ఆర్థిక మంత్రిత్వ శాఖ
మోల్టెన్ మెటల్ ఆపరేషన్‌లో భాగంగా 85.58 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న 4గురు విదేశీయులను అదుపులోకి తీసుకున్న డిఆర్ఐ
Posted On:
19 NOV 2021 5:39PM by PIB Hyderabad
డైరెక్టొరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ ఐ) మోల్టెన్ మెటల్ అన్న పేరుతో నిర్వహించిన నిఘా ఆపరేషన్‌లో పలువురు భారతీయులు, విదేశీ (చైనీయులు, తైవానీయులు, దక్షిణ కొరియన్లు) పౌరులు ఎయిర్ కార్గో మార్గం ద్వారా హాంగ్‌కాంగ్ నుంచి భారత్‌కు బంగారాన్ని దొంగరవాణా చేస్తున్నట్టు గుర్తించారు.
బంగారం దొంగరవాణా యంత్ర భాగాల రూపంలో దేశంలోకి ప్రవేశిస్తోందని, స్థానిక మార్కెట్లలో దానిని అమ్మే ముందు దానిని కరిగించి, కడ్డీలు/ సిలెండర్లగా మలుస్తున్నారని నిఘా సమాచారం సూచించింది.
నిఘా వర్గాల సమాచారం మేరకు రంగంలోకి దిగిన డిఆర్ఐ అధికారులు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ కార్గో కంప్లెక్స్ కు వచ్చిన ఒక దిగుమతి సరుకును తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో వారు ట్రాన్స్‌ఫార్మర్లు బిగించిన ఎలక్ట్రోప్లేటింగ్ యంత్రాలను కనుగొన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల ఇఐ లామినేట్లను బంగారంపూత పూసిన నికెల్‌తో తయారు చేశారని, ముఖ్యంగా బంగారం గుర్తించకుండా దాచేందుకు ఈ పని చేశారని గుర్తించారు. దిగుమతి చేసిన 80 ఎలెక్ట్రోప్లేటింగ్ మషీన్ల నుంచి దాదాపు1 కెజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వేగవంతమైన తదుపరి చర్యలలో, ఇదే కార్యనిర్వహణ పద్ధతిని అనుసరించి ఇంతకుముందు భారత్‌లోకి దొంగరవాణా చేసిన 5,409 కిలోల విదేశీ మూలాల కలిగిన బంగారాన్ని ఢిల్లీకి చెందిన నగల వర్తకుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. తర్వాత, చత్తర్‌పూర్, గుడ్‌గాంవ్‌లలో పలు అద్దెకు తీసుకున్న ఇళ్ళపై చేపట్టిన సోదాలలో నలుగురు విదేశీ పౌరులు (ఇద్దరు దక్షిణ కొరియన్లు, తైవాన్, చైనాల నుంచి ఒక్కొక్కరు) తదుపరి పంపిణీ కోసం ఇఐ లామినేట్ల రూపంలో దొంగరవాణా చేసిన బంగారాన్ని ఆధునిక మెటలర్జికల్ పద్ధతు సాయంతో కడ్డీలు/ సిలెండర్లుగా మారుస్తున్నట్టు కనుగొన్నారు. ఈ కార్యకలాపాలను విదేశీ జాతీయులు ఖరీదైన ప్రాంతాలైన దక్షిణ ఢిల్లీ, గుర్‌గాంవ్ ప్రాంతాలలో అద్దెకు తీసుకున్న ఫార్మ్ హౌజ్‌లు, అపార్ట్‌మెంట్లలో కొనసాగిస్తున్నారు. పక్కింటివారికి కూడా తమ చట్టివ్యతిరేకమైన తమ కార్యకలాపాల గురించి తెలియకుండా అత్యంత జాగ్రత్తలు వారు తీసుకుంటున్నారని తేలింది.
దాదాపు రూ. 42 కోట్ల విలువైన మొత్తం 85.58 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దొంగరవాణాలో పాలుపంచుకుంటున్న నలుగురు విదేశీ జాతీయులను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. బంగారం దొంగరవాణ చేసిన నేరం కారణంగా గతంలో జైలుపాలైన ఇద్దరు విదేశీయుల మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడినట్టు విచారణ సమయంలో వెల్లడైంది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
***
(Release ID: 1773409)
Visitor Counter : 178