సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
సేవా రంగానికి పరపతి లంకెతో పెట్టుబడి రాయితీ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించిన కేంద్ర ఎంఎస్ఎంఇ మంత్రి నారాయణ్ రాణె
Posted On:
19 NOV 2021 1:01PM by PIB Hyderabad
ఎంఎస్ఎంఇ ఈశాన్య ప్రాంత సమావేశంలో సేవారంగానికి పరపతి లంకెతో పెట్టుబడి రాయితీ ( Special Credit Linked Capital Subsidy Scheme -SCLCSS) ప్రత్యేక పథకాన్ని కేంద్ర ఎంఎస్ఎంఇ మంత్రి నారాయణ్ రాణె శుక్రవారం గువాహతిలో ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారుల సమక్షంలో ప్రారంభించారు. సేవారంగంలో సాంకేతికకు సంబంధించిన అవసరాలను నెరవేర్చేందుకు ఈ పథకం ఉపయోగపడడమే కాక ప్లాంట్ & యంత్రాలను, సర్వీస్ పరికరాలను వ్యవస్థాగత రుణం ద్వారా పొందిన ఎస్ సి, ఎస్‌టి ఎంఎస్ఇలకు 25% పెట్టుబడి రాయితీ కల్పిస్తారు. ఇందులో సాంకేతికత ఆధునికీకరణపై నిర్ధిష్ట రంగమంటూ నిబంధనలు ఉండవు.
ఈశాన్య ప్రాంతానికి చెందిన ఎస్‌సి/ ఎస్‌టి వాణిజ్యవేత్తలను సత్కరిస్తూ, ఉపాధి కోసం నిరీక్షించేవారిగా కాక ఉపాధికల్పించే వ్యాపారవేత్తలుగా యువత తయారు కావాలని రాణె విజ్ఞప్తి చేశారు. వారు విజయవంతమైన వ్యాపారవేత్తలుగా అయ్యే ప్రయాణంలో ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ సాధ్యమైనంతగా తోడ్పడుతుంని యువతకు రాణె హామీ ఇచ్చారు. ఎంఎస్ఎంఇ రంగ కలుపుకుపోయే వృద్ధి అనేది ఈశాన్య ప్రాంత తోడ్పాటుతోనే పూర్తవుతుందని ఉద్ఘాటించారు. ముఖ్యంగా, సమాజంలోని అణగారిన వర్గాల కోసం భా రత ప్రభుత్వ అనుకూల విధానాలు, ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ అమలు చేసే భిన్న పథకాలు/ కార్యక్రమాలు, ఈ ప్రాంతం తన పూర్తి సామర్ధ్యాన్ని సాధించేందుకు తోడ్పడుతున్నాయని చెప్పారు.
ఎన్ఎస్ఐసి శిక్షణా కేంద్రం, గువాహతి నుంచి విజయవంతంగా విద్య పూర్తి చేసుకున్న ట్రైనీలకు సర్టిఫికెట్లను అందించడమే కాక, ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ మద్దతుతో ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఎస్‌సి, ఎస్‌టి వాణిజ్యవేత్తలు ఏర్పాటు చేసిన స్టాళ్ళను సందర్శించారు. ఇటువంటి కార్యకలాపాలు, ఎంఎస్ఎంఇ వ్యాపారవేత్తలకు, ముఖ్యంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ వ్యాపారవేత్తలు తమ నైపుణ్యాలను/ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు అవకాశాన్ని కల్పించడమే కాక వృద్ధికి నూతన మార్గాలను సృష్టించి, స్వయం సమృద్ధం చేస్తాయని అభిప్రాయపడ్డారు.
***
(Release ID: 1773408)
Visitor Counter : 227