ఆయుష్
ఆయుష్ -64 డిమాండ్‌ను తట్టుకోవడం ఇక సులభం.
ఇందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని బదలీ చేసిన సిసిఆర్ ఎఎస్
Posted On:
19 NOV 2021 7:37PM by PIB Hyderabad
కోవిడ్ 19కు ఉపయోగించేందుకు తాజా లైసెన్సులు 39 కంపెనీలకు జారీ
ఆయుష్ 64 తయారీ, సరఫరా ఇక పెద్ద ఎత్తున పుంజుకోనుంది. సరఫ
స్వల్ప, లక్షణాలు కనిపించని కోవిడ్ 19 చికిత్సకు ఉపకరించే సమర్ధ ఔషధం ఆయుష్ 64
సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సిసిఆర్ ఎఎస్) ఆయుష్ -64 సాంకేతిక పరిజ్ఞానాన్ని 46 కంపెనీలకు బదలీ చేసింది. ఇది స్వల్ప, లక్షణాలు కనిపించని అలాగే స్వల్ప, ఒకమాదిరి కోవిడ్ -19 కేసులలో చికిత్సకు ఇది సమర్ధ ఔషధంగా పనికి వస్తుంది.
ఇంతకు ముందు ఆయుష్ మంత్రిత్వశాఖకు చెందిన తయారీ యూనిట్ అయిన ఐఎంపిసిఎల్ తోపాటు
కేవలం 7 కంపెనీలకు దీని తయారీకి లైసెన్సు ఉండేది. దీనిని తొలుత మలేరియా చికిత్సలో ఉపయోగించేవారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కోవిడ్ కు చికిత్సలో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్టు తేలడంతో 39 కొత్త కంపెనీలకు దీని తయారీకి సంబంధించి లైసెన్సులు మంజూరు చేయడం జరిగింది. వాటికి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా బదిలీ చేశారు.
ఆయుష్ -64 ను సిసిఆర్ ఎఎస్ అభివృద్ది చేసింది. ఆయుర్వేద పరిశోధనలో ఇది ప్రముఖ సంస్థ. ఇది ఆయుష్ మంత్రిత్వశాఖ కింద పనిచేస్తుంది. ఇది మలేరియా చికిత్సకు 1980లో ఈ ఔషధాన్ని అభివృద్ది చేసింది.2020 మార్చిలో తొలిదశ కోవిడ్ సమయంలో జరిపిన శాస్త్రీయ అధ్యయనాలలో ఈ ఔషధం లక్షణాలు కనిపించని, స్వల్ప, ఒకమాదిరి కోవిడ్ -19 చికిత్సలో ఇది సమర్ధంగా ఉపయోగపడుతున్నట్టు గుర్తించారు. వైరస్‌లపై పోరాడే లక్షణాలను ఇది కలిగిఉంది., శరీర రోగనిరోధక శక్తి పెంపొందించడానికి, జ్వరం తగ్గించడానికి, రోగులు త్వరగా కోలుకోవడానికి ఉపయోపడుతుంది.
కోవిడ్ తొలి దశ సందర్భంగా , ఆయుష్ మంత్రిత్వశాఖ,కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ , ఇండస్ట్రియల్ రిసెర్ఛ్ (సిఎస్ ఐఆర్) లు క్లినికల్ పరిశోధనలు నిర్వహించాయి. ఇందులో ఆయుష్ -64 కోవిడ్ పేషెంట్లకు ఉపయుక్తమైన ఔషధంగా తేలింది. ఇప్పటివరకు దీనిపై 8 క్లినికల్ అధ్యయనాలు జరిగాయి. ఇంట్లో క్వారంటైన్ లో ఉన్న 63 వేల మంది పేషెంట్లకు దీనిని వాడి చూశారు. ఈ పరీక్షలలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్టు గుర్తించారు. ఈ 8 క్లినికల్ ట్రయల్స్‌లో 5 ర్యాండమ్ పరీక్షలు, రెండు సింగిల్ స్టడీస్ ఉన్నాయి. ఈ అధ్యయనంలో వారికి కేవలం ఆయుష్ -64 మాత్రమే ఇచ్చారు.
కోవిడ్ తొలి దశ ప్రారంభానికి ముందు ఆయుష్ మంత్రిత్వశాఖకు చెందిన తయారీ యూనిట్ అయిన ఐఎంపిసిఎల్ తో సహా ఏడు కంపెనీలు ఆయుష్ -64 తయారు చేస్తుండేవి. అయితే ప్రస్తుతం 39 కంపెనీలకు సాంకేతిక పరిజ్ఞానం బదిలీతో ఆయుష్ -64 తయారు చేసే సంస్థల సంఖ్య 46 కు పెరుగుతుంది.
సిసిఆర్ ఎ ఎస్ తీసుకున్న ఈ చర్యవల్ల ఆయుష్ 64 ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. దీనితో ఈ ఔషధానికి ఉన్న డిమాండ్ ను ఎదుర్కోవడానికి వీలు కలుగుతుంది. ఇప్పటివరకు ఈ ఔషధం వల్ల దుష్ప్రభావాలు ఏవీ రిపోర్ట్ కాలేదు. అయితే వైద్యుల ను సంప్రదించిన అనంతరం మాత్రమే దీనిని వాడాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.
***
(Release ID: 1773412)
Visitor Counter : 145