ఆయుష్

ఈశాన్య ప్రాంతంలో ఆయుష్‌కు ప్రాచుర్యం కల్పించడానికి పలు చర్యలను ప్రకటించించిన కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్

Posted On: 20 NOV 2021 5:50PM by PIB Hyderabad

·         పాసిఘాట్‌లో 30 సీట్లతో కొత్త ఆయుర్వేద కళాశాల ఏర్పాటు 

·         పాసిఘాట్‌లో 60 పడకలతో ఆయుర్వేద ఆసుపత్రి

·          నార్త్ ఈస్టర్న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఫోక్ మెడిసిన్ రీసెర్చ్   క్యాంపస్‌లో 53.72 కోట్ల రూపాయల ఖర్చుతో మౌలిక సదుపాయాల కల్పన 

·        కార్యక్రమాలను అమలు చేయడానికి 86 పోస్టుల భర్తీ 

అరుణాచల్ ప్రదేశ్‌లో ఆయుష్ వైద్యానికి మరింత ప్రాచుర్యం కల్పించడానికి పలు చర్యలను అమలు చేయనున్నట్టు కేంద్ర ఆయుష్ మరియు ఓడరేవులుషిప్పింగ్జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ప్రకటించారు. ఆయుష్ ను అభివృద్ధి చేయడానికి ఈశాన్య ప్రాంతంలో అమలు చేస్తున్న కార్యక్రమాలకు అదనంగా అరుణాచల్ ప్రదేశ్ లో ఈ కార్యక్రమాలను అమలు చేస్తామని శ్రీ సోనోవాల్ ఈ రోజు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని పాసిఘాట్‌లోని నార్త్ ఈస్టర్న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఫోక్ మెడిసిన్ రీసెర్చ్ లో ఏర్పాటైన వివిధ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. సంస్థలో 53.72 కోట్ల కోట్ల రూపాయల ఖర్చుతో మౌలిక సదుపాయాలను అమలు చేస్తామని మంత్రి తెలిపారు. నార్త్ ఈస్టర్న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఫోక్ మెడిసిన్ రీసెర్చ్ లో 30 సీట్లతో ఆయుర్వేద కళాశాల, 100 పడకలతో ఆయుర్వేద ఆసుపత్రి నెలకొల్పుతామని మంత్రి ప్రకటించారు. దీనివల్ల ప్రస్తుతం ఉన్న పోస్టులకు  అదనంగా 86  పోస్టులను మంజూరు చేస్తామని అన్నారు. 

సంస్థ ఆవరణలో ఏర్పాటైన సమావేశంలో ప్రసంగించిన శ్రీ సోనోవాల్ సంప్రదాయ వైద్యం పద్ధతులు, నమ్మకాల ఆధారంగా జానపద వైద్య ప్రక్రియ అమలు జరుగుతున్నదని అన్నారు.' ఈశాన్య ప్రాంతంలో జానపద వైద్య ప్రక్రియకు ఘనమైన చరిత్ర ఉంది. అయితే, వైద్య విధానాలను శాస్త్రీయ విధానాల్లో భద్రపరచడం జరగలేదు. వేద కాలం నుంచి ప్రకృతి మనకు అందించిన అద్భుతమైన ఔషధాన్ని సంరక్షించడం తో పాటు సుసంపన్నం చేయడం కోసం  ఇప్పుడు కృషి  ప్రారంభం అయ్యింది. దీనిలో భాగంగా సంస్థ ప్రాంగణంలో ఆయర్వేద కళాశాల, ఆయుర్వేద ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ చర్యల వల్ల నార్త్ ఈస్టర్న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఫోక్ మెడిసిన్ రీసెర్చ్ మరింత బలోపేతం అవుతుంది. మన సంప్రదాయ వైద్య విధానాలకు ప్రాచుర్యం లభిస్తుంది' అని శ్రీ సోనోవాల్ అన్నారు. 

ఈశాన్య ప్రాంతంలో ఆయుష్ కు మరింత ప్రాచుర్యం కల్పించడానికి అమలు చేయనున్న కార్యక్రమాలను శ్రీ సోనోవాల్ వివరించారు. ఈ ప్రాంతంలో ఉన్న ఆయుర్వేద కళాశాలలను పటిష్టం చేయడంతో పాటు రీజినల్ రా డ్రగ్ రిపోజిటరీ, మ్యూజియం,అధునాతన అనలిటికల్ ఇన్స్ట్రుమెంట్ ఫెసిలిటీ లాంటి ముఖ్యమైన సంస్థలను ఈ ప్రాంతంలో నెలకొల్పుతామని మంత్రి వివరించారు. వీటితో పాటు పంచకర్మ చికిత్స అందించడానికి ఒక కేంద్రాన్నిపరిశోధనలు చేపట్టడానికి ఒక పరిశోధనా కేంద్రాన్నిపారా మెడికల్ సెంటర్ త్వరలో ఈ ప్రాంతంలో ఏర్పాటు అవుతాయని మంత్రి తెలిపారు.

పాసిఘాట్ లో పనిచేస్తున్న నార్త్ ఈస్టర్న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫోక్ మెడిసిన్ పేరును ఇటీవల నార్త్ ఈస్టర్న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఫోక్ మెడిసిన్ రీసెర్చ్‌గా మార్చడం జరిగింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఇది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా పనిచేస్తోంది. 2008 ఫిబ్రవరి 21వ తేదీన సంస్థను నెలకొల్పడానికి అవసరమైన ఆమోదాన్ని తెలిపిన కేంద్ర మంత్రివర్గం దీనికి 40 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. సంప్రదాయ వైద్య విధానాలకు ప్రాచుర్యం కల్పించి అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో నార్త్ ఈస్టర్న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఫోక్ మెడిసిన్ రీసెర్చ్‌ కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తోంది. ఈశాన్య ప్రాంతంలో ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ లో ఆయుర్వేద వైద్య విధానానికి ప్రాచుర్యం కల్పించడానికి సంస్థ కార్యక్రమాలను రూపొందించింది. స్థానికంగా అమలు జరుగుతున్న  ఆరోగ్య సంప్రదాయాలువైద్యం పరిజ్ఞాన పరిరక్షణ, వీటి ఆధారంగా ఔషధాల ఉత్పత్తి, జీవ వైవిధ్య పరిరక్షణ లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రణాళికలు రూపకల్పన చేసే అంశంపై సంస్థ దృష్టి సారించింది. 

***



(Release ID: 1773662) Visitor Counter : 138