రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఆర్మీలో నియామకాల కోసం సికింద్రాబాద్ (తెలంగాణ) ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ లో 2021 నవంబర్ 29న ప్రారంభం కానున్న రిక్రూట్మెంట్ ర్యాలీ

Posted On: 08 NOV 2021 11:17AM by PIB Hyderabad

1. యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా కింద సోల్జర్ టెక్ ( ఏఈ)సోల్జర్ జనరల్ డ్యూటీసోల్జర్ ట్రేడ్స్ మెన్అత్యుత్తమ క్రీడాకారులు (ఓపెన్ కేటగిరీ), సోల్జర్ సీఎల్కే/ఎస్కెటీ ( ఏవోసి వార్డు మాత్రమే) తరగతుల్లో నియామకాలు చేపట్టడానికి సికింద్రాబాద్ ఏవోసీ సెంటర్ లోని ఏబీసీ ట్రాక్ లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనున్నది. 

2. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు (ఓపెన్ కేటగిరి) క్రీడల ఎంపిక కోసం 2021 నవంబర్ 26న సికింద్రాబాద్ ఏవోసీ సెంటర్ లో తాపూర్ స్టేడియంకు ఉదయం 8 గంటలకు రావలసి ఉంటుంది. 

ఎ. బాక్సింగ్ఫుట్‌బాల్వాలీబాల్బాస్కెట్‌బాల్హ్యాండ్‌బాల్హాకీస్విమ్మింగ్రెజ్లింగ్అథ్లెటిక్స్కబడ్డీ మరియు క్రికెట్‌లో  దేనిలోనైనా ప్రాతినిధ్యం వహించిన అత్యుత్తమ క్రీడాకారులు తమ సర్టిఫికేట్‌తో పాటు పాల్గొనవచ్చు.

బి. సీనియర్ లేదా జూనియర్ స్థాయిలో జాతీయ లేదా అంతర్జాతీయ పోటీల్లో రాష్ట్రం లేదా దేశానికి ప్రాతినిధ్యం వహించారు.

గమనిక: స్క్రీనింగ్ తేదీ నాటికి సర్టిఫికేట్ రెండు సంవత్సరాల కంటే పాతది కాకూడదు. 

3.         అర్హతలు  .

 

            (ఎ)        వయస్సు . సోల్ జీడీ  - వయోపరిమితి 17.6 నుంచి 21 సంవత్సరాలు.

                                    సోల్ టెక్ (ఏఈ)            

                                    సోల్ సీఎల్కే/ఎస్కెటీ  - వయోపరిమితి 17.6 నుంచి 23 సంవత్సరాలు

                                                             సోల్ టీడీఎన్ 

4.          విద్య .    

           

(ఎ) సోల్ జీడీ   -మెట్రిక్యులేషన్/ ఎసిఎస్సీ ప్రతి సబ్జెక్టులో కనీసం 33%  మొత్తంగా 45%.

            (బి) సోల్ టిడిఎన్ (10 వ తరగతి) -సాధారణ ఉతీర్ణత  (33%)

            (సి) సోల్ టెక్ (ఏఈ)    - సైన్స్‌లో 10+2/ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత (పీసీఎమ్ మరియు  ఇంగ్లీష్) తో మొత్తం 50% మార్కులతో మరియు ప్రతి సబ్జెక్టులో 40%.మార్కులతో 

(డి) సోల్ సీఎల్కే/ఎస్కెటీ - ఏదైనా ఒక అంశంలో ప్రతి సబ్జెక్టులో కనీసం 50% మొత్తం 60% మార్కులతో  10+2/ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత 12 తరగతిలో ఆంగ్లం మరియు గణితం/ఖాతాలు/బుక్ కీపింగ్‌లో 50% పొందడం తప్పనిసరి.

5. . ఇతర వివరాల కోసం అభ్యర్థులు హెడ్‌క్వార్టర్స్ ఏవోసీ సెంటర్తూర్పు మారేడ్‌పల్లితిరుమలగిరి సికింద్రాబాద్ (TS) 500015,  హెడ్‌క్వార్టర్స్  ఏవోసీ  సెంటర్ ఇ-మెయిల్  airawat0804[at]nic[dot]in  www.joinindianarmy[at]nic[dot]in సైట్ ల ద్వారా రిక్రూట్‌మెంట్ ర్యాలీకి సంబంధించి  మరింత సమాచారం కోసం తెలుసుకోవచ్చు.

6. నవంబర్ 2021 నుంచి జనవరి 2022 వరకు నెలకొని ఉండే  కోవిడ్-19  పరిస్థితికి  లోబడి ర్యాలీ నిర్వహణ ఉంటుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా తక్కువ సమయంలో నోటీసు జారీ చేసి ర్యాలీని రద్దు చేసే హక్కు కమాండెంట్ ఏవోసీ సెంటర్‌ కలిగి ఉంటారు.  

***



(Release ID: 1770021) Visitor Counter : 507


Read this release in: English , Urdu , Hindi , Tamil