గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డి.డి.యు.-జి.కె.వై. పథకం కింద 5 రాష్ట్రాల్లో సమావేశాలు!


ఆజాదీ కా అమృత్ మహోత్సవ్.లో భాగంగా నిర్వహణ.

గ్రామీణ జీవనోపాధి పథకాల ద్వారా ఉద్యోగావకాశాలే లక్ష్యం

లాభదాయక రంగంగా ఎదుగుతున్న లాజిస్టిక్స్

Posted On: 28 OCT 2021 1:41PM by PIB Hyderabad

   దేశంలోని 18 ప్రధాన రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రతినిధులు ఈ నెల 15నుంచి 21వ తేదీవరకూ వరుసగా పలు సమావేశాలు జరిపారు. దీన దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డి.డి.యు.-జి.కె.వై.) పథకం కింద నిర్వహించిన సి.ఎక్స్.ఒ. సమావేశాల్లో భాగంగా వారు చర్చలు జరిపారు. అస్సాం, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ వంటి ఐదు రాష్ట్రాలకు చెందిన గ్రామీణ జీవనోపాధి పథకాల అమలులో భాగంగా ఈ సి.ఎక్స్.ఒ. భేటీలను ఏర్పాటు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తవుతున్నసందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట నిర్వహించే వేడుకల్లో భాగంగా ఈ సమావేశాలను చేపట్టారు.

https://ci6.googleusercontent.com/proxy/gperCZZm58L7cV3TgAwgh2bsyJvvbWuHfWQpyGe8xt8lsE62zEAV_FBhKn_G_HYSdAJKiMIRTuY4vuFp9AF-CeAvIvxbjH9apVcDzm7aTYFtcxT5e9-gyUPj2A=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001GTMR.jpg

జార్ఖండ్.లో వర్చువల్ సి.ఎక్స్.ఒ. సమావేశం

 

    భావితరాల ప్రయోజనాలకోసం కార్మిక మార్కెట్.ను మరింత బలోపతం చేసేందుకు తీసుకోవలసన చర్యలపై చర్చించేందుకు వివిధ రంగాల పారిశ్రామిక ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రతినిధులతో పాటుగా, వివిధ రంగాల నైపుణ్య మండలుల ప్రతినిధులు కూడా పాలుపంచుకున్నారు. పర్యాటక ఆతిథ్య, రిటెయిల్ రంగాలు, లాజిస్టిక్స్, దుస్తుల రంగం, రసాయనాలు-పెట్రో రసాయనాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐ.టి.),, ఐ.టి. ఆధారిత సేవలు, ఆటోమోటివ్, పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, ఆరోగ్య రక్షణ, నిర్మాణరంగం, ఉత్పాదక వస్తురంగం, ఉత్పాదకం వంటి వివిధ రంగాల ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాలుపంచుకున్నారు. బి.ఎం.డబ్ల్యు., హ్యూందాయ్, పార్క్ హోటల్, బార్బెక్యూ నేషన్, లీలా ప్యాలెస్, ఒబెరాయ్-ట్రైడెంట్ (ముంబై), వివాంత, వోవ్, మోమో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర కంపెనీల మార్కెట్ యాజమాన్యాల సీనియర్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. పలు అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించారు. భాగస్వామ్య వర్గాలన్నింటికీ అధ్యయన వేదికలుగా ఈ సి.ఎక్స్.ఒ. సమావేశాలు ఎలా ఉపయోగపడతాయన్న అంశంపై వారు తమతమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. యాజమాన్య సంస్థలకు, శిక్షణలోని భాగస్వాములకు మధ్య క్రమం తప్పకుండా చర్చలు నిర్వహించేందుకు ఈ సమావేశాలు ఎలా ఉపయోగపడతాయో వివరించారు.

https://ci6.googleusercontent.com/proxy/1DcZVpQUN7eTkvlshlaNs0fGdaIhq8-WHttP9Te8N-Wkml4nc_mByakeUhj4oTRKHEFzEIURnylu7RbGoMym1RtklbxvZKJjJfeu85phYrDGwivpqTsZOf7ENg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0026OO3.jpg

అస్సాంలో సి.ఎక్స్.ఒ. వర్చువల్ సమావేశం

 

   అయితే,.. ఈ సమావేశాల్లో ఒక్కో రాష్ట్రం, ఒక్కో ప్రత్యేక రంగంపై దృష్టిని కేంద్రీకరించింది. పర్యాటక, ఆతిథ్య రంగంపై అస్సాం రాష్ట్రం దృష్టిని కేంద్రీకరించింది. రిటెయిల్, పర్యాటకం, ఆర్థిక, లాజిస్టిక్స్, దుస్తుల రంగంపైన జార్ఖండ్ రాష్ట్రం, లాజిస్టిక్స్, దుస్తుల రంగంపైన మధ్యప్రదేశ్ రాష్ట్రం, సౌందర్య సాధనాల రంగం, వెల్.నెస్ రంగ నైపుణ్య మండలి, ఆరోగ్య రక్షణ నైపుణ్య మండలి, రసాయనాలు, పెట్రో రసాయనాలు, లాజిస్టిక్స్ రంగ నైపుణ్య మండలి, ఐ.టి., ఐ.టి. ఆధారిత సేవలు., ఉత్పాదక వస్తురంగం తదితరాలపై గుజరాత్ రాష్ట్రం,.. ఆటోమోటివ్ రంగంపై తమిళనాడు రాష్ట్రం తమతమ దృష్టిని కేంద్రీకరించాయి.

 

https://ci6.googleusercontent.com/proxy/AfgGOJK8kZeW7cGKCJASlnZvkCjfob5WFaM2cMPlIuxTDANQ0DQL_gSliX7FRuhDatRJDYgUlAsPuU_AYioqpkWXhr7s9jvCsdSczPVRTfA0CQWIs1TNrqiC3w=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00319T5.jpg

మధ్యప్రదేశ్.లో సి.ఎక్స్.ఒ. వర్చువల్ సమావేశం

 

  డి.డి.యు.-జి.కె.వై. పథకం కింద శిక్షణలో ఉన్న అభ్యర్థుల శిక్షణ, నియామకం, నియామానంతర సహాయం, ఉద్యోగ జీవిత ప్రగతి వంటి అంశాలపై కూడా సి.ఎక్స్.ఒ. సమావేశాల్లో చర్చ జరిగింది.  నైపుణ్యం కలిగిన సిబ్బందికోసం ఏర్పడే కొరతను ఎప్పటికప్పుడు తీర్చడం, నైపుణ్యం కలిగిన సిబ్బందికోసం ఏర్పడే డిమాండ్.ను నెరవేర్చడం, వేతనాల అంశం, కొన్ని రంగాల్లో మహిళల నియామకానికి ప్రాధాన్యత ఇవ్వడం తదితర కార్యకలాపాల్లో రాష్ట్రాల గ్రామీణ జీవనోపాధి పథకాలు నిర్వహించే పాత్రపై కూడా ఈ సమావేశాల్లో సుదీర్ఖంగా, విపులంగా చర్చించారు.

https://ci6.googleusercontent.com/proxy/L_UoIGnhn5ovEhwyIpi5ZDeqZqXcJUE_JWtE2ZOwERkWHwRUJIAvy8zyqGI_mM3ttE4zs0wz6kA0XIEWToMQ9hRSqFbKAIxfL3YLzY3iGdKR3y17nlGHCNXFtA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0040E9K.jpg 

గుజరాత్.లో సి.ఎక్స్.ఒ. సమావేశం

 

  పారిశ్రామిక నిపుణులకు, రాష్ట్రాల గ్రామీణ జీవనోపాధి కల్పనా పథకాల ప్రతినిధులకు మధ్య జరిగిన చర్చలో,..లాజిస్టిక్స్ రంగం ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరంగా ఎదుగుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇ-కామర్స్ వేదికలు వాణిజ్యంలో ఊపందుకోవడం, ఈ రంగంలో శిక్షణ పొందిన సిబ్బందికి ఉద్యోగావకాశాలు పెరగడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలాగే, పారిశ్రామికంగా నూతన అనుసంధానాలకు వేదికలుగా కూడా ఈ సి.ఎక్స్.ఒ. సమావేశాలు దోహదపడుతున్నాయి. శిక్షణా భాగస్వాములు, పరిశ్రమల ప్రతినిధుల మధ్య సంబంధాలను కల్పన ద్వారా ఈ కృషి జరుగుతోంది. అలాగే, డి.డి.యు.-జి.కె.వై. కార్యక్రమంలో శిక్షణ పొందిన అభ్యర్థులు తగిన ఉద్యోగ అవకాశాలు పొందేలా చూసేందుకు ఈ సమావేశాలు వీలు కల్పిస్తున్నాయి.

https://ci5.googleusercontent.com/proxy/-C_QV5Z0VAB5MjWi45lrTV_2o8CQxDYHVs7VGRhk-Fj5XBBLp79268QrvKEHX8sjIM6UToxFBcRRLUhPn0-XdIXQ7_512UB_pPU8ohf_LKz-RkyA-BP86n7XUw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005IMZD.jpg

తమిళనాడులో సి.ఎక్స్.ఒ. సమావేశం

దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డి.డి.యు.-జి.కె.వై.)

    ప్రపంచ ప్రమాణాలతో కూడిన వేతన నిర్ణాయక వ్యవస్థ లక్ష్యంగా దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డి.డి.యు.-జి.కె.వై.) అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఉద్యోగ కల్పనతో అనుసంధానమైన ఈ నైపుణ్యాభివృద్ధి పథకాన్ని తొలుత, జాతీయ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించింది. ఆ తర్వాత జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకంగా దీన్ని రూపొందించారు. చివరకు డి.డి.యు-జి.కె.వై. పేరిట ఈ పథకాన్ని జాతీయ స్థాయిలో 2014 సెప్టెంబరు 25న ప్రారంభించారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిధులతో దీన్ని చేపట్టారు. ఉద్యోగ కల్పనతో అనుసంధానమైన జాతీయ నైపుణ్య శిక్షణ కార్యక్రమంగా ఆ తర్వాత దీన్ని తీర్చిదిద్దారు.  ప్రస్తుతం 27 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ పథకం అమలవుతోంది. దేశవ్యాప్తంగా 2,369 శిక్షణా కేంద్రాల్లో 57 విభిన్న రంగాలకు చెందిన, 616 రకాల ఉద్యోగాలకోసం శిక్షణను ఈ పథకం కిందనే అందిస్తున్నారు. ఇప్పటి వరకూ డి.డి.యు.-జి.కె.వై. కింద మొత్తం 11.09లక్షల మంది అభ్యర్థులకు శిక్షణ అందించారు. ఈ ఏడాది సెప్టెంబరు నెలాఖరు నాటికి 7.13లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి.

***


(Release ID: 1767364) Visitor Counter : 211