రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) 29 అక్టోబర్, 2021న “స్థోమత మరియు ఆవిష్కరణ: అందరికీ నాణ్యమైన మందులను అందించడం” అనే అంశంపై వెబ్‌నార్‌ను నిర్వహించనుంది.
భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ కె. విజయ్ రాఘవన్ అధ్యక్షతన వెబ్‌నార్ జరుగుతుంది.
Posted On:
28 OCT 2021 11:42AM by PIB Hyderabad
భారతదేశ 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవం సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ఏడాదంతా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఫార్మాస్యూటికల్స్ విభాగం ఆధ్వర్యంలోని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) 2021 అక్టోబర్ 29న మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం ఐదు వరకూ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రత్యేక వెబ్‌నార్‌ను నిర్వహిస్తోంది. “ స్థోమత మరియు ఆవిష్కరణ: అందరికీ నాణ్యమైన మందులను అందించడం” అనే ఆంశం ఈ వెబ్‌నార్ యొక్క ఇతివృత్తం.
భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ కె. విజయరాఘవన్ వెబ్‌నార్‌కు అధ్యక్షత వహించి కీలకోపన్యాసం చేయనుండగా, భారత ప్రభుత్వ ఫార్మాస్యూటికల్స్ విభాగం కార్యదర్శి శ్రీమతి ఎస్. అపర్ణ తన అభిప్రాయాన్ని పంచుకుంటారు. ఫార్మాస్యూటికల్ మరియు వైద్య పరికరాల పరిశ్రమ, ఆరోగ్య సంరక్షణ సంఘం, విద్యాసంస్థలు మరియు ప్రభుత్వం నుండి వివిధ వాటాదారులు ఈ వెబ్‌నార్‌లో పాల్గొంటారు.
ఐఐటీ ధన్‌బాద్, ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ విశ్వవిద్యాలయ అనుబంధ ప్రొఫెసర్ మరియు హైదరాబాద్‌లోని రెనోవిస్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ ప్రొఫెసర్ జావేద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో ప్యానెల్ చర్చా కార్యక్రమం వెబ్‌నార్ సమయంలో జరుగుతుంది. వెబ్‌నార్‌లోని ప్యానెలిస్ట్‌లు చర్చలో ఉన్న అంశంతో అనుసంధానం ఉన్న వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నిపుణులు పాల్గొంరు. ఈ చర్చలో నిపుణులైన ప్యానెలిస్టులు: డాక్టర్ వై.కె. గుప్తా, వైస్-ఛైర్ ఎస్ఎన్సీఎం సభ్యుడు, ఎస్సిఏఎంహెచ్పీ ; శ్రీ పంకజ్ పటేల్, జైడస్ కాడిలా ఛైర్మన్; డాక్టర్. ఎస్. చంద్రశేఖర్, డైరెక్టర్, సిఎస్ఐఆర్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసిటి); శ్రీ మనోజ్ ఝలానీ, డైరెక్టర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ యూహెచ్సీ/హెల్త్ సిస్టమ్స్ & లైఫ్ కోర్సు, ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ కార్యాలయం, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్ఓ); శ్రీ దీపక్ బాగ్లా, మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ, ఇన్వెస్ట్ ఇండియా; మరియు డాక్టర్ రత్నా దేవి, ఇంటర్నేషనల్ అలయన్స్ ఆఫ్ పేషెంట్ ఆర్గనైజేషన్ (ఐఏపీఓ) వంచి ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొంటారు.
అందుబాటు ధరలో అందరికీ ఆరోగ్య సంరక్షణను తీసుకురావడానికి చేపట్టాల్సిన ఆవిష్కరణలకు ఈ చర్చలో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆంశంపై పలువురు నిపుణులు వారి అభిప్రాయాన్ని పంచుకుంటారు. అలాగే పరిశ్రమల అకాడెమియా సహకార రంగాలు, ఫైనాన్సింగ్ ఎంపికలు, ప్రపంచ ఉత్తమ పద్ధతులు మొదలైనవాటిని కూడా ప్యానెల్ చర్చలో కవర్ చేస్తారు.
****
(Release ID: 1767138)
Visitor Counter : 177