వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

వైట్ గూడ్స్ కోసం పి.ఎల్.ఐ. పథకం కింద ఎంపికైన - 42 కంపెనీలు


ఎయిర్ కండిషనర్ల విడిభాగాల కోసం 26 కంపెనీలు 3,898 కోట్ల రూపాయలు; ఎల్‌.ఈ.డీ. విడిభాగాల తయారీ కోసం 16 కంపెనీలు 716 కోట్ల రూపాయలు - పెట్టుబడి పెట్టనున్నాయి

దాదాపు 4,614 కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపు 44 వేల మందికి - అదనపు ప్రత్యక్ష ఉపాధి

81 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ గా నికర ఉత్పత్తి పెరుగుతుందని - అంచనా

Posted On: 03 NOV 2021 5:09PM by PIB Hyderabad

'ఆత్మ నిర్భర్ భారత్' కోసం తయారీని కేంద్రీకరించి, భారతదేశ వృద్ధి రేటును పెంపొందించి, ఉద్యోగాలను సృష్టించడంలో దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పాలన్న ప్రధానమంత్రి స్పష్టమైన పిలుపును అనుసరించి, 1,97,291 కోట్ల రూపాయల వ్యయంతో, 13 కీలక రంగాల్లో, ఉత్పత్తితో అనుసంధానమైన ప్రోత్సాహక (పి.ఎల్.ఐ) పథకాన్ని ప్రవేశ పెట్టడానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది.  పరిశ్రమలకు ప్రోత్సాహం మరియు అంతర్గత వాణిజ్య విభాగం (డి.పి.ఐ.ఐ.టి) అన్ని పి.ఎల్.ఐ. పథకాల అమలును సమన్వయం చేస్తోంది.  అదేవిధంగా, వైట్ గూడ్స్ - ఎయిర్ కండిషనర్లు, ఎల్.ఈ.డి. లైట్ల రంగం కోసం, 6,238 కోట్ల రూపాయల వ్యయంతో అమలుచేసే పి.ఎల్.ఐ. పథకానికి కూడా డి.పి.ఐ.ఐ.టి. నోడల్ విభాగంగా వ్యవహరిస్తోంది. 

ఎయిర్ కండిషనర్లు, ఎల్.ఈ.డి. లైట్ల విడిభాగాలు, ఉప-అసెంబ్లీల తయారీకి వైట్ గూడ్స్ కోసం పి.ఎల్.ఐ. పథకం కోసం, డి.పి.ఐ.ఐ.టి. ప్రతిపాదనను, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన,  7.04.2021 తేదీన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.  ఈ పథకం, 6,238 కోట్ల రూపాయల వ్యయంతో, 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరం వరకు ఏడు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. డి.పి.ఐ.ఐ.టి. ఈ పథకాన్ని 16.04.2021 తేదీన ప్రకటించింది.  ఈ పథకం మార్గదర్శకాలను 04.06.2021 తేదీన ప్రచురించడం జరిగింది. ఈ పథకం మార్గదర్శకాలకు 16.08.2021 తేదీన కొన్ని సవరణలను జారీ చేయడం జరిగింది.  దరఖాస్తుదారులు ఈ పథకంలో చేరడానికి వీలుగా 2022 మార్చి లేదా 2023 మార్చి వరకు వెసులుబాటు కల్పించడం జరిగింది. 

ఈ పథకంలో చేరడానికి, 15.06.2021 తేదీ నుండి 15.09.2021 తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానించారు.  పి.ఎల్.ఐ. పథకం కింద, 5,858 కోట్ల రూపాయల పెట్టుబడితో, మొత్తం 52 కంపెనీలు, తమ దరఖాస్తులను దాఖలు చేశాయి.

అన్ని దరఖాస్తులను పరిశీలించిన అనంతరం, 4,614 కోట్ల రూపాయల పెట్టుబడితో 42 మంది దరఖాస్తుదారులను పి.ఎల్.ఐ. పథకం కింద తాత్కాలిక లబ్ధిదారులు గా ఎంపిక చేయడం జరిగింది.   ఎంపిక చేసిన దరఖాస్తుదారులలో, 3,898 కోట్ల రూపాయల పెట్టుబడితో, ఎయిర్ కండిషనర్ తయారీకి సంబంధించి 26 మంది; 716 కోట్ల రూపాయల పెట్టుబడి తో, ఎల్‌.ఈ.డీ. లైట్ల తయారీకి సంబంధించి 16 మంది ఉన్నారు. 

పి.ఎల్‌.ఐ. పథకం కింద ఆమోదం పరిశీలన కోసం 17.4.20 తేదీ ప్రెస్ నోట్ 3 (2020) ప్రకారం ముందుగా ఎఫ్‌.డి.ఐ. ఆమోదం కోసం సమర్పించాలని, భారతదేశంతో భూ సరిహద్దును పంచుకునే దేశాల నుండి ఎఫ్‌.డి.ఐ. ని ప్రతిపాదిస్తున్న ఆరుగురు దరఖాస్తుదారులకు సూచించడం జరిగింది. 

పరిశీలన, సిఫార్సుల కోసం నాలుగు దరఖాస్తులను నిపుణుల కమిటీ (సి.ఓ.ఈ) కి పంపడం జరిగింది.

దరఖాస్తుదారుల జాబితాలు, ప్రతిపాదిత ఉత్పత్తులు, పెట్టుబడుల వివరాలను అనుబంధం లో పొందుపరచడం జరిగింది. 

[ఆ వివరాలు చూడటానికి ఇక్కడ నొక్కండి].

దాదాపు 81,254 కోట్ల రూపాయల మేర నికర ఉత్పత్తిని పెంచడంతో పాటు, దాదాపు 44 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించడం ద్వారా, ఆమోదించబడిన 4,614 కోట్ల రూపాయల పెట్టుబడులను, ఆర్జించే అవకాశం ఉంది. 

ఎయిర్ కండీషనర్ల లో పెట్టుబడులు పెంపొందించడం ద్వారా, భారతదేశంలో తగినంత పరిమాణంలో ఉత్పత్తి కాని విడిభాగాల తో సహా పూర్తి స్థాయి విడిభాగాల తయారీ రంగం విలువ పెరగడానికి దారి తీస్తుంది. ప్రస్తుతం, కంప్రెసర్లు, రాగి గొట్టాలు, రేకుల కోసం అల్యూమినియం నిల్వ వంటి ఎయిర్ కండీషనర్ల లోని కొన్ని అధిక విలువ కలిగిన విడిభాగాల తయారీ చాలా తక్కువగా ఉంది.  అదేవిధంగా, ఇండోర్ యూనిట్లు (ఐ.డి.యు) లేదా అవుట్‌-డోర్-యూనిట్లు (ఓ.డి.యు), డిస్‌-ప్లే యూనిట్లు, బ్రష్‌-లెస్-డైరెక్ట్-కరెంట్-మోటార్లు, వాల్వ్‌లు వంటి అనేక ఇతర విడిభాగాల తయారీ కూడా తగినంతగా లేదు.  అయితే, ఈ భాగాలన్నీ ఇప్పుడు భారతదేశంలో గణనీయమైన పరిమాణంలో తయారవుతాయి.  అదేవిధంగా, ఎల్.ఈ.డి. చిప్ ప్యాకేజింగ్; ఎల్.ఈ.డి. డ్రైవర్లు; ఎల్.ఈ.డి. ఇంజిన్లు; ఎల్.ఈ.డి. లైట్ల నిర్వహణ వ్యవస్థ; మెటల్ క్లాడ్ పి.సి.బి. లతో సహా పి.సి.బి. లు, వైర్ వౌన్డ్ ఇండక్టర్లు మొదలైనవి భారతదేశంలో అధిక పరిమాణంలో తయారవుతాయి.  ఆర్థిక వ్యవస్థ లోని ముఖ్యమైన రంగాల్లో ఆత్మ నిర్భర్ భారత్ కోసం ఇది ఒక పెద్ద ముందడుగు.

*****(Release ID: 1769414) Visitor Counter : 179


Read this release in: English , Urdu , Hindi , Bengali