ఉక్కు మంత్రిత్వ శాఖ
‘రన్ ఫర్ యూనిటీ’తో ఎన్ఎండీసీ రాష్ట్రీయ ఏక్తా దివస్‌ను జరుపుకుంది
Posted On:
31 OCT 2021 3:31PM by PIB Hyderabad
కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన భారతదేశంలో అతిపెద్ద ఇనుప ఖనిజం ఉత్పత్తి సంస్థ నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎండీసీ) రాష్ట్రీయ ఏక్తా దివస్ 2021 ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను తన ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసింది. అన్ని ప్రాజెక్టులలో ‘రన్ ఫర్ యూనిటీ’ని నిర్వహించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్‌లో ఎన్ఎండిసి రన్‌ను నిర్వహించింది.
కంపెనీ సీఎండీ సుమిత్ దేబ్ ఈ సందర్భంగా తమ ఉద్యోగులతో ‘రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ’ చేయించారు. జెండా ఊపి ‘రన్ ఫర్ యూనిటీ’ని ప్రారంభించారు. స్టూడెంట్లతోపాటు ఎన్ఎండీసీయన్లు కార్యక్రమంలో భాగమయ్యారు. ఈ రన్‌లో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొని భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్బాయ్ పటేల్కు నివాళులర్పించారు. ఇండియా@75ని పురస్కరించుకుని ఎన్ఎండీసీ వివిధ క్రీడలు, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఈ సందర్భంగా, సుమిత్ దేబ్ మాట్లాడుతూ దేశ సమగ్రత పట్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ నిబద్ధత అఖండ భారతదేశాన్ని నిర్మించేందుకు ఉపయోగపడిందని. ఆయన ఉక్కు సంకల్పం గొప్పదని, దీనిని ప్రేరణగా తీసుకోవాలని ఉద్యోగులను ప్రోత్సహించారు. భారతదేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న నేపథ్యంలో, మన జాతీయ నాయకులు కలలుగన్న భారతదేశాన్ని నిర్మించడం మన బాధ్యత అని ఆయన అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ వైపు ప్రయాణంలో భాగంగా దేశ మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చడంలో ఎన్ఎండీసీ కీలక పాత్ర పోషిస్తోందని సుమిత్ వివరించారు.
(Release ID: 1768847)
Visitor Counter : 154