సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

60 కొత్త డిజైన్‌లతో మరింత ఆకర్షణీయంగా ఖాదీ వస్త్రాలు


వర్ధమాన ఫ్యాషన్ డిజైనర్లకు ఖాదీ ఫ్యాషన్ షోలో అవార్డులను ప్రదానం చేసిన కేవీఇసి

Posted On: 27 OCT 2021 3:31PM by PIB Hyderabad

ఖాదీ వస్త్రాల  సరళతస్వచ్ఛత, మన్నిక అంశాలు ప్రతిబింబించే విధంగా ఢిల్లీలో ఖాదీ ఫ్యాషన్ షో జరిగింది. నిన్న సాయంకాలం హోటల్ అశోకాలో ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఇసినిర్వహించిన ఈ షో సందర్శకులను ఆకట్టుకుంది. ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ అఫ్ ఇండియా సహకారంతో  ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(కేవీఇసి) నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రముఖ డిజైనర్,   కమిషన్ సభ్యుడు శ్రీ సునీల్ సేథీ పర్యవేక్షణలో జరిగింది. దీనిలో వర్ధమాన డిజైనర్లు రూపొందించిన 60 డిజైన్లను ప్రదర్శించారు.  ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ నిర్వహించిన ఖాదీ డిజైనర్ల పోటీ ద్వారా వీరిని ఎంపిక చేయడం జరిగింది. తొలి మూడు స్థానాల్లో నిలిచిన  డిజైనర్లకు అవార్డులు  అందజేశారు.   

ఖాదీని అత్యంత నైతికమైన వస్త్రంగా, ఎక్కువ కాలం మన్నే  వస్త్రంగా డిజైన్  రూపొందించిన డిజైనర్ స్వాతి కపూర్ మొదటి బహుమతిగా  10 లక్షల నగదు పురస్కారాన్ని అందుకున్నారు.  19వ శతాబ్దంలో  శామ్యూల్ టేలర్ కొలెరిడ్జ్ రాసిన “కుబ్లా ఖాన్” అనే పద్యం నుంచి  ప్రేరణ పొంది స్వాతి కపూర్ దీనికి రూపకల్పన చేశారు.  దుస్తుల రూపకల్పన లో బ్లాక్ ప్రింటింగ్, హ్యాండ్ క్రోచెట్ మరియు హ్యాండ్ ఎంబ్రాయిడరీ లాంటి మెళకువలను ఉపయోగించి సాదా మరియు సెల్ఫ్ చెక్‌లో స్వాతి రూపొందించి దుస్తులు ఆకర్షణీయంగా ఉన్నాయి. 

 

డిజైనర్ ధృవ్ సింగ్ రెండవ స్థానంలో నిలిచి అయిదు లక్షల రూపాయల నగదు బహుమతిని అందుకున్నారు. కార్తీక మాసంలో పౌర్ణమి రాత్రి తన భక్తులు/ప్రేమికులతో కలిసి నృత్యం చేస్తున్న కృష్ణుడి పెయింటింగ్ నుండి ప్రేరణ పొంది ఆయన తన డిజైన్ రూపొందించారు.  సుఖం,  సౌలభ్యంతో కూడిన వస్త్రాలను ధరించామన్న అనుభూతి కల్పిస్తూ ఖాదీకి కాస్త పండుగ రూపాన్ని అందించే విధంగా వీటి రూపకల్పన జరిగింది సాధారణ ఖాదీ వస్త్రం ఉపయోగించిన సింగ్ దానిపై బెంగాల్ ,గుజరాత్‌కు చెందిన కళాకృతులను  పూర్తిగా చేతితో ఎంబ్రాయిడరీ చేసి  ప్యూర్ జరీని ఉపయోగించారు. 

 

  డిజైనర్లు కౌశల్ సింగ్ మరియు గౌరవ్ సింగ్ లు సంయుక్తంగా మూడవ బహుమతిగా  లక్షల రూపాయలను కైవసం చేసుకున్నారు.దుస్తుల తయారీకి  కౌశల్ ప్లెయిన్ వీవ్ ఖాదీ మరియు బ్లూ ఖాదీ డెనిమ్ ఉపయోగించాడు. ప్రింట్ ఆర్ట్‌వర్క్ చక్కటి కళాకారులతో దుస్తులను రూపొందించారు.  డిజైనర్ గౌరవ్ జీరో వేస్ట్ డిజైన్ టెక్నిక్ మరియు కాంట్రాస్ట్ స్టిచ్ లైన్ వివరాలను ఉపయోగించి ఖాదీ కాటన్ దుస్తులకు రూపకల్పన చేశారు. 

 

ప్రజలకు కొత్త డిజైన్లను పరిచయం చేసి ఖాదీకి అధునాతన రూపాన్ని ఇవ్వాలన్న లక్ష్యంతో ఆల్-ఇండియా ఖాదీ డిజైనర్ల పోటీ నిర్వహించబడింది. ఈ పోటీలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతూ  యువ ఫ్యాషన్ డిజైనర్ల నుంచి 393 నామినేషన్లు అందాయి . 10 మంది ఉత్తమ డిజైనర్‌లను ఎంపిక చేయడానికి  ఫ్యాషన్ డిజైనర్లుడిజైన్ ఇన్‌స్టిట్యూట్‌ల నిపుణులు కేవీఇసి  ఉన్నతాధికారులు సభ్యులుగా ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రదర్శన సందర్భంగా జ్యూరీ ముగ్గురు విజేతలను ఎంపిక చేసింది.  

ప్రదర్శనలో ప్రదర్శించిన డిజైన్లతో తయారైన ఖాదీ వస్త్రాలు త్వరలో ఖాదీ ఇండియా అవుట్‌లెట్లలో డిజైనర్ వేర్‌గా అందుబాటులోకి తీసుకురానున్నట్లు కెవిఐసి చైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా తెలిపారు. 

 

***


(Release ID: 1767045) Visitor Counter : 202


Read this release in: Tamil , English , Hindi , Bengali