సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ఏవీజీసికు నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోంది: శ్రీ అపూర్వ చంద్ర

Posted On: 17 NOV 2021 3:27PM by PIB Hyderabad

 

భారత పరిశ్రమల సమాఖ్య, ప్రసార భారతి భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న సిఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ 10వ ఎడిషన్..నవంబర్ 17న టెలికాం రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఛైర్మన్, డాక్టర్ పి.డి. వాఘేలా ప్రశంసలతో వర్చువల్‌గా ఘనంగా ప్రారంభమైంది. దేశంలో వంద శాతం టెలివిజన్ వ్యాప్తిని నిర్ధారించడానికి డిజిటల్ మీడియా యొక్క శక్తి మరియు పరిశ్రమను ప్రోత్సహించడం దీని ఉద్దేశం. స్కేలింగ్ న్యూ హైట్స్ ఆఫ్ కంటెంట్, క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ ఈ సమ్మిట్ థీమ్.

సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర ప్రారంభ సెషన్‌లో మాట్లాడుతూ "విదేశాలలో భారతదేశానికి సంబంధించి ఎం&ఈ ప్రొజెక్షన్ పరిధిని విస్తరించనున్నట్లు" ప్రకటించారు. బ్రాడ్‌కాస్ట్ సేవా పోర్టల్‌ను రూపొందించడం వల్ల బ్రాడ్‌కాస్ట్ సెక్టార్‌కు సమర్థవంతమైన మరియు పారదర్శకమైన పాలన అందించడం ద్వారా వివిధ వాటాదారులకు ఒకే పాయింట్ సదుపాయం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఏవీజీసికు నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని రూపొందించే దిశగా ప్రభుత్వం పని చేస్తోంది. మరియు థియేటర్ ప్రారంభ అనుమతులలో సహాయం చేయడానికి ఫిల్మ్ ఫెసిలిటేషన్ ఆఫీస్ పని చేస్తోందని తెలిపారు. అన్ని ప్రధాన అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో పాల్గొనడంతో పాటు, భారతదేశం యానిమేషన్, గేమింగ్ మరియు విజువల్ ఎఫెక్ట్స్‌లో 2022 నుండి అంతర్జాతీయ ఫెస్టివల్స్‌లో కూడా పాల్గొంటుందన్నారు. మీడియా మరియు వినోద పరిశ్రమలో ఏవీజీసి రంగం వాటా పెరుగుతోందని శ్రీ చంద్ర అన్నారు.

ప్రభుత్వం లైట్ టచ్ రెగ్యులేషన్‌ని కలిగి ఉండాలని మరియు ఫెసిలిటేటర్‌లుగా మరింతగా వ్యవహరించాలని కోరుకుంటుందని శ్రీ చంద్ర తెలిపారు. పరిశ్రమ గత 20 ఏళ్లలో భారీ వృద్ధిని కనబరుస్తోందని, త్వరలో 100 బిలియన్ డాలర్లకు చేరుకోబోతున్నామని ఆయన తెలిపారు.

భారతీయ మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమ దేశీయంగా మరియు అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధికి కీలక డ్రైవర్‌గా రూపాంతరం చెందుతోంది..అదే సమయంలో జనాభాలో గణనీయమైన భాగానికి ఉపాధి కల్పిస్తూ భారత ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువుగా రూపాంతరం చెందింది.

ప్రసార భారతి సీఈఓ శ్రీ శశి శేఖర్ వెంపటి..ఆర్కైవల్ ఫుటేజీని ఆధునిక షేర్ చేయదగిన ఫైల్ ఫార్మాట్‌లలోకి మార్చడం ద్వారా కంటెంట్, సృజనాత్మకత మరియు ఆవిష్కరణల కొత్త విధానాలను పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ స్కేల్ చేయడం గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. సాంకేతికత ద్వారా టెలివిజన్ మరియు రేడియో కంటెంట్‌ల కలయిక ముందుకు వెళ్లే మార్గమని ఆయన అన్నారు.

సిఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్-2021 10వ ఎడిషన్ భారతీయ ఎం&ఈ పరిశ్రమ 100 బిలియన్ యూఎస్ డాలర్ల విలువైన మార్కును చేరుకోవడానికి అవసరమయ్యే బలమైన మరియు సంపూర్ణ వాతావరణాన్ని సృష్టించేందుకు పరిశ్రమలోని వాటాదారులందరికీ ఒక వేదికను అందిస్తుంది. విభాగాన్ని ముందుకు నడపడానికి విధాన కార్యక్రమాలపై దృష్టి సారిస్తూనే భవిష్యత్తు కార్యాచరణ నిర్దేశించబడుతుంది.

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా రెండు రోజుల సమ్మిట్‌లో మీడియా మరియు వినోద పరిశ్రమకు సంబంధించి మొత్తం స్పెక్ట్రమ్‌ను కవర్ చేసే అనేక సెషన్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. వీటిలో బ్రాడ్‌కాస్టింగ్ మరియు టెలివిజన్, ఓటీటీ, చలనచిత్రాలు, యానిమేషన్ & విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, అడ్వర్టైజింగ్, న్యూస్ మరియు పబ్లిషింగ్ ఉన్నాయి. సెషన్‌లు సమాంతర సమస్యలను అలాగే నిర్దిష్ట రంగాలకు సంబంధించిన సమస్యలను కవర్ చేసే విధంగా రూపొందించబడ్డాయి.

80 మంది వక్తలు సెన్స్ మరియు సెన్సిబిలిటీ మధ్య సరైన సమతుల్యతను సాధించడం వంటి సమస్యలను చర్చిస్తారు; కొత్త లక్ష్యాలను నిర్దేశించడం; పరిశ్రమలో ప్రతిభ సమస్య మరియు దాని కొరతను అధిగమించే మార్గాలు; మీడియా మరియు వినోదంలో క్లౌడ్ సాంకేతికత పెరుగుతున్న పట్టు; టెలివిజన్ కోసం భారీ ప్రణాళిక; థియేటర్ల భవిష్యత్తు; డిజిటల్ ఇండియాలో డిజిటల్ చెల్లింపులు; టెలివిజన్ యొక్క కొత్త ముఖం ఓటీటీ; ప్రాంతీయ కంటెంట్ యొక్క శక్తి; ఏవీజీసి మరియు ఈ-స్పోర్ట్స్‌లో విలువ సృష్టి మరియు ప్రచురించని మరియు ఆర్కైవల్ కంటెంట్ యొక్క సంభావ్యత వంటి ఆంశాలు చర్చకు వస్తాయి.

సిఐఐ నేషనల్ కమిటీ చైర్మన్ మరియు కంట్రీ మేనేజర్ & ప్రెసిడెంట్, ది వాల్ట్ డిస్నీ కంపెనీ ఇండియా & స్టార్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీ కే.మాధవన్ మీడియా మరియు ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి సంబంధించి మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్‌పై భారతదేశానికి చెందిన ఎం &ఈ పరిశ్రమ కోసం సిఐఐ పిచ్‌ను ప్రదర్శించారు.

కొరియా తన కె-పాప్ సంస్కృతితో ప్రపంచాన్ని శాసించగలిగితే..100 ఏళ్ల చరిత్ర కలిగిన సినిమా మరియు వినోద పరిశ్రమ ఉన్న భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అలాంటి అలజడిని రేపకపోవడానికి కారణం లేదని శ్రీ సిద్ధార్థ్ రాయ్ కపూర్ అన్నారు.

***



(Release ID: 1772748) Visitor Counter : 157