రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
దేశంలో ఎరువుల కొరత వదంతులను తిప్పి కొట్టేందుకు పత్రికా సమావేశాన్ని నిర్వహించిన భగవంత్ ఖూబా
కర్నాటకలో 22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందిః ఖూబా
Posted On:
28 OCT 2021 10:34AM by PIB Hyderabad
దేశంలో ఎరువుల కొరత ఉందంటూ వచ్చిన వదంతులను తిప్పి కొ్ట్టేందుకు కేంద్ర రసాయినాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబా పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆ వదంతులు ఆధారం లేని అసత్యాలని పేర్కొంటూ, ఎరువుల కొరత ఉందంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు.
వికాస్‌సౌధలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, కర్నాటకలలో గత రెండేళ్ళుగా సమ్మిళిత ఎరువుల (కాంప్లెక్స్ ఫెర్టిలైజర్) వినియోగం పెరిగిందని ఖుబా చెప్పారు. సమ్మిళిత ఎరువులను వినియోగం వల్ల రాష్ట్రంలో రైతులు లబ్దిపొందుతారన్నారు. డిఎపి కన్నా కూడా ఈ సమ్మిళిత ఎరువులు మెరుగైన ఫలితాలను ఇస్తాయని ఆయన చెప్పారు. అందుకే ప్రభుత్వం డిఎపికి మదులుగా సమ్మిళిత ఎరువుల కొనుగోలును సిఫార్సు చేస్తోందని వివరించారు.

దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఎరువుల కొరత రాబోతోందని, వచ్చే నాలుగు నెలల కోసం రైతులు ఎరువులను సేకరించుకోవాలనే వదంతులు వస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ వదంతులు అసత్యమైనవి, నిరాధారమైనవని స్పష్టం చేశారు. ఎరువుల శాఖకు ఇన్‌ఛార్జి మంత్రిగా, వారికి అవసరమైనంత ఎరువులను అందుబాటులో ఉంచుతానని రైతులకు హామీ ఇస్తున్నానని ఆయన అన్నారు.

ఈ ఏడాది నానో యూరియా ఉత్పత్తి పెరిగిందని, నానో డిఎపి ఉత్పత్తి వచ్చే సంవత్సరం ప్రారంభం అవుతుందని ఖూబా తెలిపారు. కర్నాటకలో 22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. రబీ కాలానికి 2 లక్షల మెట్రిక్ టన్నుల డిఎపి అవసరమని, దానిని ఉత్పత్తి చేస్తామని చెప్పారు. రెండు పరిశ్రమలలో మేము చర్య తీసుకున్నామని తెలిపారు. కర్నాటక రాష్ట్ర వ్యాప్తంగా ఈ రుతుపవనాల కాలంలో మంచి వర్షాలు పడ్డాయని, దాదాపు 78.51 లక్షల హెక్టేర్లలో నాట్లు పడ్డాయని వెల్లడించారు.
నాట్ల కోసం అవసరమైన మూల పదార్ధాల సరఫరాను రాష్ట్రం తగినంతగా పరిష్కరించిందని, కేంద్ర ప్రభుత్వం వాటాగా జిల్లాలకు ఎరువుల సరఫరా చేసేందుకు ఏర్పాట్లు జరిగాయని ఆయన పేర్కొన్నారు.
***
(Release ID: 1767188)