మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గువాహ‌తిలో ఈశాన్య రాష్ట్రాల విద్యా మంత్రుల స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించిన కేంద్ర విద్య‌మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌


జీవ వైవిధ్య ప‌రిర‌క్ష‌ణ‌, జీవ‌న‌రుల స్థిర‌మైన వాణిజ్య సాగును ప్రోత్స‌హించేందుకు ప‌రిశోధ‌నా సంస్థ‌ల అవ‌స‌రాన్ని నొక్కి చెప్పిన ప్ర‌ధాన్‌

డ్రాపౌట్ రేటును త‌గ్గించేందుకు, ఎన్ఇపి (2020)ను వేగ‌వంతంగా అమ‌లు చేసేందుకు ప్ర‌త్యేక చొర‌వ‌ల‌కు పిలుపు

నాడు పోస్టు చేయడమైనది: 20 NOV 2021 8:41PM by PIB Hyderabad

 ఈశాన్య రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల స‌మావేవానికి కేంద్ర విద్య‌, నైపుణ్యాల అభివృద్ధి, వ్య‌వ‌స్థాప‌క‌త శాఖ‌ల మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌, విద్యా, విదేశీ వ్య‌వ‌హారాల శాఖ స‌హాయ మంత్రి డాక్ట‌ర్ రాజ్‌కుమార్ రంజ‌న్ సింగ్‌తో క‌లిసి శ‌నివారం అధ్య‌క్ష‌త వ‌హించారు. ఈశాన్య రాష్ట్రాల విద్యా స‌ల‌హాదారులు, భార‌త ప్ర‌భుత్వ విద్యా మంత్రిత్వ శాఖ సీనియ‌ర్ అధికారులు కూడా స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. 
ఈశాన్య ప్రాంతంలో విద్యార్ధుల న‌మోదుల స‌ర‌ళులు, నిర్ధిష్ట జాతుల‌కు చెందిన విద్యార్ధుల‌కు చేరువ‌య్యేందుకు చొర‌వ‌లు, సౌక‌ర్యాల అందుబాటు, కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాల వ్యాప్తి , విద్య అందుబాటులో ఉండేందుకు చొర‌వ‌లు స‌హా  పాఠ‌శాల‌, ఉన్న‌త విద్యా ప‌రిస్థితుల‌ను ప్ర‌ధాన్ ప‌ర్యావ‌లోకించారు. దీనితో పాటుగా నూత‌న విద్యా విధానం 2020ని అమ‌లు చేసేందుకు మార్గాలు, ఈశాన్య ప్రాంతాన్ని జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ప‌రివ‌ర్త‌న చేసేందుకు  విద్య స్థితిగ‌తుల‌ను బ‌లోపేతం చేసే వ్యూహాలు కేంద్రంగా చ‌ర్చ‌లు సాగాయి. 
డ్రాపౌట్ రేటును త‌గ్గించ‌తేందుకు ప్ర‌త్యేక చొర‌వ‌ల‌ను రూపొందించేందుకు ఈశాన్య రాష్ట్రాల విద్యామంత్రుల‌తో క‌లిసి ప‌ని చేయాల్సిన నొక్కి చెప్తూ, జీవ వైవిధ్య ప‌రిర‌క్ష‌ణ‌, జీవ‌న‌రుల స్థిర‌మైన వాణిజ్య సాగును ప్రోత్స‌హించేందుకు ప‌రిశోధ‌నా సంస్థ‌లను ఏర్పాటు చేసేందుకు ప్ర‌ణాళిక‌ల గురించి ప్ర‌ధాన్ వివ‌రించారు. 

 


(రిలీజ్ ఐడి: 1773663) సందర్శకుల సూచీ సంఖ్య : : 149
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Manipuri