గనుల మంత్రిత్వ శాఖ
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) ఫొటో ఎగ్జిబిషన్
प्रविष्टि तिथि:
27 OCT 2021 6:09PM by PIB Hyderabad
“ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” (ఏకేఏఎం) వేడుకల్లో భాగంగా హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) ఇటీవల రాజస్థాన్ ఖేత్రీ వద్ద గల కాపర్ కాంప్లెక్స్ (కేసీసీ), మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని మలంజ్‌ఖండ్ వద్ద గల మలంజ్‌ఖండ్ కాపర్ ప్రాజెక్ట్ (ఎంసీపీ),
జార్ఖండ్‌లోని ఘట్సిలాలో గల ఇండియన్ కాపర్ కాంప్లెక్స్ (ఐసీసీ), మహారాష్ట్రలోని థలోజా వద్ద గల థలోజా కాపర్ ప్రాజెక్ట్‌ల
వద్ద వద్ద ఆకర్షణీయమైన ఫోటో ప్రదర్శనను నిర్వహించింది. ఈ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్‌లో దేశపు గొప్ప రాగి వారసత్వాన్ని ప్రధర్శనకు




ఉంచారు. రాగి ఉత్పత్తిలో హెచ్‌సిఎల్ పాత్ర దేశ స్వాతంత్ర్య పోరాటంపై ఫోటోలు ఈ ప్రదర్శనలో ఉన్నాయి. హెచ్‌సీఎల్ సంస్థకు చెందిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఫొటో ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నారు, ఈ ప్రదర్శన దేశభక్తిని ప్రేరేపించింది. మన స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన అరుదైన ఫోటోలను ప్రదర్శించడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందించింది.
(रिलीज़ आईडी: 1767069)
आगंतुक पटल : 239