నీతి ఆయోగ్

స్వచ్ఛ భారత్ 2.0 : ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యొక్క స్థిరమైన నిర్వహణపై మహారాష్ట్ర మరియు గోవా యు.ఎల్.బి. ల కోసం యు.ఎన్.డి.పి. 1వ సామర్థ్య నిర్మాణ వర్క్‌షాప్‌ ను నిర్వహించిన - నీతి ఆయోగ్

Posted On: 20 NOV 2021 8:06PM by PIB Hyderabad

నీతి ఆయోగ్ మరియు యు.ఎన్.డి.పి. ఇండియా ఈ రోజు ముంబై లో స్థిరమైన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ పై పట్టణ స్థానిక సంస్థల (యు.ఎల్.బి.) కోసం మొదటి ప్రాంతీయ సామర్థ్య నిర్మాణ వర్క్‌-షాప్‌ ను నిర్వహించాయి.

సామర్థ్య నిర్మాణ వర్క్‌-షాప్‌ అనంతరం 'పట్టణ స్థిరమైన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ పై నీతి ఆయోగ్-యు.ఎన్.డి.పి. హ్యాండ్‌బుక్" ను నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డా. రాజీవ్ కుమార్;  సి.ఈ.ఓ. శ్రీ అమితాబ్ కాంత్; కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ కార్యదర్శి, శ్రీ. రామేశ్వర్ ప్రసాద్ గుప్తా; ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ కె. రాజేశ్వరరావు; యు.ఎన్.డి.పి. ఇండియా రెసిడెంట్ ప్రతినిధి, శ్రీమతి షోకో నోడా విడుదల చేశారు. 

వర్క్‌-షాప్‌ ను నీతీ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ కె. రాజేశ్వరరావు; యు.ఎన్.డి.పి.  డిప్యూటీ రెసిడెంట్ ప్రతినిధి శ్రీమతి నదియా రషీద్ ప్రారంభించారు.  ఈ వర్క్-షాప్ లో పట్టణ స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి శాఖలు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి 40 మంది ప్రభుత్వ అధికారులు వ్యక్తిగతంగా హాజరు కాగా, సుమారు వంద మందికి పైగా అధికారులు ఆన్‌-లైన్‌ లో హాజరయ్యారు.

ఈ సందర్భంగా డాక్టర్ రాజేశ్వరరావు మాట్లాడుతూ,  “స్వచ్ఛ్ భారత్ 2.0 ప్రారంభించడం ద్వారా, భారత ప్రభుత్వం నగరాలను చెత్త రహితంగా మార్చడానికి కృషి చేస్తోంది.  స్వచ్ఛ భారత్ లక్ష్యాల ను సాధించేందుకు ప్లాస్టిక్ వ్యర్థాలను మెరుగ్గా నిర్వహించడం చాలా కీలకం. ప్లాస్టిక్ వ్యర్థాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి వర్క్‌షాప్ ద్వారా యు.ఎల్.బి. లకు ఆచరణాత్మక పరిష్కారాలను అందించడమే మా లక్ష్యం.  ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కోసం, హ్యాండ్‌ బుక్‌ లో వివరించిన వికేంద్రీకృత నమూనా ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొంది, ప్లాస్టిక్ రీసైక్లింగ్ సామర్థ్యాన్ని పెంపొందించింది." అని వివరించారు.

“ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్వహించడానికి మహారాష్ట్ర, గోవా అనేక ఉత్తమ ఉదాహరణలను మనకు తెలియజేస్తాయి. మా మొదటి వర్క్‌-షాప్‌ ను ఇక్కడ ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది.  ఈ వర్క్‌-షాప్ నుండి నేర్చుకున్న విషయాలు, పరిష్కారాలు రాబోయే నెలల్లో ఇతర రాష్ట్రాల్లో వర్క్‌-షాప్‌ లు నిర్వహించడానికి సహాయపడతాయి,” అని ఆయన అన్నారు. 

ప్లాస్టిక్ వ్యర్థాల రంగంలోని ప్రముఖ నిపుణులు, ప్రముఖ సంస్థలతో సంప్రదించి, యు.ఎన్.డి.పి. ఇండియా మరియు నీతీ ఆయోగ్ సంయుక్తంగా ఈ హ్యాండ్‌-బుక్‌ ను అభివృద్ధి చేసింది.  హ్యాండ్‌- బుక్ కోసం కృషి 2021 ఫిబ్రవరి నెలలో ప్రారంభమయ్యింది.   ఆ తర్వాత పట్టణ స్థానిక సంస్థలు, పునర్వినియోగం చేసే వారు, కార్పొరేట్ సంస్థలు, పౌర సంస్థలను నిర్వహించేవారు, విద్యా సంస్థల ప్రతినిధులతో దృశ్య మాధ్యమం ద్వారా 20 కి పైగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.  ఈ కార్యక్రమాల్లో భాగంగా, నిపుణులతో ఇంటర్వ్యూలు, ప్రత్యేక అంశాలపై బృంద చర్చలతో పాటు, 14 భారతీయ నగరాలు, 4 ఆగ్నేయాసియా నగరాలను కలుపుతూ, సాంకేతిక వర్క్‌-షాప్‌లు నిర్వహించడం జరిగింది.  భారతదేశంతో పాటు, ఆగ్నేయాసియాలోని ఇలాంటి మౌలిక సదుపాయాలు, ప్లాస్టిక్ వ్యర్థాల సవాళ్లను ఎదుర్కొంటున్న నగరాల నుండి ఉత్తమ పద్ధతులు, ఉదాహరణలను ఈ హ్యాండ్‌-బుక్ లో పొందుపరచడం జరిగింది. 

యు.ఎన్.డి.పి. ఇండియా డిప్యూటీ రెసిడెంట్ ప్రతినిధి నదియా రషీద్, ఈ సందర్భంగా మాట్లాడుతూ,  "యు.ఎన్.డి.పి. చేపట్టిన ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ విధానం అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం, వేరు చేయడం, తిరిగి వినియోగించడం ద్వారా స్థిరమైన నమూనాను ప్రోత్సహిస్తుంది.  ఇది సఫాయి సాత్స్ (వ్యర్థాలను సేకరించేవారు) ని గుర్తించి, పనికి తగ్గ ప్రతిఫలం చెల్లించడం జరుగుతుంది.  స్వచ్ఛ్ భారత్ మిషన్ 2.0 లక్ష్యాలను సాధించేందుకు నగరాల వ్యాప్తంగా వ్యర్థాల నిర్వహణ కోసం ఒక స్థిరమైన నమూనాను ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి, పునరావృతం చేయడానికి మా నిబద్ధతను ఈ వర్క్‌-షాప్‌ లు ప్రతిబింబిస్తాయి.  ఈ ప్రయత్నంలో భారత ప్రభుత్వం, నీతి ఆయోగ్ తో పాటు, పట్టణ స్థానిక సంస్థలతో భాగస్వామిగా, కలిసి పని చేస్తున్నందుకు మేము గర్విస్తున్నాము." అని అన్నారు. 

వికేంద్రీకృత పొడి చెత్త నిర్వహణ ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ విధానాన్ని ఈ హ్యాండ్‌-బుక్ లో వివరించడం జరిగింది. వివరిస్తుంది.  దేశంలో అనేక రకాలైన వ్యర్థ పదార్థాల నిర్వహణ విధానాలు అమలులో ఉన్నాయి.  యు.ఎల్.బి. లు ఈ ప్రక్రియలను దశల వారీగా అర్థం చేసుకోదానికి వీలుగా యు.ఎన్.డి.పి. ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ కార్యక్రమం వంటి కొన్ని ముఖ్యమైన విధానాలను ఎంపికచేయడం జరిగింది. వ్యర్థాలను సేకరించేవారి ఆర్థిక స్థితి, జీవనోపాధి పెంపుదల కోసం అనుసరించే వివిధ ఆర్థిక నమూనాలను కూడా ఈ హ్యాండ్‌-బుక్‌ లో వివరించడం జరిగింది. 

ఈ సందర్భంగా బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అదనపు మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీ సురేష్‌ కాకాని మాట్లాడుతూ,  "వాతావరణ మార్పుల వల్ల  ప్రభావాలకు గురయ్యే ప్రాంతాల జాబితాలో ముంబై ఉన్నత స్థానంలో ఉంది. వాతావరణ మార్పు మరియు పర్యావరణాన్ని నిర్వహించడానికి స్థిరమైన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కీలకం.  శీతోష్ణస్థితి-తట్టుకునే ఉపశమనాన్ని మరియు అనుసరణను అభివృద్ధి చేయడానికి ముంబై క్లైమేట్ యాక్షన్ ప్లాన్ ఇప్పటికే వ్యర్థ పదార్థాల నిర్వహణకు ప్రాధాన్యతనిస్తోంది.  ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్వహించడానికి, స్వచ్ఛతా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి, వ్యర్థాలను స్థిరంగా పారవేయడానికి, విలువను సృష్టించడంతో పాటు, వాతావరణ మార్పులను తగ్గించడంలో సహాయపడే ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మేము ఇప్పటికే యు.ఎన్.డి.పి. వంటి భాగస్వాములతో కలిసి పని చేస్తున్నాము.  ఈ వర్క్‌-షాప్‌ ను ఏర్పాటు చేసినందుకు, మహారాష్ట్రలోని పట్టణ స్థానిక సంస్థలకు ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి వీలుగా ఒక వేదికను అందించినందుకు మేము, నీతి ఆయోగ్‌ కి, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము." అని పేర్కొన్నారు. 

*****



(Release ID: 1773675) Visitor Counter : 161


Read this release in: English , Urdu , Hindi , Punjabi