రక్షణ మంత్రిత్వ శాఖ
లాంగ్-రేంజ్ బాంబును సంయుక్తంగా విజయవంతంగా పరీక్షించిన - డి.ఆర్.డి.ఓ. మరియు ఐ.ఏ.ఎఫ్.
Posted On:
29 OCT 2021 5:34PM by PIB Hyderabad
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఓ) మరియు భారత వైమానిక దళానికి చెందిన బృందం సంయుక్తంగా దేశీంగా అభివృద్ధి చేసిన లాంగ్-రేంజ్ బాంబ్ (ఏల్.ఆర్.బి.) ని వైమానిక వేదిక నుండి అక్టోబర్ 29, 2021న విజయవంతంగా పరీక్షించింది. ఐ.ఏ.ఎఫ్. యుద్ధ విమానం నుండి, ఎల్.ఆర్. బాంబును, విడుదల చేసిన తర్వాత, నిర్దిష్ట పరిమితుల్లో ఖచ్చితత్వంతో సుదూర పరిధిలో ఉన్న భూ-ఆధారిత లక్ష్యానికి మార్గనిర్దేశం చేశారు. ఈ మిషన్ లక్ష్యాలన్నీ విజయవంతంగా నెరవేరాయి. బాంబు యొక్క ఫ్లైట్ మరియు పనితీరును, ఒడిశాలోని చాందీపూర్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ద్వారా నియోగించబడిన ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ (ఈ.ఓ.టి.ఎస్), టెలిమెట్రీ, రాడార్ లతో సహా అనేక రేంజ్ సెన్సార్ లు పర్యవేక్షించాయి.
ఎల్.ఆర్. బాంబు ను ఇతర డి.ఆర్.డి.ఓ. ప్రయోగశాలల సమన్వయంతో హైదరాబాద్‌లో ఉన్న డి.ఆర్.డి.ఓ. ప్రయోగశాల - రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్.సి.ఐ.) రూపొందించి, అభివృద్ధి చేసింది.
డి.ఆర్.డి.ఓ., ఐ.ఏ.ఎఫ్. తో పాటు ఈ ఫ్లైట్ ట్రయల్స్ విజయవంతం కావడానికి సహకరించిన ఇతర బృందాలను రక్షణ మంత్రి, శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ఇది భారత సాయుధ దళాల బలాన్ని పెంపొందించే శక్తి గా నిరూపిస్తుందని, ఆయన పేర్కొన్నారు.
విజయవంతమైన ఈ లాంగ్-రేంజ్ బాంబు ఫ్లైట్ టెస్ట్ ఈ తరహా వ్యవస్థల స్వదేశీ అభివృద్ధి లో ఒక ముఖ్యమైన మైలురాయి గా గుర్తించబడిందని, ఈ బృందాలను అభినందిస్తూ, డి.డి.ఆర్. & డి. కార్యదర్శి మరియు డి.ఆర్.డి.ఓ. చైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి, తమ సందేశంలో పేర్కొన్నారు.
*****
(Release ID: 1767816)
Visitor Counter : 291