సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
లలిత కళా అకాడమీలో ‘భారతమాతా ఏవం.. భారత్ కే నాయక్’ ప్రదర్శనను ప్రారంభించిన శ్రీమతి మీనాక్షి లేఖి
Posted On:
18 NOV 2021 2:46PM by PIB Hyderabad
ప్రతిష్టాత్మకమైన 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కార్యక్రమం కింద కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి
నవంబర్ 18, 2021వ తేదీన లలిత కళా అకాడమి (నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్)లో ఒక ప్రదర్శనను ప్రారంభించారు. లలిత కళా అకాడమీ కమల్ ఆర్ట్ గ్యాలరీ సహకారంతో వారం రోజులపాటు కొనసాగే ‘భారతమాత ఏవం భారత్ కే నాయక్’ అనే ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శనలో భాగంగా ప్రముఖ కళాకారుడు శ్రీ పవన్ వర్మ "షాహీన్ష చిత్రాలను ప్రదర్శిస్తారు. లలిత కళా అకాడమీ ప్రోటెమ్ చైర్మన్ డాక్టర్ ఉత్తమ్ పచర్నే మరియు కమల్ ఆర్ట్ గ్యాలరీ వ్యవస్థాపకుడు, ఎండీ శ్రీ కమల్ చిబ్ సమక్షంలో



ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో రవీంద్రనాథ్ ఠాగూర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఏపీజే అబ్దుల్ కలాం, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వంటి దిగ్గజాల చిత్రాలను ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శన నవంబర్ 18 నుండి 24వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు సందర్శకుల కోసం తెరిచి ఉంటుంది.
******
(Release ID: 1772948)
Visitor Counter : 149