సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

సూక్ష్మ, లఘు, మధ్యతరహా సంస్థల శాఖ మంత్రి. కేంద్ర మంత్రి, శ్రీ నారాయణ్ రాణే అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిస్వా శర్మ తో పాటు ఈశాన్య MSME సమాలోచనా సమావేశ నిర్వహణ

Posted On: 17 NOV 2021 3:02PM by PIB Hyderabad

సూక్ష్మ, లఘు,  మధ్యతరహా సంస్థల శాఖ మంత్రి. కేంద్ర మంత్రి, శ్రీ నారాయణ్ రాణే, 18 నవంబర్ 2021న శ్రీ హిమంత బిస్వా శర్మతో కలిసి ఈశాన్య MSME సమాలోచన మండలి(కాన్క్లేవ్‌)కి అధ్యక్షత వహిస్తారు. గౌహతిలో  ఈశాన్య రాష్ట్రాల సీనియర్ మంత్రులు  ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సమావేశాన్ని  ఈశాన్య ప్రాంతంలో MSMEల అభివృద్ది, పరిశ్రమల  స్థాపన ,  వాణిజ్య అవకాశాలను ప్రోత్సహించడం లక్ష్యంగా సూక్ష్మ, లఘు,  మధ్యతరహా సంస్థల శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.

ఉపాధి కల్పన మరియు ఉత్పాదకత అవకాశాలను విస్తరించడంలో  సూక్ష్మ, లఘు,  మధ్యతరహా సంస్థల  రంగం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం, ఇది 11 కోట్ల మందికి పైగా ఉద్యోగులను, 6 కోట్ల పరిశ్రమ విభాగాలను  కలిగి,   స్థూల జాతీయోత్పత్తికి   30% కంటే ఎక్కువ లబ్ది చేకూరుస్తుంది.  భారతదేశం నుండి మొత్తం ఎగుమతుల్లో 49% కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధికి  ఈ రంగమే ప్రధాన సహకారి .

 

మనం ఈశాన్య ప్రాంతాలను అభివృద్ధి చేసినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది అనేది  MSME మంత్రిత్వ శాఖ  విశ్వసించే ముఖ్య  అంశం. ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధిని పెంపొందించడానికి అభివృద్ధిపై దేశం  స్థూల జాతీయోత్పత్తిలో MSMEల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఈశాన్య ప్రాంతంలో మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.

భారత ఆర్థిక వ్యవస్థ, MSME రంగ పనితీరు మధ్య పరస్పర సంబంధం, పనితీరు  ఎన్నడూ లేనంత సమతూకంగా ఉన్నది. రాబోయే సంవత్సరాల్లో ఇది మరింత సహకారంతో  పెరుగుతూనే ఉంటుంది. మన ఆర్థిక వ్యవస్థపై MSMEల ప్రభావం దృష్ట్యా, యువతలో పార్తిశ్రామిక  వ్యవస్థాపకతను ప్రోత్సహించడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో వారిని  సమగ్ర పాత్ర పోషించేలా చేయడం ద్వారా ముందుగా నిర్దేశించుకున్న  5 లక్షల కోట్ల  (ట్రిలియన్ )ఆర్థిక వ్యవస్థ గా రూపొందే కల ను సాకారం చేయడం అత్యవసరం.

మారుతున్న  ఆర్థిక రంగ ఎదుగుదలకు ఆలంబనగా  పారిశ్రామిక వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, ఈ  రంగంలో  పోటీతత్వాన్ని పెంపొందించడం ద్వారా  ఇటువంటి సమాలోచనా సమావేశాలు ఈశాన్య ప్రాంత అభివృద్ధికి సహాయపడతాయి.

 

ఇది మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడిన పథకాల గురించి అవగాహనను పెంపొందించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఇతర వాటాదారులతో ఒక అవగాహనా చర్చను ప్రారంభించడంలో కూడా సహాయపడుతుంది, ఇది ఈ రంగానికి మెరుగైన  విధానాల అమలులో ఉపయోగకారి.

***


(Release ID: 1772768) Visitor Counter : 223


Read this release in: English , Urdu , Marathi , Hindi