ఆర్థిక మంత్రిత్వ శాఖ
బీహార్, ఝార్ఖండ్‌లలో సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్ను శాఖ
Posted On:
01 NOV 2021 2:23PM by PIB Hyderabad
బీహార్, జార్ఖండ్‌లలో ప్రముఖ రహదారి నిర్మాణ కాంట్రాక్టర్‌పై ఆదాయపు పన్నుశాఖ సెర్చ్ అండ్ సీజర్ (సోదాలు, స్వాధీనం) ఆపరేషన్‌ను నిర్వహించింది. ఈ సోదా చర్యను 27.10.2021న బీహార్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లలో పలు ఆవరణలపై ప్రారంభించారు.
సామాగ్రి కొనుగోళ్ళ వ్యయాన్ని పెంచి చూపుతూ లాభాలను ఈ గ్రూపు తగ్గించి చూపుతోందని సోదాలు వెల్లడించాయి. అదనపు సామాగ్రిని మార్కెట్‌లో నగదుకు అమ్ముతూ, ఆ రకంగా వచ్చిన నగదును లెక్కలలో చూపడంలేదు.
ఇతర వ్యాపార ఖర్చులను పెంచి చూపించేందుకు అకామడేషన్ ఎంట్రీలకు ఈ గ్రూపు పాల్పడిందని కూడా తెలిసింది. ఈ సందేహాస్పద పద్ధతుల్లో అసెఎసీ గ్రూపుకు తోడ్పడుతున్న కమిషన్ ఏజెంట్ల ఆవరణల నుంచి చేతితో రాసిన డైరీలు వంటి నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పత్రాల్లో లెక్కల్లోకి రాని నగదు ఉత్పత్తి, సామాగ్రి రవాణాకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఈ గ్రూపు ఒప్పంద రసీదులు, సేవలను అందించినందుకు వచ్చిన ఆదాయాన్ని కూడా మరుగున పరిచిందని సోదా ఆపరేషన్‌లో వెల్లడైంది. అంతేకాకుండా, అకౌంటు పుస్తకాలు సహా బిల్లులు, వోచర్లు వంటి సహాయక పత్రాలను కూడా ఈ గ్రూపు సరిగా నిర్వహించడం లేదని వెలుగులోకి వచ్చింది.
లెక్కల్లోకి రాని నగదును వివిధ ప్రాంతాలలో స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టేందుకు, వ్యక్తిగతమైన నగదు ఖర్చులకు వివిధ ప్రాంతాలకు తరలించినట్టు సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న వివిధ నేరారోపణ పత్రాలు సూచిస్తున్నాయి. ఈ సోదాల సందర్భంగా కమిషన్ ఏజెంట్లు, బోగస్ బిల్లుల సరఫరాదారులు ఇతర పార్టీలకు కూడా అకామడేషన్ ఎంట్రీలను అందించడంలో నిమగ్నమై ఉన్నందున కోట్ల రూపాయిలపై పన్నును ఎగవేసినట్టు కనుగొన్నారు.
ఈ సోదాల చర్య ఫలితంగా రూ. 5.71 కోట్ల లెక్కల్లోకి రాని నగదును స్వాధీనం చేసుకున్నారు. పది లాకర్లను స్తంభింపచేశారు. ఫిక్సెడ్ డిపాజిట్లు, తదితరాలలో పెట్టిన సుమారు రూ 60 కోట్ల పెట్టుబడులను ధృవీకరిస్తున్నారు. ఈ సోదాలు దాదాపు రూ.100 కోట్ల మేరకు లెక్కల్లోకి రాని నగదును వెలికితీసేందుకు దారి తీశాయి. మరింత లోతైన దర్యాప్తు పురోగతిలో ఉంది.
***
(Release ID: 1768527)
Visitor Counter : 154