శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ సొసైటీ వార్షిక జనరల్ బాడీ మీటింగ్
Posted On:
15 NOV 2021 1:47PM by PIB Hyderabad
కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షతన 14, నవంబర్ 2021న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ (ఎన్ఐఐ) సొసైటీ వార్షిక జనరల్ బాడీ మీటింగ్ జరిగింది.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ డైరెక్టర్ ఇన్ చార్జ్ డాక్టర్ పుష్కర్ శర్మ... ఇన్ఫ్లమేషన్, వ్యాధికారకత, వృద్ధాప్యం, రోగనిరోధక ప్రతిస్పందనను నియంత్రించే ప్రాథమిక ప్రక్రియల గురించి ఎన్ఐఐ సంస్థ చేసిన పని గురించి వివరించారు. ఇన్ఫెక్షన్ మరియు రోగనిరోధక శక్తి, పరమాణు రూపకల్పన, జన్యు నియంత్రణ, పునరుత్పత్తి మరియు అభివృద్ధితో సహా వివిధ పరిశోధనా రంగాలపై దృష్టి కేంద్రీకరించినట్లు ఆయన తెలిపారు. ఆధునిక జీవశాస్త్రంలో అత్యాధునిక ప్రక్రియల ద్వారా పరిశోధన సమయాన్ని, వ్యవయాన్ని తగ్గించినట్లు తెలిపారు.
SARS-CoV-2 వ్యాక్సిన్ కోసం ప్రత్యేకంగా పరివర్తన పరిశోధన వైపు గుర్తించదగిన స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. క్రియారహితం చేయబడిన వైరస్ వ్యాక్సిన్ బీబీవీ152/కోవాగ్జిన్... సార్స్కోవీ2కి బలమైన సెల్యులార్ రోగనిరోధక జ్ఞాపకశక్తిని మరియు డెల్టా, ఆల్ఫా, బీటా మరియు గామా యొక్క వైవిధ్యాలను కలిగి ఉందని, ఇది కనీసం 6 నెలల వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. కోవిడ్ 19 పరిశోధన కోసం కూడా ఎన్ఐఐ సేవలందించిందని, కోవిడ్ 19ను ఎదుర్కొనేందుకు 65 మంది మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లకు శిక్షణనిచ్చిందని చెప్పారు. అంతేకాకుండా 30వేలకుపైగా నమూనాలను పరిశీలించడమే కాకుండా పాజిటివ్ నమూనాలను జీనోమ్ సక్వెన్స్ కోసం పంపామని చెప్పారు. ఈ సందర్భంగా గౌరవ మంత్రి జితేంద్ర సింగ్.. గత 40 ఏళ్లుగా పరిశోధన రంగంలో ఎన్ఐఐ చేస్తున్న కృషిని ప్రశంసించారు.
ఆస్టియో ఆర్థరైటిస్ (ఏవో) కోసం ఎన్ఐఐ కొల్లాజెన్ ఆధారిత హెర్బల్ సూత్రీకరణను కూడా అభివృద్ధి చేసిందని డాక్టర్ శర్మ వివరించారు. ఈ సూత్రీకరణలో (ఎస్జీ002)లో బయోయాక్టివ్ కొల్లాజెన్ పెప్టైడ్ మరియు రెండు హిమాలయ మొక్కల ఆల్కహాలిక్ సారం ఉన్నాయన్నారు. తదుపరి తరం ఇన్ఫ్లుఎంజా వ్యాక్సినేషన్ కోసం ఎన్ఐఐ సంస్థ ఇండో-యూరోపియన్ కన్సార్టియంలో కూడా భాగమని శర్మ తెలిపారు. ఈ సంస్థ కోబ్రా (కంప్యూటేషనల్‌గా ఆప్టిమైజ్డ్ బ్రాడ్లీ రియాక్టివ్ యాంటిజెన్) వ్యాక్సిన్‌పై పనిచేస్తున్న సమూహంలో భాగమని గుర్తుచేశారు. కాలానుగుణ మరియు మహమ్మారి జాతులను కవర్ చేసే ఒక దశాబ్దంలో ఇన్ఫ్లుఎంజా జాతుల క్రమాన్ని విశ్లేషించడం ద్వారా ఇది అభివృద్ధి చేయబడుతుంది. గత రెండు దశాబ్దాల పరిశోధనల ఆధారంగా.. కోబ్రా వ్యాక్సిన్ కాలానుగుణ ఫ్లూ, ఫ్లూ యొక్క అన్ని అంటువ్యాధుల రకాలు మరియు కొత్తగా ఉద్భవిస్తున్న ఫ్లూ జాతుల నుండి రక్షణను అందించగలదని భావిస్తున్నారు. అధ్యయనం కోసం ఎన్ఐఐ క్యాంపస్‌లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎన్హెచ్పీఏబీఎస్ఎల్3 సదుపాయాలు కల్పించబడుతున్నాయి చెప్పారు. దీనిని దేశంలోని ఇతర పరిశోధకులతో కూడా పంచుకుంటారని చెప్పారు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ చేసిన పరిశోధనలు ప్రచురించబడ్డాయని, పేటెంట్ హక్కులు కూడా పొందాయని శర్మ చెప్పారు. సైన్ సేతు కార్యక్రమం ద్వారా కళాశాల మరియు పాఠశాల విద్యార్థుల కోసం ఎన్ఐఐ క్రమం తప్పకుండా ఆన్‌లైన్ వెబ్‌నార్లను నిర్వహిస్తోందన్నారు. ఎన్ఐఐ అధ్యాపకుల ఉపన్యాసాలు, సంభాషణ ఉపన్యాసాలు మరియు గెస్ట్ లెక్చరర్లతో ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తోందన్నారు. నీతి ఆయోగ్సూచించిన ఆస్పిరేషనల్ జిల్లాల్లో ఎన్ఐఐ సైన్స్ మ్యూజియంను కూడా ఏర్పాటు చేస్తోందని సంస్థ డైరెక్టర్ ఇన్ చార్జ్ డాక్టర్ పుష్కర్ శర్మ వివరించారు.
***
(Release ID: 1772154)
Visitor Counter : 167