జల శక్తి మంత్రిత్వ శాఖ

ఉత్తరప్రదేశ్ లో 735 తాగునీటి సరఫరా పథకాలకు కేద్రం ఆమోదం.


రూ. 1,882 కోట్ల విలువైన పథకాలతో 1,262 ఉత్తరప్రదేశ్‌ గ్రామాలలో 39 లక్షల మందికి లబ్ది
మార్చి, 2022 నాటికి 78 లక్షల గృహాలకు కుళాయి నీటి కనెక్షన్‌లను అందించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ యోచన

రూ. 2021-22 ప్రణాళిక లో జల్ జీవన్ మిషన్ కింద ఉత్తరప్రదేశ్‌కు కేంద్రం10,870 కోట్ల కేటాయింపు

Posted On: 12 NOV 2021 1:40PM by PIB Hyderabad

గ్రామీణ ప్రాంతాల్లో నీటి కుళాయి కనెక్షన్‌లను అందించడానికి రాష్ట్రం సమర్పించిన రూ. 1,882 కోట్ల విలువైన ప్రతిపాదనలను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర స్థాయి స్కీమ్ సాంక్షనింగ్ కమిటీ (SLSSC)  11 నవంబర్, 2021న ఆమోదించింది. ఈ పథకాలు 33 జిల్లాల్లోని 39 లక్షల జనాభా ఉన్న 1,262 గ్రామాల్లో అమలౌతాయి.   735 పథకాలకు కమిటీ సమావేశంలో ఆమోదం తెలిపింది. ఆమోదం ప్రకారం, రాష్ట్రంలోని 4.03 లక్షల గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు అందిస్తారు.

ఇప్పటి వరకు, 2.64 కోట్ల గ్రామీణ కుటుంబాలలో 34 లక్షల కుటుంబాలు   (12.9%) తమ ఇళ్లలో కుళాయి నీటి సరఫరాను పొందుతున్నాయి. 2021-22లో  మరో 78 లక్షల కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.

జల్ జీవన్ మిషన్ (JJM) కింద, గ్రామీణ గృహాలకు కుళాయి నీటి సరఫరాను అందించడానికి చేపట్టాల్సిన పథకాల పరిశీలన, ఆమోదం కోసం స్టేట్ లెవెల్  స్కీమ్ శాంక్షనింగ్ కమిటీ (SLSSC) ఏర్పాటుకు నిబంధన ఉంది.  అలా ఏర్పాటైన SLSSC  నీటి సరఫరా పథకాలు/ప్రాజెక్టులను పరిశీలించేందుకు రాష్ట్ర స్థాయి కమిటీగా వ్యవహరిస్తుంది.  జాతీయ జల్ జీవన్ మిషన్ (NJJM) లో  భారత ప్రభుత్వ పతినిధి ఒకరు   కమిటీసభ్యునిగా ఉంటారు.

 ‘ప్రతి ఇంటికి స్వచ్ఛమైన కుళాయి నీటిని అందించాలని,  మహిళలు  బాలికలు  దూర ప్రాంతాలనుండి  నీరు మోసుకు తెచ్చుకునే కష్టాల నుండి విముక్తి కల్పించాల’న్న    ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచన  అమలు పరచడానికి జాతీయ జల్ జీవన్ మిషన్, జల్ శక్తి మంత్రిత్వ శాఖ 2021-22లో ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌కు రూ. 2,400 కోట్ల సహాయనిధిని ఏర్పాటు చేసింది.
2019-20లో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ అమలు కోసం ఉత్తరప్రదేశ్‌కు కేటాయించిన  రూ. 1,206 కోట్ల ఆర్థిక సహాయాన్ని  2020-21లో  రూ.  2,571 కోట్లకు  పెంచింది. కేంద్ర జలశక్తి మంత్రి, శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ 2021-22లో ఈ కేటాయింపులను నాలుగు రెట్లు పెంచడానికి ఆమోదిస్తూ, 2024 నాటికి ప్రతి గ్రామీణ ఇంటికీ కుళాయి నీటి సరఫరాను అందించడానికి రాష్ట్రానికి పూర్తి సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు.


ఉత్తరప్రదేశ్‌లో 97 వేలకు పైగా గ్రామాల్లో 2.64 కోట్ల గ్రామీణ కుటుంబాలు ఉన్నాయి. వాటిలో ఇప్పుడు 34 లక్షల (12.87%) కుటుంబాలకు వారి ఇళ్లకే కుళాయి నీటి సరఫరా అమలౌతుంది. జల్ జీవన్ మిషన్ ప్రారంభించిన సమయంలో, 5.16 లక్షల (2%) కుటుంబాలకు మాత్రమే కుళాయి నీటి సరఫరా ఉంది. గత 26 నెలల్లో, కోవిడ్-19 మహమ్మారి మరియు లాక్‌డౌన్‌ల సమయంలో అంతరాయాలు ఎదురైనప్పటికీ, రాష్ట్రం మరో 28.85 లక్షల (10.92%) కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్‌ను అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 జిల్లాలను ‘హర్ ఘర్ జల్’గా మార్చాలన్నది  ప్రభుత్వ లక్ష్యం.
జల్ జీవన్ మిషన్  అమలు వేగవంతం చేయడానికి, ఈ సంవత్సరం రాష్ట్రంలోని 78 లక్షల గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి సరఫరాను అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జాతీయ జల్ జీవన్ మిషన్  ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని  కోరింది, దీని కోసం  డిసెంబరు 2021 నాటికి 60 వేల కంటే ఎక్కువ గ్రామాల్లో నీటి సరఫరా పనులను ప్రారంభించాలన్నదే ప్రభుత్వ  ప్రణాళిక.
2021-22లో రాష్ట్రం వాటా, మునుపటి సంవత్సరాల రాష్ట్ర వాటాలో కొరత, ఈ ఏడాది కేంద్రం కేటాయించిన రూ. 10,870 కోట్లు    ప్రారంభ నిలువగా  ఉన్న రూ.  466 కోట్లు  కలిపి ఉత్తరప్రదేశ్‌లో జల్ జీవన్ మిషన్  అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న మొత్తం హామీ నిధి రూ. 23,500 కోట్లు. ఇలా  పథకం అమలుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిధుల కొరత లేకుండా భారత ప్రభుత్వం భరోసా కల్పించింది..

ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం ఉత్తరప్రదేశ్‌ లోని  గ్రామీణ స్థానిక సంస్థలు/పంచాయతీ రాజ సంస్థలకు  నీరు, పారిశుధ్యం కోసం 4,324 కోట్లు సహాయం కేటాయించింది 2025-26 వరకూ అంటే  వచ్చే ఐదేళ్లలో ప్రణాళిక అమలుకు మొత్తంగా  రూ. 22,808 కోట్ల ఆర్థిక సహాయం  సిద్ధంగా ఉంది.
ఈ భారీ పెట్టుబడి ఉత్తరప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో  ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తుంది.  గ్రామీణ ఆర్థిక వ్యవస్థను  బలోపేతం చేస్తుంది. ఇది గ్రామాల్లో ఆదాయాన్ని పెంచే అవకాశాలను సృష్టిస్తుంది.
ప్రధాన మంత్రి ఫిబ్రవరి 2019లో బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని ఏడూ జిల్లాలైన  ఝాన్సీ, మహోబా, లలిత్‌పూర్, జలౌన్, హమీర్‌పూర్, బందా , చిత్రకూట్  గ్రామీణ ప్రాంతాలకు;  నవంబర్ 2020లో, వింధ్యాచల్ ప్రాంతంలోని మీర్జాపూర్ , సోన్‌భద్ర జిల్లాలకు గ్రామీణ తాగునీటి సరఫరా ప్రాజెక్టుల కోసం పైపుల ద్వారా నీటి సరఫరా పథకాలకు శంకుస్థాపన చేశారు. ఇవి నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలు. ఈ ప్రాజెక్టుల వల్ల ఈ ప్రాంతంలోని 6,742 గ్రామాల్లోని 18.88 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. ఇప్పటివరకు, ఈ పథకాలలో   దాదాపు 50% పురోగతి ఉంది.

భాగస్వామ్యాన్ని నిర్మించడం, జీవితాలను మార్చడం' అనే మిషన్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, దీర్ఘకాలిక ప్రాతిపదికన  సురక్షిత తాగునీటి అరఫరా నిరంతర అమలు కోసం  వివిధ  సంస్థలు రాష్ట్రంలోని స్థానిక సంఘంతో కలిసి పనిచేయడం ప్రారంభించాయి.
UNOPS   ఐక్యరాజ సమితి అనుబంధ సంస్థ ఐన UNOPS (United Nations Office for Project Services) ఇప్పటికే ఈ పనిలో నిమగ్నమై ఉంది.  ప్రస్తుతం  బుందేల్‌ఖండ్, వింధ్యాచల్, ప్రయాగ్‌రాజ్, కౌశాంబి లలోని  140 గ్రామాలలో చురుకుగా పని చేస్తోంది. లక్నో, సీతాపూర్‌లోని 40 గ్రామాల్లో ఆగాఖాన్ ఫౌండేషన్ పనిచేస్తోంది.  టాటా ట్రస్ట్ బలరామ్‌పూర్, బహ్రైచ్ మరియు శ్రావస్తి అనే  3 జిల్లాల్లో  200 గ్రామాలలో తన కార్యక్రమాలను విస్తరిస్తుంది. ఈ రకమైన భాగస్వామ్యంతో జల్ జీవన్ మిషన్ 'ప్రజల ఉద్యమం' గా మారుతోంది.

జాతీయ జల జీవన్ మిషన్  బృందం కార్యక్రమం విజయానికి  సమాజ  సహకారం అవసరాన్ని  గుర్తించింది. ఇది లక్ష్య సాకారానికి  తప్పనిసరి అంశం.  నీటి సరఫరా పథకాలలో  ఏకీకరణ ద్వారా వాడిన నీటి పునర్వినియోగానికై ఉద్దేశించిన    “గ్రేవాటర్ మేనేజ్‌మెంట్‌” ను చేర్చడం చాలా ముఖ్యమైన అంశమని జల్ జీవన్ మిషన్‌ సూచించింది. ఫీల్డ్ టెస్ట్ కిట్‌లను (FTK ) ఉపయోగించి తాగునీటి వనరుల సరఫరా కేంద్రాలైన  డెలివరీ పాయింట్‌లను ఎప్పటికప్పుడు  స్వతంత్రంగా పరీక్షించడం కోసం ప్రతి గ్రామంలో 5 మంది మహిళలకు శిక్షణ ఇవ్వడం ద్వారా నీటి నాణ్యత పర్యవేక్షణ నిఘా కార్యకలాపాలకు అధిక  ప్రాధాన్యత ఇస్తున్నారు. నీటి పరీక్షా ప్రయోగశాలలను అభివృద్ధి చేసి   సాధారణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. వీటి సహాయం తో ప్రజలు తమ నీటి నమూనాలను నామమాత్రపు రేటుతో పరీక్షించుకోవచ్చు.
ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాల  భాగస్వామ్యంతో జల్ జీవన్ మిషన్ నిర్వహిస్తున్న గ్రాండ్ టెక్నాలజీ ఛాలెంజ్‌లో భాగంగా మరింత మెరుగ్గా సేవల్ని అందించాలనే లక్ష్యం తో  'సరఫరా సమయంలో   కొలతలు, పర్యవేక్షణ వ్యవస్థ' కోసం బాగ్‌పత్ జిల్లాలోని 10 గ్రామాలను  దత్తత తీసుకోనున్నారు.

గ్రామంలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడల్లా సకాలంలో దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి అనుకూలంగా ‘ఆన్‌లైన్ సిస్టమ్’ హెచ్చరికలను రూపొందిస్తుంది.
జల్ జీవన్ మిషన్ కింద, రాష్ట్రంలోని ఇప్పటి వరకూ నాణ్యమైన నీటి వాడుకకు  నోచుకొని   నివాసప్రాంతాలు, నీటి నాణ్యత లేక  నరాల రుగ్మతలు ప్రబలుతున్న ప్రాంతాలు , Japanese Encephalitis-Acute Encephalitis Syndrome (JE-AES) ప్రభావిత జిల్లాలు, SC/ST మెజారిటీ గ్రామాలు,  సాంసద్ ఆదర్శ గ్రామ యోజన (SAGY) కింద ఉన్న  గ్రామాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ‘సబ్‌కాసాత్, సబ్‌కా వికాస్ మరియు సబ్‌కా విశ్వాస్’కు అనుగుణంగా పనిచేస్తూ, జల్ జీవన్ మిషన్ అత్యంత బీద  అట్టడుగున ఉన్న ప్రజలకు త్రాగునీటి కుళాయి సరఫరాకు అందరికి అందుబాటులో ఉంచడం లక్ష్యంగా చేసుకుంది.

 

******



(Release ID: 1771254) Visitor Counter : 143


Read this release in: English , Urdu , Hindi