వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ సమస్యలపై భారతదేశం నాయకత్వానికి జి-20 గుర్తింపు, పలు అంశాలపై భారత అభిప్రాయాలకు మద్దతు - శ్రీ పీయూష్ గోయెల్
రోమ్ డిక్లరేషన్ కు తుది రూపం ఇవ్వడానికి ఇటీవల ముగిసిన షెర్పా సమావేశం అజెండాకు జి20 సదస్సులో నాయకుల ఆమోదం - శ్రీ గోయెల్ టెస్టులు, వ్యాక్సిన్ సర్టిఫికెట్లు సహా ప్రయాణ పత్రాలను పరస్పరం గుర్తించుకోవాలన్న అంశం పట్ల జి20 సహచరుల మద్దతు లభించడం ఆనందదాయకం - శ్రీ గోయెల్ సుస్థిర అభివృద్ధి, ఆహార భద్రత లక్ష్యంగా చిన్న, మధ్యతరహా వ్యవసాయదారుల ప్రయోజనాలు, స్థానిక ఆహార సంస్కృతులు పరిరక్షించే విధంగా విధానాలుండాలని, తద్వారా ఆహార భద్రత లభిస్తుందని పట్టుబట్టిన భారత్ - శ్రీ పీయూష్ గోయెల్ ఒకే రకమైన, దీర్ఘకాలిక ప్రపంచ వాతావరణ కార్యాచరణ ప్రణాళిక; రాయితీలతో కూడిన వాతావరణ ఆర్థిక సహాయం; సుస్థిరమైన, అందరికీ అందుబాటు ధరల్లో టెక్నాలజీ అందుబాటు; సుస్థిర జీవనశైలి విధానాలు, బాధ్యతాయువతమైన వినియోగ విధానాలు తప్పనిసరి అన్న అంశానికి మద్దతు ప్రకటించిన భారత్ - శ్రీ గోయెల్ కోవిడ్ అనంతర ఆర్థిక రికవరీకి మద్దతు చర్యలను ముందస్తుగానే ఉపసంహరించుకోబోమని, సమాజంలో నిరాకరణకు గురవుతున్న వర్గాలకు అవసరమైన మద్దత
Posted On:
29 OCT 2021 9:00PM by PIB Hyderabad
“ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలపై భారతదేశం నాయకత్వాన్ని జి-20 దేశాలు ఆమోదించాయి. రాబోయే జి-20 శిఖరాగ్ర సమావేశం చర్చకు రానున్న పలు అంశాలపై భారతదేశ వైఖరికి మద్దతు ఇచ్చాయి” అని ఇటీవల ముగిసిన జి-20 షెర్పాల సమావేశం వివరాలను మీడియాకు వివరిస్తూ శ్రీ పీయూష్ గోయెల్ తెలిపారు.
రోమ్ డిక్లరేషన్ కు తుది రూపం ఇవ్వడానికి ఇటీవల ముగిసిన షెర్పాల సమావేశం అజెండాను నాయకుల శిఖరాగ్ర సమావేశం ఆమోదిస్తుంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ తనకు అందిన ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాఘి ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఉదయమే రోమ్ చేయారు.
ఇది ప్రధానమంత్రి 8వ జి-20 సమావేశం.
జి-20 సమావేశంలో ప్రధానమంత్రి భాగస్వామ్యానికి అవసరమైన తుది ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు శ్రీ పీయూష్ గోయెల్ మూడు రోజులోగా రోమ్ లోనే ఉన్నారు.
రోమ్ లో శ్రీ పీయూష్ గోయెల్ ఈ నెల 27-29 తేదీల మధ్య జరిగిన జి-20 షెర్పాల సమావేశంలో పాల్గొన్నారు. జి-20 దేశాలకు చెందిన పలు దేశాల (యుకె, జర్మనీ, ఫ్రాన్స్, ఇయు, ఇండోనేసియా, సింగపూర్ (ఎఫ్ఎం) వాణిజ్య మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. అంతర్జాతీయ సహకారానికి సంబంధించి ప్రపంచ స్థాయిలో కీలకమైన వేదికగా జి-20 ఎదిగిందని శ్రీ గోయెల్ అన్నారు. ప్రపంచ జిడిపిలో 80 శాతానికి, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతానికి, ప్రపంచ జనాభాలో 60 శాతానికి జి-20 ప్రాతినిథ్యం వహిస్తున్నదని ఆయన చెప్పారు.
“మహమ్మారి నుంచి రికవరీ, ప్రపంచ ఆరోగ్య పాలనా వ్యవస్థ పటిష్ఠత, ఆర్థిక రికవరీ, సంయమనం, వాతావరణ మార్పులు, ఇంధన పరివర్తన, సుస్థిర అభివృద్ధి, ఆహార భద్రత” లక్ష్యాలుగా ఈ ఏడాదికి నిర్దేశించిన “ప్రజలు, భూగోళం, సుసంపన్నత” అనే థీమ్ తో ముందుకు సాగుతున్న జి-20 కి ప్రస్తుతం అధ్యక్ష స్థానంలో ఇటలీ ఉంది.
ఇటలీ ఎంపిక చేసిన ప్రాధాన్యతా అంశాలకు భారతదేశం పూర్తి మద్దతు ఇస్తున్నదని మీడియాతో మాట్లాడుతూ శ్రీ గోయెల్ చెప్పారు. రోమ్ డిక్లరేషన్ కు తుది రూపం ఇవ్వడానికి ఇటీవల జరిగిన షెర్పాల సమావేశం అజెండాను జి-20 శిఖరాగ్ర సదస్సులో నాయకులు ఆమోదిస్తారని ఆయన తెలిపారు.
భారతదేశం ఉదృతంగా చేపట్టిన కోవిడ్-19 టీకాల కార్యక్రమం ప్రపంచం శ్రేయస్సు కోసమేనని జి-20 దేశాలు ఆమోదించాయని, టెస్టింగ్ ఫలితాలు, వ్యాక్సిన్ సర్టిఫికెట్లు సహా ప్రయాణ పత్రాలను పరస్పరం గుర్తించుకోవాలంటూ ఈ సందర్భంగా తాను చేసిన ప్రతిపాదనను జి-20 సహచరులు ఆమోదించడం ఆనందదాయకమని మంత్రి అన్నారు.
సుస్థిర అభివృద్ధి, ఆహార భద్రత విషయానికి వస్తే చిన్నకారు, సన్నకారు రైతుల ప్రయోజనాలు, స్థానిక ఆహారపు అలవాట్లు పరిరక్షించేవిగా విధానాలుండాలని, అప్పుడే ఆహార భద్రత సాధ్యమవుతుందని భారతదేశం నొక్కి చెప్పిందని ఆయన తెలిపారు.
ఒకే రకమైన, దీర్ఘకాలిక ప్రపంచ వాతావరణ కార్యాచరణ ప్రణాళిక; రాయితీలతో కూడిన వాతావరణ ఆర్థిక సహాయం; సుస్థిరమైన, అందరికీ అందుబాటు ధరల్లో టెక్నాలజీ అందుబాటు; సుస్థిర జీవనశైలి విధానాలు, బాధ్యతాయుతమైన వినియోగ విధానాలతోనే వాతావరణ మార్పులు, పర్యావరణం విషయంలో పటిష్ఠమైన అడుగు పడుతుందని, అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇందుకు కట్టుబడాలన్న అంశంతో పాటు ఎస్ డిజి-12 లక్ష్యాల ప్రాధాన్యత గురించి కూడా భారతదేశం గట్టిగా వాదించిందని శ్రీ గోయెల్ తెలిపారు.
కోవిడ్ అనంతర ఆర్థిక రికవరీకి, సమాజంలో నిరాదరణకు గురవుతున్న వర్గాల సహాయానికి ప్రకటించిన మద్దతు చర్యలు ముందస్తుగా ఉపసంహరించకుండా జి-20 ఫ్రేమ్ వర్క్ వర్కింగ్ గ్రూప్ సహాధ్యక్ష హోదాలో ఇండియా కృషి చేస్తుందని ఆయన చెప్పారు. అలాగే ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో ప్రకటించిన రుణ సర్వీస్ నిలుపుదల చర్యలను 2021 సంవత్సరం చివరి వరకు కొనసాగించేందుకు, తద్వారా ప్రపంచంలోని పేద ప్రజలకు ఊపిరి పీల్చుకునే అవకాశం ఇచ్చేందుకు జి-20 అంగీకరించిందని తెలిపారు. పన్ను సంస్కరణలపరంగా లాభాలు ఆర్జిస్తున్న ప్రదేశాలు, వాటిపై పన్నులు విధిస్తున్న ప్రాంతాల్లోని అసతుల్యతను తొలగించాలని భారతదేశం ప్రతిపాదించిందన్నారు. ఇలా చేయడం వల్ల భారీ ఎంఎన్ సిలు తాము కార్యకలాపాలు సాగిస్తున్న దేశంలో తక్కువ కార్పొరేట్ పన్ను చెల్లించే వీలు కలుగుతుందని భారతదేశం వాదం వినిపించినట్టు శ్రీ గోయెల్ చెప్పారు.
ఈ సంవత్సరానికి జి-20 అవినీతి నిరోధక కార్యాచరణ బృందం కో చైర్ హోదాలో భారతదేశం ఆస్తుల రికవరీ, సమాచార మార్పిడి, చట్టాల అమలులో సహకారం, సాంకేతిక పరిజ్ఞానం, పన్ను స్వర్గధామాల నిరాకరణ అనే ఐదు అంశాలను ప్రతిపాదించిందని శ్రీ గోయెల్ తెలిపారు.
మహిళా సాధికారతకు జి-20 ప్రాధాన్యం ఇవ్వాలన్న అంశానికి భారతదేశం గట్టిగా మద్దతు ప్రకటించిందని వాణిజ్యం, టెక్స్ టైల్, వినియోగదారుల వ్యవహారాలు; ఆహారం, ప్రభుత్వ సరఫరా శాఖల మంత్రి తెలిపారు. లింగవివక్షాపూరితమైన దౌర్జన్యానికి వ్యతిరేక భాషను చేర్చాలని భారత్ గట్టిగా ప్రతిపాదించిందని, అలాగే “రిమోట్ పని ఏర్పాట్ల”కు సహాయపడే విధంగా జి-20 కొత్త పాలసీ విధానానికి మద్దతు ప్రకటించిందని ఆయన చెప్పారు.
కోవిడ్-19 కారణంగా విశేషంగా కుంగిపోయిన టూరిజం రంగం రికవరీ ప్రాధాన్యతను కూడా ప్రముఖంగా ప్రస్తావించినట్టు శ్రీ గోయెల్ తెలిపారు. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ, సాంస్కృతిక వైభవ పరిరక్షణ అంశాల్లో జి-20 ఇస్తున్న ప్రాధాన్యతకు భారతదేశం మద్దతు ప్రకటించినట్టు చెప్పారు.
విశ్వసనీయతతో కూడిన గణాంకాలు అందరికీ అందుబాటులో ఉండాలని, ప్రధానంగా సీమాంతర డేటా ప్రవాహం, వర్థమాన దేశాల అభివృద్ధి చొరవల మద్దతుకు అవకాశం కల్పించాలని భారతదేశం గట్టిగా కోరిందని మంత్రి తెలిపారు. “అభివృద్ధికి డేటా వినియోగం” అనే అంశంలో భారతదేశానికి జి-20 మద్దతు ఇవ్వడం అత్యంత సంతృప్తికరమైన అంశమని ఆయన చెప్పారు.
జి-20లో భారతదేశం మాట వర్థమాన దేశాల మాటకు ప్రాతినిథ్యం వహిస్తుందని మంత్రి అన్నారు. 2020లో సౌదీ నాయకత్వ సమయంలో ప్రధానమంత్రి శ్రీ మోదీ సలహాను పురస్కరించుకుని కోవిడ్-19 పరిస్థితిపై గత ఏడాది జి-20 అసాధారణ సమావేశం నిర్వహించిందని ఆయన చెప్పారు.
ఆఫ్ఘనిస్తాన్ లో మానవతా సంక్షోభాన్ని పరిష్కరించడంలో జి-20 ప్రభావానికి మద్దతు ఇచ్చేందుకు ఈ ఏడాది ఇటలీ ప్రత్యేక శిఖరాగ్రం నిర్వహిస్తోంది. మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛ ప్రత్యేకించి మహిళలు, బాలలు, మైనారిటీలు, ఆఫ్ఘనిస్తాన్ లోని నిరాదరణకు గురవుతున్న వర్గాల ప్రజల హక్కులకు ఐక్యరాజ్యసమితి చార్టర్, ఇతర అంతర్జాతీయ నిబంధనల పరిధిలో జి-20 ప్రాధాన్యం ఇస్తోంది.
2022 డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 తేదీల మధ్య కాలానికి జి-20 అధ్యక్షతను భారతదేశం స్వీకరిస్తుందని శ్రీ గోయెల్ చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ లో త్రికోణంలో ప్రవేశిస్తున్న సమయంలో వర్థమాన దేశాలు, వర్థమాన ఆర్థిక వ్యవస్థల సమస్యలు, ఆందోళనలపై నాయకత్వం దృష్టిని ఆకర్షించేందుకు భారతదేశం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.
(Release ID: 1767822)
|