంకేతికతలను హైలైట్ చేశారు. ఇస్రో ఆధ్వర్యంలో డైరెక్టరేట్ ఆఫ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ & ఇన్నోవేషన్ (డిటిడిఐI) ఈ కాన్క్లేవ్‌ను నిర్వహిస్తోంది.

కాన్‌క్లేవ్‌ను ఉద్దేశించి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ " ఇస్రో హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ & ఇన్నోవేషన్ (డిటిడిఐI) పరిశ్రమ, ఇన్నోవేటర్లు మరియు పరిశోధన మరియు ఆర్‌ అండ్‌ డి కోసం అకాడెమియాకు ఒక ముఖ్యమైన సాధనమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అంతరిక్ష సాంకేతికతకు విశేష ప్రోత్సాహం అందిస్తున్నారని, 70 ఏళ్లలో తొలిసారిగా ప్రయివేటు భాగస్వామ్యంతో భారత్‌ను పోటీతత్వ స్పేస్‌ మార్కెట్‌గా మార్చేందుకు ఈ రంగాన్ని అన్‌లాక్ చేశారన్నారు.

image.png
కొన్ని ఫ్యూచరిస్టిక్ మరియు డిస్ట్రప్టివ్ టెక్నాలజీల గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ " శాటిలైట్ ఆధారిత క్వాంటం కమ్యూనికేషన్ అభివృద్ధి దేశ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌కు షరతులు లేని డేటా భద్రతను అనుమతిస్తుంది. అహ్మదాబాద్‌లో ఇస్రో 300 మీటర్ల దూరంలోని ఖాళీ స్థలంలో క్వాంటం కమ్యూనికేషన్‌ను ఇటీవల ప్రదర్శించడం శాటిలైట్ ఆధారిత క్వాంటం కమ్యూనికేషన్ అభివృద్ధికి ఒక ప్రధాన మైలురాయి. దీనిని మన దేశం సమీప భవిష్యత్తులో ప్రదర్శించడానికి ప్రయత్నిస్తోందని"  అన్నారు. ప్రతి ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీకి సంభావ్య స్పిన్-ఆఫ్ అప్లికేషన్‌లు ఉన్నాయని, ప్రతి పౌరుడి జీవితాన్ని స్పృశించే కేంద్రీకృత ప్రాంతాలు మరియు ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలలో వీటిని తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన సూచించారు.

ఇస్రో తన వివిధ ఉపగ్రహ మిషన్లు మరియు భూ-ఆధారిత వ్యవస్థల నుండి అపారమైన డేటాను ఉత్పత్తి చేస్తున్నందున పెట్టుబడి యొక్క మరొక రంగంగా బిగ్ డేటా అనలిటిక్స్‌ను ఎంచుకున్నందుకు మంత్రి ఇస్రోను అభినందించారు. ఇస్రో తన మేధోపరమైన మరియు ఆర్థిక వనరుల పరంగా పెట్టుబడి పెట్టడం వల్ల అంతరిక్ష రంగానికి భవిష్యత్ సాంకేతికతలు పుష్కలంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/మెషిన్ లెర్నింగ్, స్పేస్ డెబ్రిస్, గ్లోబల్ క్లైమేట్ స్టడీ, స్పేస్‌కి కాస్ట్ ఎఫెక్టివ్ టెక్నాలజీ యాక్సెస్, స్పేస్ సిస్టమ్స్ కోసం కాంపోనెంట్స్ & పార్ట్‌ల స్వదేశీ తయారీ, గ్రీన్ ప్రొపెల్లెంట్స్ వంటి థ్రస్ట్ రంగాలపై దృష్టి సారించాలని ఆయన శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి దార్శనికత అయిన 'ఆత్మనిర్భర్ భారత్' మిషన్‌ను సాధించడానికి ఇస్రో భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాల వినియోగాన్ని విస్తరించడానికి యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

అంతరిక్ష సంస్కరణల అనంతర కాలంలో అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞాన స్వరూపం మారిపోయిందని, వినూత్న సాంకేతికతలకు పరిశోధన మరియు అభివృద్ధితో పాటు భవిష్యత్  సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో పరిశ్రమలు, ప్రైవేట్ సంస్థలు భాగస్వామ్యాన్ని తప్పనిసరిగా ప్రారంభించాలని డాక్టర్ జితేంద్ర సింగ్ నొక్కిచెప్పారు. సమ్మిళిత అభివృద్ధికి ప్రయత్నాల సినర్జీని తీసుకురావాలని మరియు శక్తివంతమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సహకారం అందించాలని మరియు అంతరిక్ష రంగానికి గేమ్ ఛేంజర్‌లుగా మారనున్న భవిష్యత్ సాంకేతికతల నుండి అవకాశాన్ని పొందాలని ఆయన ఇస్రోను కోరారు.

ఇస్రో చేపడుతున్న భవిష్యత్  సాంకేతికతలలో క్వాంటం రాడార్, సెల్ఫ్-ఈటింగ్ రాకెట్, సెల్ఫ్-హీలింగ్ స్పేస్‌క్రాఫ్ట్ మరియు స్పేస్ వెహికల్, సెల్ఫ్ డిస్ట్రాక్టివ్ శాటిలైట్‌లు, ఫోటాన్ థ్రస్టర్, స్పేస్-బేస్డ్-సోలార్-పవర్ , వ్యవసాయం, ల్యాండ్ యూజ్ ల్యాండ్ కవర్ నుండి గ్రహాల మరియు లోతైన అంతరిక్ష అన్వేషణ వరకు ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమూనాల వంటివి ఉన్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.
.

 

<><><><><>


(Release ID: 1774126) Visitor Counter : 137


Read this release in: English , Urdu , Hindi , Marathi