గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
నవంబర్ 15వ తేదీని ‘జనజాతీయ గౌరవ దివస్’ గా ప్రకటించడాని కి ఆమోదం తెలిపినమంత్రిమండలి
ఆ రోజున భగవాన్ బిర్ సా ముండా జయంతి ఉంది
ఆదివాసీప్రజల వైభవోపేతమైనటువంటి చరిత్ర ను, సంస్కృతి ని, కార్యసాధనలను వేడుక గా జరుపుకోవడానికి మరియు సంస్మరించుకోవడాని కి 2021 నవంబరు 15 నుంచి 22వ తేదీవరకు వారం రోజుల పాటు ఉత్సవాలు జరుగనున్నాయి
Posted On:
10 NOV 2021 3:42PM by PIB Hyderabad
నవంబర్ 15వ తేదీ ని ‘జనజాతీయ గౌరవ దివస్’ గా ప్రకటించడాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. శూరులైన ఆదివాసీ స్వాతంత్య్ర యోధుల స్మృతి కి ఈ దినాన్ని అంకితం చేయడం జరుగుతుంది. దీని వల్ల రాబోయే తరాల వారు దేశం కోసం ఆదివాసీ స్వాతంత్య్ర యోధులు చేసినటువంటి త్యాగాల ను గురించి తెలుసుకో గలుగుతారు. సంథాల్ లు, తామార్ లు, కోల్ లు, భీల్ లు, ఖాసీ లు, ఇంకా మిజో ల వంటి అనేక ఆదివాసీ సముదాయాలు పలు ఆందోళనల ను నిర్వహించడం ద్వారా భారతదేశం స్వాతంత్య్ర సమరాన్ని బలోపేతం చేశాయి. ఆదివాసీ సముదాయాలు నిర్వహించినటువంటి క్రాంతికారి ఉద్యమాల తో పాటు వారి ఆధ్వర్యం లో సాగిన సంఘర్షణ లు వారి యొక్క ఎనలేని ధైర్య సాహసాల ను, వారి యొక్క సర్వోన్నత త్యాగాన్ని చాటిచెప్పాయి. బ్రిటిషు వలస పాలన కు వ్యతిరేకం గా దేశం లోని వేరు వేరు ప్రాంతాల లో తల ఎత్తిన ఆదివాసీ ఉద్యమాలు జాతీయ స్వాతంత్య్ర పోరాటం తో జత పడి, మరి దేశవ్యాప్తం గా భారతీయుల కు ప్రేరణ గా నిలచాయి. ఏమైనా, ఈ ఆదివాసీ వీరుల ను గురించి దేశం లో చాలా మంది కి అంత పెద్ద గా ఏమీ తెలియదు. 2016 వ సంవత్సరం లో స్వాతంత్య్ర దినం నాడు గౌరవనీయ ప్రధాన మంత్రి ప్రసంగం దరిమిలా, భారత ప్రభుత్వం దేశవ్యాప్తం గా 10 గిరిజన స్వాతంత్య్ర సమర యోధుల వస్తు ప్రదర్శన శాలల ను మంజూరు చేసింది.
ఈ రోజు న దేశవ్యాప్తం గా ఆదివాసీ సముదాయాల చేత భగవాన్ గా ఆరాధనల ను అందుకొనే శ్రీ బిర్ సా ముండా జయంతి. బిర్ సా ముండా గారు బ్రిటిషు వలసవాద హయాం లోని దోపిడిదారు వ్యవస్థ కు వ్యతిరేకం గా ఎదురొడ్డి నిలచి ధైర్యం గా పోరాడడమే కాకుండా ‘ఉల్ గులాన్’ (విప్లవం) కోసం పిలుపు ను ఇచ్చి బ్రిటిషు అణచివేత కు వ్యతిరేకం గా ఒక ఉద్యమాన్ని అగ్రభాగాన తాను ఉండి ముందుకు నడిపారు కూడాను. తాజా ప్రకటన ఆదివాసీ సముదాయాల వైభవోపేత చరిత్ర ను, వారి సంస్కృతి సంబంధి వారసత్వాన్ని అంగీకరిస్తున్నది. ఈ దినాన్ని ప్రతి సంవత్సరం లోనూ ఓ వేడుక గా నిర్వహించడం జరుగుతుంది. దీనితో పాటు భారతీయ పరాక్రమం, ఆతిథ్యం, ఇంకా దేశ గౌరవం అనే విలువల ను ప్రోత్సహించడానికి, సంస్కృతి పరమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి గిరిజనులు చేసిన ప్రయాసల ను ఈ రోజు న గుర్తు కు తెచ్చుకోవడం జరుగుతుంది. బిర్ సా ముండా గారు తుది శ్వాస వదలిన రాంచి లోని ఆదివాసీ స్వాతంత్య్ర యోధుల వస్తు ప్రదర్శన శాల ను గౌరవనీయ ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు.
ఆదివాసీ ప్రజల కీర్తిభరిత చరిత్ర, సంస్కృతి మరియు కార్యసిద్ధుల కు 75 సంవత్సరాలు కావడాన్ని సంస్మరించుకోవడానికి వారం రోజుల పాటు - 2021 నవంబర్ 15 మొదలుకొని 22వ తేదీ వరకు- ఉత్సవాల ను నిర్వహించాలని భారత ప్రభుత్వం ప్రణాళిక ను సిద్ధం చేసింది.
ఈ ఉత్సవం లో భాగం గా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల తో కలసి అనేక కార్యక్రమాల ను జరపాలని తలపెట్టడమైంది; ప్రతి ఒక్క కార్యక్రమానికి వెనుక భారతదేశం యొక్క స్వాతంత్య్ర సమరం లో ఆదివాసీ ల కార్యసాధనల ను కళ్ళ కట్టే కార్యక్రమాలు, విద్య, ఆరోగ్యం, బతుకు తెరువు, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాల అభివృద్ధి రంగాల లో భారత ప్రభుత్వం అమలు చేసిన వివిధ సంక్షేమ కార్యక్రమాల ను గురించి ప్రచారం చేయడం కీలక ఇతివృత్తం గా ఉంటుంది. ఆదివాసీ ల విశిష్టమైనటువంటి సంస్కృతి సంబంధి వారసత్వాన్ని, స్వాతంత్య్ర పోరాటం లో, అభ్యాసాల లో, హక్కుల లో, సంప్రదాయాల లో, ఆహార పానీయాదుల లో, ఆరోగ్యం లో, విద్య లో మరియు జీవనోపాధి లో ఆదివాసీ లు అందించిన తోడ్పాటుల ను కూడా ఈ కార్యక్రమాలు వివరిస్తాయి.
***
(Release ID: 1770689)
Visitor Counter : 143
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam