వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
గ్లోబల్ సప్లై చైన్‌లు కేవలం ఖర్చుపైనే కాకుండా నమ్మకంపై కూడా ఆధారపడి ఉండాలి - శ్రీ పీయూష్ గోయల్
వాణిజ్యం పరస్పర ప్రయోజనకరమైన మరియు సహకార మార్గంలో వృద్ధి చెందాలి- శ్రీ గోయల్
పారదర్శకమైన, విశ్వసనీయమైన మరియు స్థితిస్థాపకమైన సప్లై చైన్లను నెలకొల్పడం వాణిజ్య పునరుద్ధరణలో ప్రధానమైనది- శ్రీ గోయల్
భారతదేశం తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది మరియు మహమ్మారి సమయంలో ప్రపంచ దేశాలకు స్థితిస్థాపకంగా మరియు విశ్వసనీయ భాగస్వామిగా అవతరించింది
బ్యాంక్ ఆఫ్ అమెరికాకు చెందిన ఫ్లాగ్‌షిప్ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో “ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసుల మార్పు: మేక్ ఇన్ ఇండియా విజయవంతం కాగలదా?” అనే అంశంపై శ్రీ గోయల్ ముఖ్య ప్రసంగం చేశారు.
Posted On:
12 NOV 2021 4:45PM by PIB Hyderabad
వాణిజ్యం మరియు పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఈ రోజు మాట్లాడుతూ " సరఫరా గొలుసులు ఖర్చుపై మాత్రమే కాకుండా నమ్మకంపై కూడా ఆధారపడాలని కోవిడ్-19 నేర్పింది. పారదర్శకమైన, విశ్వసనీయమైన మరియు స్థితిస్థాపకమైన సరఫరా గొలుసులను నిర్ధారించడం వాణిజ్య పునరుద్ధరణలో ప్రధానమని ఆయన అభిప్రాయపడ్డారు మరియు కొవిడ్-19 సమయంలో భారతదేశం స్థితిస్థాపకత యొక్క మూలంగా మరియు విశ్వసనీయ భాగస్వామిగా ఉద్భవించిందని ఆయన తెలిపారు.
ఆయన ఈరోజు న్యూఢిల్లీ నుండి బ్యాంక్ ఆఫ్ అమెరికా ఫ్లాగ్‌షిప్ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో “ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసుల మార్పు: భారత్‌లో విజయం సాధించగలదా?” అనే అంశంపై కీలక ప్రసంగం చేశారు.
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో సరఫరా మరియు డిమాండ్ అంతరాయం కారణంగా తయారీదారులు ప్రతిచోటా తమ సరఫరా గొలుసులను తిరిగి అంచనా వేయవలసి వచ్చిందని మంత్రి చెప్పారు. మా అంతర్జాతీయ సేవా కట్టుబాట్లన్నీ తీర్చడమే కాకుండా కీలకమైన వైద్య సామాగ్రి (పిపిఈలు, టెస్టింగ్, మాస్క్‌లు) ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం ద్వారా భారతదేశం మొత్తం ప్రపంచానికి తన సామర్థ్యాన్ని మరియు సమర్ధతను ప్రదర్శించిందని ఆయన అన్నారు.
భారతదేశ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ గురించి ప్రస్తావిస్తూ ప్రపంచంలోని చాలా దేశాలకు మందులు మరియు వ్యాక్సిన్‌లను అందించడానికి మేము "ప్రపంచ ఫార్మసీ"గా విస్తృతంగా గుర్తించబడ్డామని శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను అమలు చేయడంలో భారతదేశం సాధించిన విజయం గురించి మంత్రి మాట్లాడుతూ, వచ్చే ఏడాది 5 బిలియన్ డోస్‌ల వ్యాక్సిన్‌ను తయారు చేయాలనే ప్రణాళికతో భారతదేశం మొత్తం మానవాళికి సేవ చేయడానికి మరియు సురక్షితంగా ఉంచడానికి ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
పెరుగుతున్న ఆర్థిక సూచికలపై శ్రీ గోయల్ మాట్లాడుతూ భారతదేశం తిరిగి యాక్షన్‌లోకి దిగిందని మరియు ఈ దశాబ్దం వృద్ధి దశాబ్దంగా రూపుదిద్దుకుంటుందని, మన ఎగుమతులు పెరగడం మరియు ఎఫ్‌డిఐ ఇన్‌ఫ్లోలు మరియు పెట్టుబడులు అధిక వృద్ధి పథాన్ని అనుసరిస్తాయని అన్నారు. పరస్పరం లాభదాయకంగా పరస్పర సహకారంతో వాణిజ్యం పెరగాలని ఆయన అన్నారు.
ఏప్రిల్-అక్టోబర్ 2021లో ఎగుమతులు $232 బిలియన్లు (ఏప్రిల్-అక్టోబర్ 20 కంటే +54% మరియు ఏప్రిల్-అక్టోబర్ 19 కంటే +25%) మరియు 21-22 ఆర్దిక సంవత్సరం మొదటి 4 నెలల్లో మొత్తం ఎఫ్‌ఐడీలు 20-21 ఆర్ధిక సంవత్సరంలోని అదే కాలం కంటే 62% ఎక్కువ. భారతదేశంలో ఇప్పుడు 71 యునికార్న్‌లు ఉన్నాయి. వాటిలో 2015 నుండి 67 కొత్తగా జోడించబడ్డాయి.
అక్టోబర్ 2021కి ఉద్యోగ సూచి 43%గా ఉందని శ్రీ గోయల్ చెప్పారు.
గత ఏడాది ఇదే నెలలో ఉపాధిలో వృద్ధి మరియు తయారీ పిఎంఐ అక్టోబర్‌లో 55.9కి పెరిగింది మరియు సేవల పిఎంఐ అక్టోబర్‌లో 58.4 దశాబ్దపు గరిష్ట స్థాయికి చేరుకుంది. భారతదేశం తన పెట్టుబడిదారుల స్నేహపూర్వక విధానాలు, అనవసరమైన చట్టాలను తొలగించడం మరియు సింగిల్ విండో ద్వారా అనుమతులతో ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పొందిందని ఆయన అభిప్రాయపడ్డారు.
సరఫరా వ్యవస్థ ప్రత్యామ్నాయంగా భారతదేశ బలాన్ని నొక్కిచెప్పిన మంత్రి..భారతదేశం విభిన్న వ్యాపార దృశ్యం, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి మరియు సాపేక్షంగా తక్కువ శ్రమతో కూడుకున్నదని చెప్పారు. భారతదేశం యొక్క ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ ప్రాజెక్ట్ గురించి ఆయన మాట్లాడారు మరియు కొత్త పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ భారతదేశ మౌలిక సదుపాయాల ప్రణాళికకు కొత్త జీవాన్ని ఇస్తుందని మరియు లాజిస్టిక్స్ ఖర్చును 5%కి తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపారు.
గ్లోబల్ సెంటిమెంట్లు ‘వై ఇండియా’ నుంచి ‘వై నాట్ ఇండియా’గా మారుతున్నాయని ఇప్పుడు ‘మేక్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్’గా మారి భారత్ నుంచి ప్రపంచానికి సేవలందిస్తున్నాయని ఆయన నొక్కి చెప్పారు. ఇప్పుడు "భారత సమయం వచ్చింది" అన్నారాయన. ప్రపంచాన్ని ‘కమ్ టు ఇండియా, ఇన్వెస్ట్ ఇన్ ఇండియా అండ్ మేక్ ఇన్ ఇండియా, ఫర్ ది వరల్డ్ ఫర్ ది వరల్డ్’ తెలిపారు. అలాగే సప్లై చైన్‌ల పెద్ద వ్యవస్థలో భాగం కావాలని ఆయన ప్రపంచాన్ని ఆహ్వానించారు.
******
(Release ID: 1771250)
Visitor Counter : 226