భారత ఎన్నికల సంఘం
8 స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి ఆఁధ్రప్రదేశ్ శాసన మండలికి 11 మంది సభ్యుల ఎన్నికకు ద్వైవార్షిక ఎన్నికలు
Posted On:
09 NOV 2021 1:32PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్ లో 8 స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి శాసన మండలికి ఎన్నిక అయిన 11 మంది సభ్యుల పదవీ కాలం కింద తెలిపిన విధంగా పూర్తి అయ్యింది.
-
S. No.
|
స్థానిక సంస్థల నియోజకవర్గాల పేరు
|
సీట్ల సంఖ్య(ల)
|
సభ్యుని పేరు
|
పదవీ విరమణ తేదీ
|
-
|
అనంతపురం స్థానిక సంస్థలు
|
01
|
పయ్యావుల కేశవ్
(అవసరమైన ఓటర్ల జాబితా అందుబాటులో లేనందున 04.06.2019 నుంచి ఖాళీగా ఉంది)
|
11.08.2021
|
-
|
కృష్ణా స్థానిక సంస్థలు
|
01
|
వెంకటేశ్వరరావు బుద్ధా
|
11.08.2021
|
01
|
యలమంచిలి వెంకట బాబు
రాజేంద్ర ప్రసాద్
|
11.08.2021
|
-
|
తూర్పుగోదావరి స్థానిక సంస్థలు
|
01
|
రెడ్డి సుబ్రహ్మణ్యం
|
11.08.2021
|
-
|
గుంటూరు స్థానిక సంస్థలు
|
02
|
అన్నం సతీష్ ప్రభాకర్
(అవసరమైన ఓటర్ల జాబితా అందుబాటులో లేనందున 04.06.2019 నుంచి ఖాళీగా ఉంది)
|
11.08.2021
|
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
|
-
|
విజయనగరం స్థానిక సంస్థలు
|
01
|
ద్వారపురెడ్డి జగదీశ్వరరావు
|
11.08.2021
|
-
|
విశాఖపట్నం స్థానిక సంస్థలు
|
01
|
బుద్దా నాగ జగదీశ్వరరావు
|
11.08.2021
|
01
|
చలపతి రావు పప్పల
|
11.08.2021
|
-
|
చిత్తూరు స్థానిక సంస్థలు
|
01
|
గాలి సరస్వతి
|
11.08.2021
|
-
|
ప్రకాశం స్థానిక సంస్థలు
|
01
|
మాగుంట శ్రీనివాసులు రెడ్డి ( అవసరమైన ఓటర్ల జాబితా అందుబాటులో లేకపోవడంతో 04.06.2019 నుంచి ఖాళీగా ఉంది)
|
11.08.2021
|
2. రాజ్యాంగ స్థానిక సంస్థలు/ఓటర్ల జాబితా మనుగడలో లేకపోవడంతో 11 స్థానాలను భర్తీ చేయడానికి ద్వైవార్షిక ఎన్నికలను 11.08.2021 నాటికి నిర్వహించడం సాధ్యం కాలేదు. సంబంధిత నియోజక వర్గాలలో మనుగడలో ఉండి పనిచేస్తున్న స్థానిక సంస్థల వివరాలు, నియోజకవర్గాలలో వాటి శాతం వివరాలను తెలియజేయాలని కోరుతూ 07.06.2021 న కమిషన్ ఒక లేఖ రాయడం జరిగింది. దీనికి స్పందించి ఆంధ్రప్రదేశ్ సీఈఓ 23.06.2021 న పై ఎనిమిది స్థానిక సంస్థల నియోజకవర్గాల వివరాలను అందించింది. పై (8) స్థానిక సంస్థల నియోజకవర్గాలలో, పనిచేస్తున్న స్థానిక సంస్థల శాతం 6.98 మరియు 16 మధ్య ఉందని తెలిపింది. ఈ స్థానాల్లో ఉన్న ఓటర్ల శాతం 17.75నుంచి 27.50 మధ్య ఉందని తెలియజేసింది. ఈ 8 నియోజకవర్గాలలో ఉన్న అనేక స్థానిక సంస్థల ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయని లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం వీటిని నిర్వహించలేదని పేర్కొనడం జరిగింది.
3. ఆంధ్ర ప్రదేశ్ సీఈఓ నుంచి 01.10.2021 నాటి లేఖ ద్వారా అందిన సమాచారం ప్రకారం పైన పేర్కొన్న 08 స్థానిక సంస్థల నియోజకవర్గాలలో రాజ్యాంగ బద్దంగా స్థానిక సంస్థలు శాతం మరియు ఓటర్ల శాతం 75 శాతం పైన ఉంది.
4. స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎన్నికలను నిర్వహించడానికి సంబంధిత నియోజకవర్గంలో ఉన్న స్థానికి సంస్థలలో కనీసం 75% సంస్థలు పనిచేస్తూ ఉండాలని మరియు ఆ నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లలో కనీసం 75% ఓటర్లు అందుబాటులో ఉండాలని ఎన్నికల సంఘం తన మార్గదర్శకాలలో పేర్కొనడం జరిగింది. ఈ మార్గదర్శకాలు అమలు జరిగినప్పుడు ఆయా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి శాసనమండలికి ప్రతినిధులను ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికల సంఘం విడుదల చేసిన ఈ మార్గదర్శకాలు భారత ఎన్నికల సంఘం Vs శివాజీ అండ్ ఇతరులు (AIR 1988 SC 61) కేసులో భారత సుప్రీంకోర్టు ఆమోదం పొందాయి .
5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితిని తిరిగి అంచనా వేసిన కమిషన్ సంబంధిత అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, పైన పేర్కొన్న 08 స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ద్వైవార్షిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. కింద పేర్కొన్న విధంగా ఈ ఎన్నికలను నిర్వహించడం జరుగుతుంది.
క్ర .సంఖ్య
|
కార్యక్రమం
|
తేదీలు మరియు రోజులు
|
-
|
నోటిఫికేషన్ల జారీ
|
2021 నవంబర్ 16 (మంగళవారం)
|
-
|
నామినేషన్లు వేయడానికి చివరి తేదీ
|
2021 నవంబర్ 23 (మంగళవారం)
|
-
|
నామినేషన్ల పరిశీలన
|
20212021 నవంబర్ 24 (బుధవారం)
|
-
|
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
|
2021 2021 నవంబర్ 26 (శుక్రవారం)
|
-
|
పోల్ తేదీ
|
2021 డిసెంబర్ 10 (శుక్రవారం)
|
-
|
పోలింగ్ గంటలు
|
ఉదయం 08:00 నుంచి సాయంత్రం 04:00 వరకు
|
-
|
ఓట్ల లెక్కింపు
|
2021 డిసెంబర్ 14 (మంగళవారం)
|
-
|
ఎన్నికలు ముగియ వలసిన తేదీ
|
2021 డిసెంబర్ 16 (గురువారం)
|
6.కోవిడ్-19 కి సంబంధించి ఇప్పటికే ఈసీఐ జారీ చేసిన మార్గదర్శకాలతో పాటు 28.09.2021 తేదీ నాటి ప్రెస్ నోట్‌లోని 06వ పేరాలో ఉన్న విధంగా ఇటీవలి మార్గదర్శకాలను ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు అవసరమైన చోట తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది.ఈ మార్గదర్శకాలు link https://eci.gov.in/candidate-political-parties/instructions-on-covid-19/ లింక్‌లో అందుబాటులో ఉన్నాయి
7. ఈ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి సంబంధిత నియోజకవర్గంలో తక్షణమే అమల్లోకి వస్తుంది. పూర్తి వివరాలు er https://eci.gov.in/files/file/4070-biennial-bye-elections-to-the-legislative-councils-from-council-constituencies-by-graduates%E2%80%99-and teachers%E2%80%99-and-local-authorities%E2%80%99-constituencies-%E2%80%93-mcc-instructions-%E2%80%93-regarding/ లో అందుబాటులో ఉంటాయి.
8. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నప్పుడు కోవిడ్-19 నియంత్రణ చర్యలు పూర్తిగా అమలు జరిగేలా చూడడానికి రాష్ట్రం నుంచి ఒక సీనియర్ అధికారిని నియమించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శిని ఆదేశించడం జరిగింది.
***
(Release ID: 1770414)
Visitor Counter : 287