భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
భారత్‌లో 19 నవంబర్, 2021న కనిపించనున్న పాక్షిక చంద్ర గ్రహణం
Posted On:
11 NOV 2021 5:04PM by PIB Hyderabad
నవంబర్ 19, 2021 (28 కార్తీక, శక శకం 1943)న పాక్షిక చంద్రగ్రహణం సంభవించనుంది. చంద్రోదయం అయిన వెంటనే భారతదేశంలోని అరుణాచల్, అస్సాం లోని అత్యంత ఈశాన్య ప్రాంతాల నుంచి స్వల్పకాలం పాటు చంద్రగ్రహణం పాక్షిక దశ ముగింపు కనిపించనుంది.
ఐఎండి వర్గాల ప్రకారం, పశ్చిమ ఆఫ్రికా, పశ్చిమ ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా, అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రాలలో గ్రహణం కనిపిస్తుంది.
గ్రహణం పాక్షిక దశ ఐఎస్‌టి 12 గంటల 48 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఈ పాక్షిక దశ సాయంత్రం ఐఎస్‌టి 16 గంటల 17 నిమిషాలకు ముగుస్తుంది.
తర్వాతి చంద్రగ్రహణం 8 నవంబర్ 2022న సంభవించనుంది. భారత్ లో కనిపించనున్న ఈ చంద్రగ్రహణం సంపూర్ణంగా ఉంటుంది.
సూర్యుడు, చంద్రుడి మధ్యకు భూమి వచ్చి, మూడు గ్రహాలు సమలేఖనం అయినప్పుడు, పౌర్ణమి రోజున చంద్రగ్రహణం సంభవిస్తుంది.
భూమి నీడ చంద్రుడు మీద మొత్తంగా పడినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. కాగా, భూమి నీడ కొద్ది భాగం మాత్రమే చంద్రుడి మీద పడినప్పుడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
***
(Release ID: 1771071)
Visitor Counter : 204