పర్యటక మంత్రిత్వ శాఖ

ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా పోచంపల్లి ఎంపిక

"ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా ప్రధాన మంత్రి వోకల్ 4 లోకల్ నినాదం తో పోచంపల్లి నేత శైలులు మరియు నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి”- శ్రీ జి. కిషన్ రెడ్డి

"పోచంపల్లి గ్రామానికి ఈ అవార్డు రావడం పట్ల ప్రత్యేకించి పోచంపల్లి ప్రజల తరపున, తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను-శ్రీ జి. కిషన్ రెడ్డి

Posted On: 16 NOV 2021 4:50PM by PIB Hyderabad


కీలక ముఖ్యాంశాలు :

  • స్పెయిన్ లోని మాడ్రిడ్ లో 2021 డిసెంబర్ 2న జరిగే యుఎన్ డబ్ల్యుటివో జనరల్ అసెంబ్లీ 24వ సెషన్ సందర్భంగా ఈ అవార్డు ఇవ్వబడుతుంది.
  • "పోచంపల్లి మరియు ఇతర గ్రామాల గురించి పోటీలో నమోదు చేసి సమర్థవంతంగా వివరాలు సమర్పించినందుకు మంత్రిత్వ శాఖ అధికారులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ": శ్రీ జి కిషన్ రెడ్డి

 

తెలంగాణ రాష్ట్రంలోని పోచంపల్లి గ్రామాన్ని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా ఎంపిక చేసింది. 2021 డిసెంబర్ 2వ తేదీన స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగే UNWTO జనరల్ అసెంబ్లీ  24వ సెషన్ సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఇవ్వబడుతుంది.

కేంద్ర సంస్కృతి, పర్యాటక మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి (DoNER) శ్రీ జి కిషన్ రెడ్డి  గ్రామ ప్రజలను అభినందిస్తూ, “పోచంపల్లి యొక్క ప్రత్యేకమైన నేత శైలులు మరియు నమూనాలు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క ఆత్మ నిర్భర్ భారత్ వోకల్ 4 లోకల్ నినాదం ద్వారా ప్రత్యేక దృష్టిని ఆకర్షించాయి "అని తెలిపారు.

“పోచంపల్లి గ్రామానికి ఈ అవార్డు రావడం పట్ల ప్రత్యేకించి పోచంపల్లి ప్రజల తరపున, తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పోచంపల్లి మరియు ఇతర గ్రామాలను పోటీలో నమోదు చేసి   సమర్ధవంతంగా వివరాలు సమర్పించినందుకు మంత్రిత్వ శాఖ అధికారులకు. కృతజ్ఞతలు ” అని మంత్రి తెలిపారు.

యుఎన్ డబ్ల్యుటివో పైలట్ కార్యక్రమం ద్వారా ఉత్తమ పర్యాటక గ్రామాలు' గ్రామీణ గమ్యస్థానాలకు అత్యుత్తమ ఉదాహరణలు మరియు దానికి సంబంధించిన తొమ్మిది మూల్యాంకన ప్రాతిపదికలకు అనుగుణంగా మంచి పర్యాటక క్షేత్రం గా  ప్రదర్శించే గ్రామాలకు అవార్డు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. శిక్షణ మరియు అభివృద్ధికి అవకాశాలను పొందడం ద్వారా వారి గ్రామీణ పర్యాటక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి గ్రామాలకు మద్దతు ఇవ్వడం కూడా దీని లక్ష్యం. భారతదేశం నుండి యుఎన్ డబ్ల్యుటివో ఉత్తమ పర్యాటక గ్రామ ప్రవేశం కోసం పర్యాటక మంత్రిత్వ శాఖ మూడు గ్రామాలను సిఫార్సు చేసింది. అవి మేఘాలయలోని కొంగ్‌థాంగ్, లధ్‌పురా ఖాస్, మధ్యప్రదేశ్ మరియు తెలంగాణలోని పోచంపల్లి. వీటిలో  పోచంపల్లి గ్రామాన్ని గుర్తించి యుఎన్ డబ్ల్యుటివో చే అవార్డు పొందనుంది.

భారతదేశంలోని సిల్క్ సిటీ అని పిలవబడే పోచంపల్లి, హైదరాబాదు నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇది తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని ఒక పట్టణం మరియు ఇకత్ అనే ప్రత్యేకమైన శైలి ద్వారా నేయబడిన సున్నితమైన చీరలు. ఈ శైలి, పోచంపల్లి ఇకత్, 2004లో భౌగోళిక సూచిక (GI స్థితి) పొందింది.

ఇకత్ అనేది మలేషియా, ఇండోనేషియా పదం, దీని అర్థం "టై అండ్ డై". ఇకత్‌లో కట్టబడిన నూలు యొక్క విభాగాలను నేయడానికి ముందుగా నిర్ణయించిన రంగు నమూనాకు చుట్టడం (లేదా కట్టడం) మరియు రంగులు వేయడం వంటి ప్రక్రియ ఉంటుంది. చుట్టబడిన విభాగం రంగు వేయబడకుండానే ఉన్నప్పుడు రంగు బహిర్గతమైన విభాగాలలోకి చొచ్చుకుపోతుంది. ఈ ప్రక్రియలో నూలుతో ఏర్పడిన ఈ నమూనా ఫాబ్రిక్లో అల్లినది.

2015లో, నేత సాంకేతికతలలోని వైవిధ్యాన్ని మరియు మన సుసంపన్నమైన చేనేత సంప్రదాయాన్ని గుర్తించేందుకు, 1905లో కలకత్తా పట్టణం టౌన్ హాలు లో స్వదేశీ ఉద్యమం అధికారిక ప్రకటనకు నివాళిగా ఆగస్టు 7న మొదటి జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

ఏప్రిల్ 18, 1951న ఈ గ్రామం నుండి ఆచార్య వినోభా భావే ప్రారంభించిన భూదాన్ ఉద్యమానికి గుర్తుగా పోచంపల్లిని భూదాన్ పోచంపల్లి అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం గ్రామంలో రెండు గదుల వినోభా భావే మందిరం ఉంది, ఇది గతంలో వినోభా భావే గ్రామాన్ని సందర్శించడానికి వచ్చినపుడు  నివసించిన ప్రదేశం.

కేంద్ర మంత్రి మాట్లాడుతూ, “పర్యాటక మంత్రిత్వ శాఖ గ్రామీణ పర్యాటక విధానాన్ని రూపొందించింది, ఇది మన గ్రామాలలో పర్యాటకాన్ని ప్రోత్సహించడమే కాకుండా స్థానిక కళలు, చేతివృత్తులను పునరుజ్జీవింపజేస్తుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. ఇది మన గ్రామాలను, గ్రామీణ జీవితాన్ని పునర్నిర్మించడానికి  సహాయం చేస్తుంది. గ్రామాల నివాసితులు బయటి వ్యక్తులతో పరస్పరం పాల్గొనడానికి మరియు సంభాషించే అవకాశాన్ని కూడా పొందుతారు.

భారతదేశ 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధానమంత్రి పిలుపు గురించి కూడా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ, “మన దేశ పౌరులు కనీసం 15 పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని మన ప్రధాని అభ్యర్థించారు. ఈ దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్లడం కోసం నేను పౌరులను వారి ప్ప్రయాణంలో గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉన్న పోచంపల్లి వంటి గ్రామీణ ప్రాంతాలను చేర్చాలని మరియు మన దేశంలోని గ్రామాల అందాలను అన్వేషించాలని కోరుతున్నాను.

 

 

******* 



(Release ID: 1772350) Visitor Counter : 595


Read this release in: English , Urdu , Hindi , Punjabi