వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది ఉల్లిపాయల ధరలు తక్కువగా ఉన్నాయి
జాతీయ స్థాయిలో కేజీ 40.13 రూపాయలుగా ఉన్న ధర / క్వింటాల్ ధర 321.92గా ఉంది
ఎక్కువ నిల్వలను ఉంచుతూ ధరల స్థిరీకరణకు చర్యలు
ఉల్లిపాయల ధరలను తగ్గించడానికి కేంద్రం అమలు చేస్తున్న చర్యలతో సత్ఫలితాలు
Posted On:
03 NOV 2021 6:40PM by PIB Hyderabad
గత ఏడాదితో పోల్చి చూస్తే దేశంలో ఈ ఏడాది ఉల్లిపాయల ధరలు తక్కువగా ఉన్నాయి. అఖిల భారత స్థాయిలో కేజీ ఉల్లిపాయల టోకు ధర 40.13 రూపాయలుగా, క్వింటాల్ ధర 3215.92 రూపాయలుగా ఉంది. ఉల్లిపాయల ధరలు తగ్గించడానికి కేంద్రం అమలు చేస్తున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి.
వర్షాల వల్ల సరఫరా తగ్గడంతో 2021 అక్టోబర్ నుంచి దేశంలో ఉల్లి ధరలు పెరగడం ప్రారంభించాయి. ధరలను తగ్గించి వినియోగదారులకు ఊరట కలిగించాలన్న లక్ష్యంతో కేంద్రం చర్యలను అమలు చేయడం ప్రారంభించింది. దీనిలో భాగంగా వినియోగదారుల వ్యవహారాల శాఖ చర్యలకు ఉపక్రమించింది. దీనిలో భాగంగా బఫర్ నిల్వల నుంచి ఉల్లిపాయలను మొదటి వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత సిద్ధాంతంపై వీటి సరఫరా ప్రారంభం అయ్యింది. ధరలను తగ్గించడంతో పాటు నిల్వ చేసిన సరుకులకు నష్టం కలగకుండా చూడాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం అమలు జరుగుతోంది.
దీనితో ఉల్లిపాయల ధరలలో తగ్గుదల కనిపించింది. అఖిల భారత ధరల సూచి ప్రకారం 03.11.2021 నాటికి కేజీ ఉల్లి ధర 40.42 రూపాయలకు తగ్గింది. క్వింటాలు ఉల్లి ధర 3253.53గా ఉంది.
2021 నవంబర్ 2 వరకు ఢిల్లీ, కోల్కతా, లక్నో, పాట్నా, రాంచీ, గౌహతి, భువనేశ్వర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, చండీగఢ్, కొచ్చి మరియు రాయ్‌పూర్ వంటి ప్రధాన మార్కెట్‌లలో మొత్తం 1,11,376.17 ఎంటీ ల ఉల్లిపాయలను విడుదల చేయడం జరిగింది. మహారాష్ట్ర,మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో స్థానిక మార్కెట్లకు ఉల్లిని సరఫరా చేయడం జరిగింది.
మార్కెట్ లోకి ఉల్లిపాయలను విడుదల చేస్తున్న కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ నిల్వ కేంద్రాలలో కేజీ ఉల్లిని 21 రూపాయలకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందుబాటులో ఉంచింది. దీనివల్ల మార్కెట్ ను నేరుగా నియంత్రించడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అవకాశం కలుగుతుంది. వినియోగదారులకు నేరుగా లేదా ప్రధాన మార్కెట్లకు ఉల్లిని తరలించి వాటి ధరలు తగ్గించడానికి వీలవుతుంది. రిటైల్ మార్కెట్ రంగంలో ఉన్న రాష్ట్ర/కేంద్ర ఏజెన్సీలకు కూడా కేజీ 21 రూపాయల చొప్పున లేదా రవాణా ఖర్చులను కలుపుకుని సేకరణ ధరకు ఉల్లి అందుబాటులో ఉంటుంది. కేజీ 26 రూపాయల చొప్పున సఫల్ ఉల్లిని అందుబాటులో ఉంచింది. బఫర్ నిల్వల నుంచి నాగాలాండ్ కు ఉల్లిని సరఫరా చేస్తున్నారు.
ధరల స్థిరీకరణ నిధి నుంచి వినియోగదారుల వ్యవహారాల శాఖ ఉల్లి బఫర్ స్టాక్ ను ఉంచుతోంది. ధరలను స్థిరీకరించడానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ చర్యలను అమలు చేయడం జరుగుతోంది. 2021-22 లో 2 లక్షల ఎంటీ ల బఫర్ స్టాక్ ఉంచాలని నిర్ణయించిన ప్రభుత్వం లక్ష్యానికి మించి 2.08 లక్షల ఎంటీ ల బఫర్ స్టాక్ ను ఉంచింది. రబీ-2021 లో 2021 ఏప్రిల్-జులై ల మధ్య కేంద్రం పంటను సేకరించింది.
***
(Release ID: 1769354)
Visitor Counter : 143