సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు ఐఎఫ్‌ఎఫ్‌ఐ 52


ఐఎఫ్‌ఎఫ్‌ఐ 52 స్పోర్ట్స్ విభాగంలో నాలుగు అంతర్జాతీయ క్రీడా చిత్రాలు ఉన్నాయి


బెల్జియం, కొరియా, పోలాండ్, ఫ్రాన్స్ మరియు స్విట్జర్లాండ్ నుండి క్రీడా ఆకాంక్షల కథనాలను ఐఎఫ్‌ఎఫ్‌ఐ అందిస్తుంది

Posted On: 19 NOV 2021 4:39PM by PIB Hyderabad

క్రీడా స్ఫూర్తిని అత్యుత్తమంగా ప్రదర్శిస్తూ నవంబర్ 20 - 28, 2021 మధ్య కాలంలో గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) 52వ ఎడిషన్‌లోని స్పోర్ట్స్ విభాగంలో క్రీడలకు సంబంధించిన నాలుగు స్ఫూర్తిదాయకమైన చిత్రాలు ప్రదర్శించబడుతున్నాయి.

 

ప్రపంచవ్యాప్తంగా క్రీడా పోటీలు భారీ స్థాయిలో జరుపుకుంటున్న తరుణంలో క్రీడలపై ఆధారపడిన సినిమాలు నిజమైన స్పూర్తి, దృఢ సంకల్పం, అడ్రినాలిన్ మరియు స్నేహభావాన్ని చిత్రీకరించడం వల్ల ఎప్పుడూ సినీ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. అంతేకాకుండా, ఈ సంవత్సరం ఒలింపిక్స్ మరియు పారాలింపిక్స్ క్రీడలలో భారతదేశం ఒక చారిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. ఇది భారతీయ క్రీడలకు ఉత్తమ సంవత్సరంగా నిలిచింది. క్రీడల వైభవాన్ని తెరపై జరుపుకునేందుకు ఈ ఐఎఫ్‌ఎఫ్‌ఐ క్రీడలపై నాలుగు అంతర్జాతీయ చిత్రాలను సినీ ప్రేమికుల కోసం తీసుకువస్తోంది.

 

ఈ విభాగంలో ప్రదర్శించబడుతున్న చలనచిత్రాలు రూకీ రూపొందించిన లివెన్ వాన్ బేలెన్ (డచ్), జెరో యున్ రూపొందించిన ఫైటర్ (కొరియన్), మాసీజ్ బార్క్‌జెవ్స్కీ రూపొందించిన ది ఛాంపియన్ ఆఫ్ ఆష్విట్జ్ బై (జర్మన్, పోలిష్) & ఎల్లీ గ్రాప్ రూపొందించిన ఓల్గా (ఫ్రెంచ్, రష్యన్, ఉక్రేనియన్) .

 

ఐఎఫ్‌ఎఫ్‌ఐ గోవా 2018 సంవత్సరం నుండి క్రీడల కోసం ప్రత్యేకంగా క్యూరేటెడ్ ప్యాకేజీని కలిగి ఉంది.

 

రూకీ

 

స్నేహం మరియు ప్రత్యర్థి పోటీ యొక్క సమ్మేళనం. జీవితం మరియు రెండవ అవకాశాల గురించిన డచ్ చలనచిత్రం లివెన్ వాన్ బేలెన్ యొక్క రూకీని చూడవచ్చు. ఈ చిత్రం నిక్కీ అనే యువకుడి ప్రతిష్టాత్మకమైన మరియు ఆత్మవిశ్వాసంతో కూడిన మోటార్‌సైకిలిస్ట్ కథను చెబుతుంది. అతను రేసింగ్‌లో తన జీవితాన్ని ఎల్లప్పుడూ లైన్‌లో ఉంచుతాడు. క్రీడ పట్ల అతని సాహసోపేతమైన అభిరుచి చివరికి అతనిని ప్రమాదంలో పడవేస్తుంది, అతని ప్రపంచాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. నిక్కీ తన మేనల్లుడికి శిక్షణ ఇవ్వడం ద్వారా తన కలను ఎలా ప్రారంభించాలో మరియు తిరిగి ఎలా పొందుతాడో ఈ చిత్రం చూపిస్తుంది.

బ్రస్సెల్స్‌లో జరిగిన బ్రస్సెల్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నేషనల్ కాంపిటీషన్‌లో రూకీ ప్రపంచ ప్రీమియర్‌ ప్రదర్శించబడింది.

ఫైటర్

జెరో యున్ రూపొందించిన కొరియన్ చిత్రం ఫైటర్ మెరుగైన జీవితం కోసం సియోల్‌కు వచ్చిన ఉత్తర కొరియా శరణార్థి జినా గురించి ఉంటుంది. తన తండ్రిని దక్షిణ కొరియాకు తీసుకురావడానికి ఆమెకు డబ్బు కావాలి. రెండు కొరియాల మధ్య ఉన్న ఉద్రిక్తత మరియు వివక్ష కానీ ఆమె ఎంత కష్టపడినా తగినంత డబ్బు ఆదా చేయనివ్వదు. బాక్సింగ్ జిమ్ క్లీనింగ్ జాబ్ కారణంగా ఆమె బాక్సింగ్ ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. యువ మరియు ఆత్మవిశ్వాసంతో కూడిన మహిళా బాక్సర్‌లను చూసి జినా స్ఫూర్తి పొందుతుంది. ఆ తర్వాత జరిగేది ఈ ఉత్సవ ప్రతినిధులకు సృజనాత్మక స్ఫూర్తిని అందించడం ఖాయం.

 

ది ఛాంపియన్ ఆఫ్ ఆష్విట్జ్

రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన జ్ఞాపాకాల నుండి తీయబడిన పట్టుదల మరియు మనుగడ యొక్క అసాధారణ నిజ జీవిత కథే ఈ సినిమా. పోలిష్ డైరెక్టర్ మసీజ్ బార్క్‌జెవ్స్కీ రచించిన ది ఛాంపియన్ ఆఫ్ ఆష్విట్జ్ బాక్సర్ మరియు ఆష్విట్జ్-బిర్కెనౌ కాన్సంట్రేషన్ క్యాంప్‌లోని మొదటి ఖైదీలలో ఒకరైన టడ్యూస్జ్ 'టెడ్డీ' పీట్ర్జికోవ్స్కీ యొక్క మరచిపోయిన కథను బయటకు తీసుకువస్తుంది. 'టెడ్డీ' శిబిరంలో తన 3 సంవత్సరాల బసలో నాజీ టెర్రర్‌పై విజయం సాధించాలనే ఆశకు చిహ్నంగా కొనసాగుతుంది. అతని ఆన్-స్క్రీన్ చరిత్ర ఆష్విట్జ్ మాజీ ఖైదీల ఆర్కైవల్ స్టేట్‌మెంట్‌లు మరియు పగిలిస్ట్ యొక్క జ్ఞాపకాల ఆధారంగా వివరంగా నమోదు చేయబడింది. సినీ ప్రేమికులు ఇప్పుడు ఐఎఫ్‌ఎఫ్‌ఐ 52లో అతని ప్రయాణాన్ని అనుభవించనున్నారు.

ఓల్గా

ఒక యువ జిమ్నాస్ట్ యొక్క అద్భుతమైన కథే ఈ చిత్రం. దర్శకుడు ఓల్గా ఎలీ గ్రాప్చే రూపొందించబడిన బహుభాషా పేరుతో రూపొందించబడింది ఈ చిత్రం. స్విట్జర్లాండ్‌కు బహిష్కరించబడిన ఓల్గా ప్రతిభావంతులైన మరియు ఉద్వేగభరితమైన ఉక్రేనియన్ జిమ్నాస్ట్, నేషనల్ స్పోర్ట్స్ సెంటర్‌లో తన స్థానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తుంది. యువతి తన కొత్త దేశానికి అనుగుణంగా మరియు యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లకు సిద్ధమవుతున్నప్పుడు, ఉక్రేనియన్ విప్లవం ఆమె జీవితంలోకి ప్రవేశించి, ప్రతిదీ కదిలిస్తుంది.

క్రీడలు మరియు సినిమాల నుండి ప్రేరణ పొందేందుకు ఈ చిత్రాలను ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ 52వ ఎడిషన్ లో చూడండి.

***



(Release ID: 1773366) Visitor Counter : 151