సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
శనివారం న్యూఢిల్లీలోని జాతీయ మ్యూజియంలోప్రేక్షకులను ఆకట్టుకున్న డెస్టినేషన్ నార్త్ ఈస్ట్ ఇండియా వేడుకలలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు
Posted On:
06 NOV 2021 8:10PM by PIB Hyderabad
డెబ్భై ఐదేళ్ళ ప్రగతిశీల భారతదేశం, ప్రజల సాంస్కృతిక వైభవం, విజయాలను సంస్మరించుకునేందుకు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలలో భాగంగా డిఒఎన్ ఇ ఆర్ & ఎన్ిసి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియం డెస్టినేషన్ నార్త్ ఈస్ట్ ఇండియా పేరిట ఉత్సవాలను నిర్వహిస్తోంది. జాతీయ మ్యూజియంలో ఈ ఉత్సవాలను 1 నవంబర్, 2021న ప్రారంభించారు, ఇవి 7 నవంబర్ 2021 వరకు కొనసాగనున్నాయి.
ఉత్సవాలలో భాగంగా జాతీయ మ్యూజియంలో ఈశాన్య భారతదేశంలోని అస్సాం, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం వంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సాంస్కృతిక ప్రదర్శనలు (నాట్యం, సంగీతం) తొలి రోజు నుంచి 3వ రోజు వరకు (1 నవంబర్ నుంచి 3 నవంబర్ 2021) సాగాయి. వర్ణశోభితంగా సాగిన ఈ ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకొని, వారి మన్ననలు పొందాయి. జాతీయ మ్యూజియం నిర్వహిస్తున్న వేడుకలలో భాగంగా 4, 5 నవంబర్ 2021న పండుగల సందర్బంగా ఆన్‌లైన్ కార్యక్రమాలు సాగాయి.
రెండు రోజుల విరామానంతరం సాంస్కృతిక కార్యక్రమాలు శనివారం (నేడు) తిరిగి ప్రారంభం అయ్యాయి. ఉదయం సెషన్ అగ్రగామి డాన్స్ అండ్ సినీ టీం బృందం గోల్‌పారియా జానపద గీతంతో ప్రారంభమై, పంథియోహిలగోయ్ మారుప్ ప్రదర్శించిన స్టిక్ డాన్స్ (పుంగ్ చోలం)తో ముగిసింది. భోజనానంతర సెషన్ (మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5వరకు) అగ్రగామి డాన్స్ అండ్ సినీ టీం బృందం కళాకారులు బిహు నాట్యాన్ని ప్రదర్శించగా, పంథియోహిలగోయ్ మారుప్ స్టిక్ డాన్స్‌ను ప్రదర్శించింది (ఫోటోలు జతపరచడం జరిగింది.
నవంబర్ 07, 2021న కూడా సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన రెండు సెషన్లలో ఉంటుంది (ప్రోగ్రామ్ షెడ్యూల్‌ను జతపరచడం జరిగింది). జాతీయ మ్యూజియం డైరెక్టర్ పార్థసారథి సేన్ శర్మ, జాతీయ మ్యూజియం అదనపు డైరెక్టర్ జనరల్ సుబ్రతా నాథ్ 7నవంబర్ 2021న (ఆదివారం) జరుగనున్న సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు సాగనుంది. ఈ ఉత్సవాలలో ప్రదర్శించిన కళాకారులకు, సన్మానగ్రహీతలకు మొమెంటోలను, సర్టిఫికెట్లను ప్రదానం చేయడం జరుగుతుంది.
జాతీయ మ్యూజియం సోషల్ మీడియా హాండిళ్ళ ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలను లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. ఆసక్తి గల వారు ఈ దిగువన ఇచ్చిన లింకులను క్లిక్ చేయడం ద్వారా వాటిని చూడవచ్చు.
(https://twitter.com/NMnewdelhi; https://www.facebook.com/Nationalmuseumnewdelhi;
https://www.instagram.com/nmnewdelhi/; https://www.youtube.com/channel/UCNkKt0hp9OL1G0o1XMX1ncw)
***
(Release ID: 1769858)
Visitor Counter : 147