మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ నిర్వహించిన పశు సంవర్ధక, పాడి శాఖ
రైతు సహకార సంఘాల దిశగా సర్దార్ పటేల్ చేసిన కృషి సంస్మరణ
నాడు పోస్టు చేయడమైనది:
31 OCT 2021 3:51PM by PIB Hyderabad
ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా, 31 అక్టోబర్, 2021న రాష్ట్రీయ ఏకతా దివస్‌ను (జాతీయ ఐక్యతా దినోతవ్సం) పురస్కరించుకుని మత్స్య, పశుసంవర్ధక, పాడి మంత్రిత్వ శాఖ పరిధిలోని పశు సంవర్ధక, పాడి శాఖ అధికారులు రన్ ఫర్ యూనిటీలో (ఐక్యత కోసం పరుగు) పాల్గొన్నారు. భారత వ్యవస్థాపకులలో ఒకరైన సర్దార్ పటేల్ జయంతి ఉత్సవం సందర్భంగా ఆయన వారసత్వాన్ని సంస్మరించుకునేందుకు ఈ కార్యక్రమాన్నినిర్వహించారు.
ప్రతిజ్ఞ స్వీకార కార్యక్రమం అనంతరం కృషి భవన్ నుంచి ఆర్/ఎ జనపథ్ వరకు, తిరిగి కృషి భవన్‌కు తిరిగి వచ్చేలా రూపొందించిన రన్ ఫర్ యూనిటీకి శాఖ కేంద్ర కార్యాలయమైన కృషి భవన్ నుంచి శాఖ సంయుక్త కార్యదర్శి (పరిపాలన) జి.ఎన్. సింగ్ ప్రారంభించారు. దాదాపు 1942 నాటికే రైతు సహకార సంఘాలను ప్రతిపాదించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలను ఆయన పాల్గొన్నవారిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రస్తావించారు. పటేల్ చేసిన ప్రతిపాదన స్ఫూర్తితో కైరా సహకార పాల ఉత్పత్తిదారుల యూనియన్ లిమిటెడ్ ఏర్పడి,తదనంతర కాలంలో అమూల్‌గా ప్రాచుర్యాన్ని పొందింది.
శాఖకు చెందిన సీనియర్ అధికారులు సహా సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. పరుగు తర్వాత, కృషి భవన్ వద్దద ప్రతిజ్ఞ స్వీకార కార్యక్రమం పాల్గొంది. ఇందులో సిబ్బందది అంతా దృశ్య మాధ్యమం ద్వారా దేశ ఐక్యతను, సమగ్రతను, భద్రతను పరిరక్షించి, బలోపేతం చేస్తామన్న అంకిత భావాన్ని పునరుద్ఘాటింపచేసే ఏక్తా శపథ్ (ఐక్యతా ప్రతిజ్ఞ)ను చేశారు.
భారత స్వాతంత్ర్య పోరాటంలో ముందుండి నడిపించడమే కాక, దేశ విభజన అనంతరం దేశాన్ని ఐక్యం చేయడంలో సర్దార పేటేల్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అందుకే భారతదేశపు ఉక్కు మనిషిగా (లోహపురుషుడిగా) ఆయన ప్రాచుర్యం పొందారు.
పశుసంవర్ధక, పాడి శాఖ అధికారులు, రైతుల భాగస్వామ్యంతో అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలో శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. రన్ ఫర్ ది యూనిటీ తర్వాత కృషి భవన్ ఆవరణలో స్వచ్ఛతా కార్యక్రమం జరిగింది.
***
(రిలీజ్ ఐడి: 1768192)
సందర్శకుల సూచీ సంఖ్య : : 191