రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
11వ జాతీయ పెట్రోరసాయనాల అవార్డులు వివిధ కేటగిరీల్లో దరఖాస్తులకు ఆహ్వానం
Posted On:
03 NOV 2021 4:53PM by PIB Hyderabad
పెట్రో రసాయనాలపై జాతీయ విధానాన్ని భారత ప్రభుత్వం 2007 ఏప్రిల్ నెలలో ప్రకటించింది. విలువల జోడింపుతో, నాణ్యతాపరంగా ఉన్నతమైన పెట్రో రసాయనాలను ప్రపంచ మార్కెట్లో పోటీ తత్వంతో కూడిన ధరలపై అందించాలని ఈ విధానం నిర్దేశిస్తోంది. పెట్రో రసాయనాల ఉత్పాదనకోసం పర్యావరణ హితమైన పద్ధతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని, సృజనాత్మకమైన, నూతన పద్ధతులను పాటించాలని, అలాగే, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఈ ఉత్పాదనలకు రూపకల్పన జరగాలని కూడా పెట్రోరసాయనాల విధానం నిర్దేశిస్తోంది.
ఈ నేపథ్యంలో,..జాతీయ స్థాయి పెట్రో రసాయనాల పురస్కారాలకు కేంద్ర పెట్రో రసాయనాల శాఖ రూపకల్పన చేసింది. పాలిమర్ సైన్స్, సాంకేతిక పరిజ్ఞానం వంటి రంగాల్లో పేరుపొందిన ప్రముఖ శాస్త్రవేత్తల, పరిశోధకుల, పారిశ్రామిక వేత్తల సృజనాక్మత కృషిని గుర్తించే లక్ష్యంతో ఈ పురస్కారాలను ప్రవేశపెట్టారు.
2020-21వ సంవత్సరానికి సంబంధించి, 13 కేటగిరీల్లో అవార్డులకు గాను దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర రసాయనాలు, పెట్రోరసాయనాల శాఖ ఆహ్వానిస్తోంది. అవార్డులకోసం దరఖాస్తు చేసుకోవాల్సిన ఆయా కేటగిరీల వివరాలు ఈ దిగువన ఇచ్చిన అనుబంధంలో పొందుపరచబడి ఉన్నాయి. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపించుకోవచ్చు. ఈ ఏడాది డిసెంబరు 31వ తేదీలోగా ఆన్ లైన్ ద్వారా ఈ దరఖాస్తులు సమర్పించవలసి ఉంటుంది.
మరిన్ని వివరాల కోసం ఈ దిగువన సూచించిన లింకును సంప్రదించవచ్చు. https://www.nationalpetrochemicalsawards.pds.gov.in
దీనికి తోడుగా www.chemicals.nic.in అలాగే www.cipet.gov.in అనే వెబ్ సైట్లలో కూడా ఈ లింకు అందుబాటులో ఉంటుంది.
అనుబంధం
11వ జాతీయ పెట్రో రసాయనాల పురస్కారాలు
కేటగిరీల వివరాలు
- పాలిమర్ పదార్థాల్లో సృజనాత్మకత.
- కొత్త పాలిమర్లు, పాలిమర్ల కలయిక, మిశ్రమాలు, ఫైబర్లు, పాలిమర్ మూలకాలు, నానో మూలకాలు, స్మార్ట్ పదార్థాలు తదితరాలు.
- అతికింపుకోసం వాడే కొత్త జిగుర్లు, రక్షణ, అంతరిక్ష పరిశోధన రంగాల్లో వాడే ఉత్పాదనలు.
- సంప్రదాయానికి అతీతంగా వినియోగం/ సంప్రదాయపరంగా వాడే లోహ, సిరామిక్ పదార్థాలు తదితరాల స్థానంలో పాలిమర్ ఉత్పాదనల వినియోగం.
- అతికింపుకోసం వాడే జిగురు పదార్థాల తయారీ టెక్నాలజీలకోసం వినియోగించే సామగ్రి.
- పాలిమర్ ఉత్పాదనల్లో సృజనాత్మకత.
- నూతన/ సృజనాత్మక ఉత్పాదన నమూనా రూపకల్పన.
- సంప్రదాయేతర వినియోగం/సంప్రదాయబద్ధంగావాడే లోహపు వస్తువులు, సిరామిక్ ఉత్పత్తులు, తదితర ఉత్పత్తుల స్థానంలో వాడకం.
- పనితీరులో మెరుగుదల లక్ష్యంగా ఉత్పాదనల నమూనాలలో మార్పులు చేయడం.
- రక్షణ, అంతరిక్ష పరిశోధన రంగాల్లో వినియోగం.
- పని పరిస్థితులు, జీవన చక్రం, ఇంధన సామర్థ్యం, రీసైక్లింగ్.కు అవకాశం వంటి అంశాలను విస్తృతం చేయడం.
- పాలిమర్ ప్రాసెసింగ్ మెషినరీ, పరికరాలు, రోబోటిక్స్, ఆటోమేషన్.లలో సృజనాత్మకత.
- సృజనాత్మక/పర్యావరణ హితమైన ప్రాసెసింగ్ మెళకువల రూపకల్పన-.
- మరింత మెరుగైన సామర్థ్యం/ఉత్పాదకత/యాంత్రీకరకణ కోసం యంత్రపరికరాల నవీకరణ.
- ఇంధన పొదుపు, ఉత్పాదనా నాణ్యత మెరుగుదల.
- పోతపోసే అచ్చులు, అద్దకాలు సంబంధిత పరికరాల మెరుగుదల, నమూనాల రూపకల్పన.
- వివిధ రకాల పాలిమర్ల ప్రాసెసింగ్ మెళకువల్లో రోబోటిక్స్, యాంత్రిక పద్ధతుల రూపకల్పన, వినియోగం, పదార్థాలు, ఉత్పాదనల రవాణా వ్యవస్థ రూపకల్పన.
- పోతపోయడం, పోతపోసిన అనంతరం కార్యకలాపాలను మెరుగుపరచడం.
- తక్కువ ఖర్చుతో, ఇంధన సామర్థ్యంతో పాలిమర్లను పరీక్షించే పరికరాలకు రూపకల్పన.
- ఒక్క సారి మాత్రమే వినియోగించుకోగలిగే ప్లాస్టిక్కులకు తయారీకి వాడే యంత్రాలసు ప్రత్యామ్నాయ వినియోగం కోసం సవరించడం.
- పాలిమర్ వ్యర్థాల నిర్మూలనా వ్యవస్థలో సృజనాత్మకత
- ప్లాస్టిక్ వ్యవర్థాలను ఉత్పాదనలుగా, ఇంధన పునరుత్పత్తికి వినియోగించడంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానం..
- రీసైక్లింగ్ టెక్నాలజీ.
- ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, వర్గీకరణ మెళకువలు.
- రీసైక్లింగ్ అవకాశాలకోసం ఉత్పాదనల రూపకల్పన.
- హరిత పాలిమర్ పదార్థాల, ఉత్పాదనల్లో సృజనాత్మకత
- బయో పాలిమర్లు.
- ప్రకృతిలో కలసి పోయేలా/ కంపోస్టుగా మారగలిగే పాలిమర్లు.
- నియంత్రిత వ్యవధిలో డిగ్రెడేషన్.
- హరిత పదార్థాలతో కూడిన పాలిమర్లు.
- ప్రకృతిలో కలసిపోయే అవకాశాలపై మధింపు.
- ప్యాకేజింగ్ మెళకువల్లో సృజనాత్మకత,..నమూనా రూపకల్పనతో సహా...
- ప్యాకేజింగ్. ప్రక్రియలో కొత్తగా ఆవిర్భవిస్తున్న మెళకువలు.
- స్మార్ట్ పద్ధతిలో ప్యాకేజింగ్.
- పలు పొరలతో కూడిన ప్యాకేజింగ్ స్థానంలో కొత్త ప్యాకేజింగ్ పద్ధతి.
- రక్షణ రంగంకోసం ప్యాకేజింగ్.
- మెరుగైన రీసైక్లింగ్ అవకాశాలకోసం సృజనాత్మక నమూనా పద్ధతి.
- నిల్వ దశలో మెరుగైన మన్నిక కోసం ప్యాకేజింగ్.
- వినియోగదారుల సౌకర్యం, వెసులుబాటు.
- సులభతరమైన నిల్వకోసం స్థిరత్వం.
- వ్యవసాయం, నీటి సంరక్షణలో పాలిమర్ల వినియోగం.
- నీటి రవాణా, మల్చింగ్, కాలువల లైనింగ్, డ్రిప్ ఇరిగేషన్, స్పింక్లర్ విధానం, తక్కువ ఎత్తైన సొరంగాలు, పాలీ హౌస్.లు తదితరాలు.
- ఎరువులు, క్రిమి సంహారకాలు, సూక్ష్మ పోషకాలు తదితరాల కోసం నియంత్రణతో కూడిన విడుదల వ్యవస్థ.
- వ్యవసాయం, పూల సాగు, ఉద్యావన సాగుకు సంబంధించిన ఉత్పాదనలకోసం సృజనాత్మక ప్యాకేజింగ్ ప్రక్రియ.
- ఫిల్ముల దీర్ఘకాలిక మన్నిక కోసం ప్యాకేజింగ్.
- ఆహార భద్రతకోసం ప్లాస్టిక్ ఉత్పాదనల వినూత్న వినియోగం.
- తాగునీటి నిల్వ, రవాణా.
- నీటి శుద్ధీకరణ, నీటినుంచి లవణం తొలగింపు ప్రక్రియలకోసం పాలిమర్ పొర.
- మురుగునీరు, డ్రైనేజీ వ్యవస్థల కోసం పద్ధతులు.
- వైద్యంరంగం, ఔషధ రంగంలో పాలిమర్ల పాత్ర, వినియోగం
- అందుబాటు యోగ్యమైన/ ధరకు తగిన ఇంప్లాంట్లు, పరికరాలు.
- వైద్యరంగంలో వినియోగంకోసం కొత్త, సృజనాత్మక ఉత్పాదనలు.
- పాలిమర్ ఆధారిత కొత్త ఔషధాలు, బట్వాడా వ్యవస్థ
- పాలిమర్ శారీరక ఇంప్లాంట్లు.
- పి.పి.ఇ. ఉత్పాదనల్లో సృజనాత్మకత
- కృత్రిమ శ్వాస పరికరాలు (వెంటలేటర్లు), శానిటైజర్లలో సృజనాత్మకత, తదితర అంశాలు.
- పెట్రోరసాయనాలు, కొత్తరకం పాలిమర్ ప్రక్రియల్లో సృజనాత్మకత.
- శిలాజ ఆవిర్భావ మూలాలకు సంబంధించిన మధ్యంతర రసాయనాలకోసం సుస్థిర ప్రత్యామ్నాయాలు.
- మెరుగైన ఫలితాలకోసం, బయోడీజిల్ ఇంధనం కోసం ఉత్ప్రేరకాల్లో సృజనాత్మకత.
- వర్తులాకార ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా స్వచ్ఛమైన ఉత్పాదనలు.
- పెట్రో రసాయనాల పరిశ్రమలకోసం ఇంధన సామర్థ్యం కలిగిన సాంకేతిక పరిజ్ఞాన ప్రక్రియలు.
- ఇంధన నిల్వ, మార్పిడి కోసం సామగ్రి.
- చమురు, గ్యాస్ పైప్.లైన్లలో అంతర్గత పూతకోసం సృజనాత్మక పద్ధతులు.
- పాలిమర్ సైన్స్, టెక్నాలజీ రంగంలో పరిశోధన
- (విద్యా సంస్థల్లోని పరిశోధనా విద్యార్థులకోసం/ పరిశోధనాగారం కోసం)
- పరిశోధనా, అభివృద్ధి సంస్థల్లో, లేబరేటరీల్లో వ్యక్తిగత పరిశోధకులు/ పరిశోధక బృందాలు.
- వివిధ నమూనాల రూపకల్పనకు దారితీసేలా పాలిమర్ పదార్థాల ప్రాసెసింగ్ ప్రక్రియలో పరిశోధన, భవిష్యత్తులో వాటి పారిశ్రామిక వినియోగం.
- పాలిమర్ రంగంలో సృజనాత్మకమైన “స్టార్టప్” సంస్థ.
- మార్కెట్ అవసరాలకు, ఎగుమతి ప్రధానమైన యూనిట్లకు, వ్యర్థాల నిర్మూలనా నిర్వహణకు, రీసైక్లింగ్ ప్రక్రియతో వినూత్నమైన ఉత్పాదనల తయారీ, దిగుమతి ప్రత్యామ్నాయాలు తదితరాలకోసం పాలిమర్ రంగంలో కొత్త స్టార్టప్.
- స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన “స్టార్టప్”.
- జీవన ప్రమాణాల మెరుగుదల లక్ష్యంగా పర్యావరణ హితమైన, ఖర్చుకు తగిన యోగ్యమైన ఉత్పాదనా పరిష్కారం.
- పెట్రో రసాయనాల రంగంలో ఉత్తమ యాజమాన్య సంస్థ.
(ఆర్ & డి యూనిట్ల కోసం/ వరుసగా మూడేళ్లపాటు పనిచేసిన ఉత్పాదనా పరిశ్రమలు, ఉద్యోగుల రిజిస్టరులో 20మందికి పైగా సిబ్బంది ఉన్న పరిశ్రమలు)
-
- ప్రధానరంగం/మౌలిక అధ్యయనాంశంనుంచి అర్హులను నియమించుకోవడం.
- ఉద్యోగుల తొలగింపు తక్కువ స్థాయిలో ఉండటం, లేదా అసలు తొలగింపే లేకపోవడం
- ఉద్యోగులను స్నేహభావంతో, ప్రతిస్పందనా పూర్వకంగా, గౌరవాభిమానాలతో చూడటం, ఉద్యోగుల సంక్షేమం, వ్యక్తిగత, వృత్తిగత అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించడం.
- సృజనాత్మకతకు ప్రోత్సాహం. కొత్త విషయాలను తెలుసుకునే యత్నాలకు, వాటి అధ్యయనానికి అవకాశాలు కల్పించడం.
- గొప్ప పనితీరు/ జీవన సమతుల్యం, ప్రయోజనాలు, నష్టపరిహారం, స్వయంప్రతిపత్తి, నిర్మాణాత్మక వైఖరి, మద్దతు, సహకార స్వభావంతో కూడిన పని వాతావరణం.
- బలమైన నాయకత్వం, పారదర్శక/ప్రత్యక్ష/ ప్రభావితమైన/ కాలానుగుణ కమ్యూనికేషన్.
- పెట్రో రసాయనాల రంగంసో జీవన సాఫల్యానికి ప్రత్యేక పురస్కారం
- పెట్రోరసాయనాల రంగంలో గణనీయమైన సేవలందించి, ఉత్కృష్టమైన విజయాలతో ఎక్కువ కాలం సేవలందించిన సభ్యులకు సదరు సేవలకు గుర్తింపును ఇచ్చేందుకు ఉద్దేశించిన పురస్కారం.
******
(Release ID: 1769357)
|