శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్ వైరస్.పై ఇప్పటివరకూ లక్ష జినోమ్, డి.ఎన్.ఎ. పరీక్షలు!


బయోటెక్నాలజీ, బయోరిపాజిటరీల
ఆధ్వర్యంలో నిర్వహణ...

అధ్యయన సంస్థల అందుబాటులోకి
57వేల నమూనాలు: డాక్టర్ జితేంద్ర..

కోవిడ్ పరిశోధన, వ్యాక్సీన్ల అభివృద్ధిపై
సమీక్షా సమావేశంలో కేంద్రమంత్రి వెల్లడి

Posted On: 12 NOV 2021 5:55PM by PIB Hyderabad

    దేశంలో కోవిడ్-19 వైరస్ సంక్రమణ స్థితిని తెలుసుకునేందుకు ఇప్పటి వరకూ లక్ష జినోమ్, డి.ఎన్.ఎ. సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. కేంద్ర బయోటెక్నాలజీ శాఖ (డి.బి.టి.), కోవిడ్-19 బయో రిపాజిటరీలు కలసి ఈ పరీక్షలు నిర్వహించినట్టు, తదుపరి పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకోసం 57,000వేల నమూనాలను వివిధ అధ్యయనసంస్థలకు, పారిశ్రామిక సంస్థలకు అందుబాటులో ఉంచినట్టు ఆయన చెప్పారు. సైన్స్, టెక్నాలజీ శాఖ సహాయ మంత్రిగా స్వతంత్ర హోదాతో వ్యవహరిస్తున్న డాక్టర్ జితేంద్ర సింగ్, భూగోళ విజ్ఞానం, ప్రధానమంత్రి కార్యాయ వ్యవహారాలు, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష పరిశోధన శాఖలను కూడా పర్యవేక్షిస్తున్నారు.

  కోవిడ్-19పై ప్రస్తుతం సాగుతున్న పరిశోధన, వాక్సీన్ల అభివృద్ధి, తదితర అంశాలపై న్యూఢిల్లీలో జరిగిన సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడారు. కేంద్ర బయోటెక్నాలజీ శాఖకు అనుబంధంగా దేశవ్యాప్తంగా పనిచేస్తున్న వివిధ స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలు ఈ పరిశోధనలో అందించిన సేవలపై కూడా ఈ సందర్భంగా సమీక్ష జరిపారు.

https://ci3.googleusercontent.com/proxy/Imypjo9T1bUA2YQJyCklDMSAq35uTeY0LHr1TU9_I9vtwoRnyv2c-KqfDpsFj5SN9vQnZwvIKUSVeJNdm0hIZvN0sk11Y5GMJdDXzyme0FENbNFMPe01SI1LzQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001MWFN.jpg

   ఒడిశా సైన్స్, టెక్నాలజీ శాఖ మంత్రి అశోక్ పాండా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఢిల్లీ ఉన్నత విద్యాశాఖ ఇన్ చార్జి మంత్రి మనీష్ శిసోడియా కూడా ఈ సమీక్షకు హాజరయ్యారు. భువనేశ్వర్ లోని లైఫ్ సైన్సెస్ ఇన్.స్టిట్యూట్ తరఫున అశోక్ పాండా, న్యూఢిల్లీలోని జాతీయ మొక్కల జన్యు పరిశోధనా సంస్థ (ఎన్.ఐ.పి.జి.ఆర్.) తరఫున మనీష్ శిసోడియా హాజరయ్యారు. 

  సమీక్షా సమావేశంలో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, తిరువనంతపురంలోని రాజీవ్ గాంధీ బయోటెక్నాలజీ పరిశోధనా కేంద్రం (ఆర్.జి.సి.బి.) రెండవ శాఖలో వ్యాక్సీన్ పరీక్షా కేంద్రం, పరిశోధనా విభాగం త్వరలో అందుబాటులోకి రానున్నట్టు చెప్పారు. గాలి ద్వారా ప్రయాణించే కోవిడ్-19 వంటి వైరస్.లపై పరిశోధన నిర్వహించేందుకు వీలు కలిగించే బి.ఎస్.ఎల్.3 అనే ప్రత్యేక సదపాయం కూడా ఈ కేంద్రంలో ఏర్పాటు కానున్నట్టు ఆయన చెప్పారు. ఇలాంటి సదుపాయం అందుబాటులోకి రావడం దక్షిణాదిలోనే ఇదే తొలిసారి అవుతుందన్నారు. కేన్సర్ వ్యాక్సీన్, కోవిడ్-19 తో సహా ఇతర అంటు వ్యాధుల వ్యాక్సీన్ తోపాటుగా,  పలు రకాల వ్యాక్సీన్లకు రూపకల్పన చేసే పరిశోధనా కేంద్రంగా ఆర్.జి.సి.బి.ని అభివృద్ధి చేయనున్నట్టు కేంద్రమంత్రి చెప్పారు. “దీనితో వ్యాక్సీన్ పరిశోధన, అభివృద్ధి రంగంలో ఆర్.జి.సి.బి.కి భారీ స్థాయి గుర్తింపు లభిస్తుంది.” అని అన్నారు. ఒకవైపు సృజనాత్మక పద్ధతిలో పరిశోధనను సాగిస్తూనే, మరో వైపు బయోటెక్నాలజీ ఇంకుబేషన్ సదుపాయాలను వినియోగించుకుంటున్న ఆర్.జి.సి.బి. నమూనా ఎంతో అభినందనీయమని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

https://ci4.googleusercontent.com/proxy/Ju_A1dD9Jv86XjgPzz_gLHPJwFwXc9XCVRXQvdTqURjpjyBUPA6fVkuyPYOyn_AKS709bnH-5ETqq741YB22ifkb1hERtPd-VXlW_6fE5bOXHeamsUvDVm47ew=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002Z73Q.jpg

   కేంద్ర బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి డాక్టర్ రాజేశ్ గోఖలే మాట్లాడుతూ, ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో తలెత్తిన కోవిడ్-19 వైరస్ ముప్పును గుర్తించిన వెంటనే పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఒక కార్యాచరణ ప్రణాళికను కేంద్ర బయోటెక్నాలజీ శాఖ వెనువెంటనే తయారు చేసిందన్నారు. వ్యాధినిర్ధారణ, చికిత్స, వ్యాధి నిరోధం వంటి అంశాలపై దృష్టిని కేంద్రీకరిస్తూ ఈ ప్రణాళికను తయారు చేసినట్టు చెప్పారు. వ్యాక్సీన్ల రూపకల్పనకు, వ్యాధి నిర్ధారణ, చికిత్సా పద్ధతులకు సంబంధించి వంద పథకాలకు బయోటెక్నాలజీ శాఖ సహాయ సహకారాలు అందించినట్టు చెప్పారు. దీనితో పారిశ్రామిక పరంగా 7 వ్యాక్సీన్లపై, అధ్యయన సంస్థల ఆధ్వర్యంలో 8 వ్యాక్సీన్లపై ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించగలిగినట్టు తెలిపారు. కోవిడ్ సురక్షా పథకం కింద 5 వ్యాక్సీన్లపై ప్రయోగాత్మక పరీక్షలకు, 19 క్లినికల్ ప్రయోగ కేంద్రాల నిర్వహణకు కేంద్ర బయోటెక్నాలజీ శాఖ తగిన మద్దతు ఇచ్చినట్టు మంత్రి తెలిపారు.

  భువనేశ్వర్.లోని జీవ విజ్ఞాన శాస్త్రాల అధ్యయన సంస్థ (ఐ.ఎల్.ఎస్.) తరఫున ప్రతినిధులు మాట్లాడుతూ, కోవిడ్-19కు సంబంధించి డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లతో సహా 22 వేరియంట్ల లక్షణాలను నిర్ధారించిన దేశంలోని మూడు సంస్థల్లో ఐ.ఎల్.ఎస్. ఒకటని అన్నారు. దీనికి తోడు ప్లాస్మా, లాలాజలం, రక్తం, మూత్రం, మలంలతో కూడిన 3 వేలదాకా కోవిడ్-19 క్లినికల్ నమూనాలకోసం ఒక బయోరిపాజిటరీని ఐ.ఎల్.ఎస్. నెలకొల్పగలిగిందన్నారు. వాణిజ్యపరంగా ఉత్పాదన రూపకల్పనకోసం వివిధ అధ్యయన సంస్థలు, స్టార్టప్ కంపెనీలు జరిపే పరిశోధనకు జాతీయ స్థాయి వనరుల కేంద్రంగా ఐ.ఎల్.ఎస్. పనిచేసిందని చెప్పారు. కోవిడ్ నిర్ధారణా పరీక్షల నిర్వహణలో కూడా ఐ.ఎల్.ఎస్. ప్రముఖంగా కృషి చేసిందని, 3 లక్షలకు పైగా ఆర్.టి.పి.సి.ఆర్. పరీక్షలు నిర్వహించగలిగిందని అన్నారు. అలాగే, ఒడిశా, జార్ఖండ్, చత్తీస్ గఢ్, బీహార్, మహారాష్ట్రలనుంచి సేకరించిన నమూనాలపై 9,000 జినోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహించిందన్నారు. లక్షణాలతో కూడిన,..  అసలు లక్షణాలే కనిపించని కోవిడ్ రోగుల వ్యాధి నిరోధక శక్థి స్థితిని కూడా ఇది నిర్ధారించిందన్నారు. కోవిడ్.పై పరిశోధనకోసం ఐ.ఎల్.ఎస్. ఏర్పాటు చేసిన ఈ సదుపాయాలను వివిధ అధ్యయన, పరిశోధనా సంస్థలు, ప్రైవేటు పరిశ్రమలు, స్టార్టప్ కంపెనీలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ సూచించారు.

  హైదరాబాద్ నగరానికి చెందిన డి.ఎన్.ఎ. వేలిముద్రల పరిశోధన, వ్యాధి నిర్ధారణ కేంద్రం (సి.డి.ఎఫ్.డి.) అధిపతి మాట్లాడుతూ, 38 పరిశోధనాగారాల వ్యవస్థను కలిగిన  ఇండియన్ సార్స్ కోవ్-2 జినోమిక్స్ కన్షార్షియం (ఇన్సాకాగ్) కూడా కరోనా వైరస్ జన్యు స్థితిపై నిఘాను చేపట్టిందని చెప్పారు. హైదరాబాద్.కు చెందిన సి.డి.ఎఫ్.డి. కూడా ఇన్సాకాగ్ వ్యవస్థలో ప్రధానభాగమని, ఇప్పటివరకూ 5,000కు పైగా జన్యువులపై జినోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహించిందని చెప్పారు. కరోనాకు సంబంధించి, డెల్టా.., డెల్టా ప్లస్ వేరియంట్లపై దేశంలో తొలిసారిగా పరిశోధనను నిర్వహించిన సంస్థ కూడా ఇదేనని చెప్పారు.

  ఇక కోవిడ్-19 సంబంధిత కార్యకలాపాలపై మణిపూర్ రాజధాని ఇంపాల్.లోని జీవ వనరులు, సుస్థిర అభివృద్ధి పరిశోధనా సంస్థ (ఐ.బి.ఎస్.డి.) నిర్వహించిన పాత్రను డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. ఒక్క మణిపూర్ రాష్ట్రంలోనే కాక, సిక్కిం, మేఘాలయ, మిజోరాంలతో సహా ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఐ.బి.ఎస్.డి. పరిశోధనలు నిర్వహించిందంటూ ఆయన ప్రశంసించారు. కోవిడ్ మహమ్మారి వైరస్ ముప్పు తలెత్తినప్పటినుంచి, రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించడంలో ఐ.బి.ఎస్.డి. ఎంతో కీలకపాత్ర పోషించిందన్నారు. మణిపూర్.లో కోవిడ్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటుగా, మిజోరాం, మేఘాలయ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను నెలకొల్పడం, జినోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్టులను చేపట్టడంలో ఈ సంస్థ కీలకపాత్ర పోషించిందన్నారు. వెదురునుంచి సంగ్రహించే బంసులోచన్ అనే వ్యాధినిరోధక పదార్థాన్ని ఈ కేంద్రం అభివృద్ధి చేసిందన్నారు. వ్యాధినిరోధక శక్తిని పెంచే విశిష్ట లక్షణం ఉన్న ఈ పదార్థ వినియోగం కూడా గణనీయంగా పెరిగిందని చెప్పారు.

  దేశంలోని నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి, కోవిడ్ వైరస్.కు సంబంధించి మొక్కల జన్యు పరిశోధనా ప్రాజెక్టును ప్రారంభించడానికి న్యూఢిల్లీకి చెంది న ఎన్.ఐ.జి.పి.ఆర్. సంకల్పించిందని చెప్పారు.

  తిరువనంతపురానికి చెందిన ఆర్.జి.సి.బి... హైదరాబాద్.కు చెందిన సి.డి.ఎఫ్.డి. భువనేశ్వర్.కు చెందిన ఐ.ఎల్.ఎస్., న్యూఢిల్లీకి చెందిన ఎన్.ఐ.పి.జి.ఆర్., ఇంపాల్ కు చెందిన ఐ.బి.ఎస్.డి.ల  అధిపతులు, వివిధ విభాగాల డైరెక్టర్లు ఈ నాటి సమీక్షా సమావేశంలో పాలుపంచుకున్నారు.

 

<><><>



(Release ID: 1771337) Visitor Counter : 153


Read this release in: English , Urdu , Hindi