ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
112.34 కోట్లు పైబడ్డ భారత టీకా డోసుల సంఖ్య
గత 24 గంటలలో 30.20 లక్షలకు పైగా టీకా డోసుల పంపిణీ
కోలుకున్నవారి శాతం ప్రస్తుతం 98.26%
గత 24 గంటల్లో కొత్త కరోనా కేసులు 10,229
దేశంలో చికిత్సలో ఉన్నవారు 1,34,096మంది; 523 రోజుల అత్యల్పం
వారపు పాజిటివిటీ 0.99%, 52 రోజులుగా 2% లోపు
Posted On:
15 NOV 2021 9:32AM by PIB Hyderabad
గత 24 గంటలలో 30,20,119 మందికి టీకాలివ్వటంతో దేశంలో మొత్తం ఈ ఉదయం 7 గంటల దాకా పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 112.34 కోట్లు దాటి 1,12,34,30,478 కు చేరింది. మొత్తం 1,15,01,243 శిబిరాల ద్వారా దీన్ని సాధించగలిగారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
1,03,80,497
|
రెండో డోస్
|
93,34,144
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
1,83,74,094
|
రెండో డోస్
|
1,61,78,125
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
43,26,35,344
|
రెండో డోస్
|
17,04,47,156
|
45-59 వయోవర్గం
|
మొదటి డోస్
|
17,83,12,929
|
రెండో డోస్
|
10,49,30,515
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొదటి డోస్
|
11,17,34,885
|
రెండో డోస్
|
7,11,02,789
|
మొత్తం
|
1,12,34,30,478
|
గత 24 గంటలలో 11,926 మంది బాధితులు కోలుకోగా మొత్తం ఇప్పటిదాకా కోవిడ్ బారినపడి కోలుకున్నవారి సంఖ్య 3,38,49,785కి చేరింది. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి శాతం 98.26% అయింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న చర్యల ఫలితంగా గత 141 రోజులుగా రోజువారీ కొత్త కేసులు 50 వేలలోపే ఉంటున్నాయి. గత 24 గంటలలో 10,229 కొత్త కేసులు వచ్చాయి.
ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 1,34,096 కాగా ఇది గత 523 రోజుల అత్యల్పం. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారు మొత్తం పాజిటివ్ కేసులలో 0.39% మాత్రమే. ఇది 2020 మార్చి తరువాత అత్యల్పం.
పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. గత 24 గంటలలో 9,15,198 పరీక్షలు జరపగా, దేశ వ్యాప్తంగా అయిప్పటిదాకా జరిపిన పరీక్షలు 62.46 కోట్లకు పైగా (62,46,66,542) కు చేరాయి. ఆ విధంగా పరీక్షల సామర్థ్యం పెరగటంతో వారపు పాజిటివిటీ 0.99% కు చేరి గత 52 రోజులుగా 2% లోపే నమోదవుతూ వస్తోంది. రోజువారీ పాజిటివిటీ 1.12% కాగా ఇది 42 రోజులుగా 2% లోపే. 77 రోజులుగా 3% లోపే ఉంటోంది.
***
(Release ID: 1771999)
Visitor Counter : 150