భారత పోటీ ప్రోత్సాహక సంఘం
ముఠాలుగా ఏర్పడినందుకు కాగితపు ఉత్పత్తిదారులపై జరిమానా విధించిన సిసిఐ
Posted On:
18 NOV 2021 4:58PM by PIB Hyderabad
వ్యవసాయ వ్యర్థాలు, పునరుపయోగించిన చెత్త కాగితాల నుంచి కాగితాలను ఉత్పత్తి చేస్తూ, పోటీ వ్యతిరేక ఒప్పందాలను నిరోధించే కాంపిటీషన్ చట్టం, 2002లో సెక్షన్ 3(1), రెండ్ విత్ సెక్షన్ 3 (3)లోని అంశాలను ఉల్లంఘించినట్టు గుర్తించిన కొన్ని కంపెనీలకు , ఒక అసోసియేషన్‌కు వ్యతిరేకంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) బుధవారం అంతిమ ఉత్తర్వులను జారీ చేసింది.
మరొక రెండు కేసుల దర్యాప్తు జరుగుతుండగా బయిటకు వచ్చిన కొన్ని అంశాల ఆధారంగా కమిషన్ సువో మోటుగా ఈ కేసును ప్రారంభించింది. డిజి 21 ప్రాథమిక కాగితం ఉత్పత్తిదారులు, అసోసియేషన్‌పై దర్యాప్తు జరిపినప్పటికీ, అది 10 ఉత్పత్తిదారులు, అసోసియేషన్ కు వ్యతిరేకంగా మాత్రమే చట్టంలోని సెక్షన్ 3(1), రెండ్ విత్ సెక్షన్ 3 (3)లోని అంశాలను ఉల్లంఘించినట్టు ఆధారాలను నమోదు చేసింది. ఈ సంస్థలన్నీ ఒక సమూహంగా ఏర్పడిన కాలం సెప్టెంబర్ 2021 నుంచి మార్చి 2013 వరకు అని డిజి పేర్కొంది.
ఇటువంటి కార్యకలాపాలకు వేదికను అందించిన అసోసియేషన్, కంపెనీలు కూడా రాసే, ముద్రించే కాగితాల ధరలను నిర్ణయించేందుకు ఒక ముఠాగా ఏర్పడినట్టు సిసిఐ కనుగొంది.
ఈ నేపథ్యంలో, ముఖ్యంగా మహమ్మారి కాలంలో అనేక వ్యాపారాలు దృశ్య మాధ్యమంలోకి మారి కాగితం అవసరం తగ్గి, కాగితపు వ్యాపారాన్ని ప్రభావవితం చేసినందున, ముఠాగా ఏర్పడినట్టు నేరం రూఢీ అయిన పది మంది కాగితపు ఉత్పత్తిదారులపై సిసిఐ లాంఛనప్రాయంగా ఒక్కక్కొరిపై రూ. 5లక్షల చొప్పున జరిమానాను విధించింది.
అదనంగా, పోటీ ఒప్పంద కార్యకలాపాలను తన వేదికను అందించినందుకు అసోసియేషన్‌పై రూ. 2.5 లక్షల జరిమానాను విధించింది. పైన పేర్కొన్నవి మాత్రమే కాకుండా, చట్టంలోని సెక్షన్ 48 నిబంధనల ఉల్లంఘనలకు బాధ్యులుగా నిర్ధారించిన కాగితపు ఉత్పత్తిదారులు, అసోసియేషన్ అందులోని అధికారులు భవిష్యత్తులో పోటీ వ్యతిరేక ప్రవర్తనకు పాల్పడడం నుంచి నిలవరించుకోవాలని, మానుకోవాలని సిసిఐ ఆదేశించింది.
ఉత్తర్వుల కాపీ సిసిఐ వెబ్ సైట్ www.cci.gov.inలో అందుబాటులో ఉంది.
***
(Release ID: 1773077)
Visitor Counter : 163