జల శక్తి మంత్రిత్వ శాఖ

కోటి లీటర్ల సామర్థ్యంతో వారణాసిలో భారీ మురుగునీటి శుద్ధి ప్లాంటు!


అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం..
నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభం
సుందరీకరించిన 8 పవిత్ర కుండాలకూ ప్రధాని శ్రీకారం

Posted On: 26 OCT 2021 7:09PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పర్యటన సందర్భంగా  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబరు 25న వారణాసిలో కొత్త మురుగునీటి శుద్ధి ప్లాంటును ప్రారంభించారు. వారణాసిలోని రామ్ నగర్ ప్రాంతంలో రోజుకు కోటి లీటర్ల మురుగునీటిని శుద్ధిచేసే సామర్థ్యంతో ఈ ప్లాంటును నిర్మించారు. గంగానదీ జలాల పరిరక్షణకు, గంగానదీ ప్రవాహ పునరుజ్జీవానికి ప్రభుత్వం బహుముఖంగా కృషి చేస్తూ వస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో జాతీయ స్వచ్ఛ గంగా పథకం (ఎన్.ఎం.సి.జి.) రూపుదిద్దుకుంది. గంగానదిలోకి మురుగునీటి ప్రవాహాన్ని నివారించే ప్రయత్నంలో భాగంగా విస్తృత స్థాయిలో మురుగునీటి ప్లాంట్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. గంగానదీ నిర్మలతను, స్వచ్ఛతను, నిరాటంక గంగానదీ ప్రవాహాన్ని రక్షించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు.

   కేవలం కొన్ని నగరాలు, పట్టణాల ప్రయోజనానికి,.. వచ్చే పది, పదిహేనేళ్ల అవసరాలను తీర్చే విధంగా గంగానదీ జలాల రక్షణ, గంగా ప్రవాహ పునరుజ్జీవం కోసం ఇలాంటి ముగురునీటి శుద్ధి ప్లాంట్లను చేపట్టాలని నమామి గంగా పథకం నిర్దేశించింది. ఈ దిశగానే ప్రభుత్వ పలు చర్యలు తీసుకుంటోంది. వారణాసిలోని రామ్ నగర్ లో ప్రధాని ప్రారంభించిన ఈ ప్లాంటు,.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ప్రాజెక్టు అవుతుంది.  అధునాతనమైన ఎ-20 (అనెయిరోబిక్-అనాక్సిక్-అనాక్సిక్) సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మురుగునీటి శుద్ధి ప్లాంటును ఏర్పాటు చేశారు. రోజుకు కోటి లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసే సామర్థ్యం కలిగి ఉండటం ఈ ప్లాంటు ప్రత్యేకత. అంటే, వివిధ దేశాలనుంచి తెప్పించిన అధునాతన పరికరాలతో రూపుదిద్దుకున్న ఈ ప్లాంటు ద్వారా కోటి లీటర్ల కలుషిత నీరు పరిశుద్ధంగా తయారైన తర్వాతనే ఇకపై గంగానదిలోకి ప్రవహిస్తుందన్నమాట.

https://ci6.googleusercontent.com/proxy/KjK7CORGkapsA5rBRFMX9OMKkbrmpa-xOptVmFf6U5XYO5Kh2CcWmRiL915KYajyXlK2X9nevOMxLKfba7_RO9QJGyu9NLm7sAMrtq4WTk5JHxujS1UU3H30CQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0012IL2.jpg

   ఈ మురుగునీటి శుద్ధీకరణ ప్లాంటుకు 2018 నవంబరు 12న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. రూ. 72.91కోట్ల వ్యయంతో ప్లాంటును నిర్మించారు. వారణాసిలోని మొత్తం ఐదు మురుగునీటి కాల్వల ద్వారా గంగానదీ జలాల్లో కలుస్తున్న కలుషిత నీటికి ఇకపై పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడుతుంది. ఇక పదిహేనేళ్ల పాటు మురుగునీటి శుద్ధి ప్రక్రియను, ప్లాంటు నిర్వహణా కార్యకలాపాలను ఈ ప్రాజెక్టు నిర్వహిస్తుంది. ప్లాంటు ద్వారా శుద్ధిచేసిన నీరు ప్రధాన పంపింగ్ కేంద్రం ద్వారా గంగానదిలోకి విడుదల అవుతుంది. ప్రధాన పంపింగ్ కేంద్రంతో సహా, ఈ ప్లాంటుకు సంబంధించిన మరిన్ని పరిరకాలను కూడా విదేశాలనుంచి దిగుమతు చేసుకున్నారు. కలుషిత జలాలను శుద్ధి చేసే ప్రక్రియ అధునాతన పద్ధతుల్లో జరిగేందుకు వీలుగా ఈ చర్య తీసుకున్నారు.  

.

https://ci6.googleusercontent.com/proxy/VBpkmmatFoJfS0xNPXKCwSrL2jgql4A3X-iSxgXhXuGRBeKEYze7JQcwB7QzNEmEPyDMyJbTyP9we3IHA4_tA-3uNDDnXR207sz3mJHSggw2KFbCrjuDJek8_Q=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002J2CK.jpg

   ముగురునీటి శుద్ధి ప్లాంటు నిర్మాణంతో పాటుగా, నగరంలోని 8 గంగా పవిత్ర కుండాల సుందరీకరణ, పరిరక్షణకు చేపట్టిన పథకాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. రూ. 18.96కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. కలాహ, దుధియా, లక్ష్మీ, పహరియా, పంచకోశీ, కబీర్, రేవా, బఖరియా కుండాల సుందరీకరణ, పరిరక్షణకోసం ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఎన్.ఎం.జి.సి. పథకం కింద గంగానది స్వచ్ఛతకోసం 'స్వచ్ఛ గంగా నిధి' ద్వారా పనులను పూర్తి చేశారు. మానవ నిర్మితమైన ఈ నీటి కుండాలన్నీ సంప్రదాయ బద్ధమైనవి. స్థానికంగా తాగునీటి వనరులుగానే కాకుండా, వర్షపునీటి రక్షణకు, భూగర్భ జలాల నిర్వహణకి ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయి. చారిత్రాత్మకమైన ఈ నీటి కుండాలు సుసంపన్నమైన మన సామాజిక, సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రతీకలుగానే కాక, నీటి వనరుల నిర్వహణకు సుస్థిర మార్గాలుగా పనిచేస్తున్నందున వీటి పరిరక్షణ, సుందరీకరణ అనివార్యమైంది. 

నీటి కుండాల గతకాలపు చిత్రాలను, తాజా చిత్రాలను తిలకించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

 

****



(Release ID: 1766935) Visitor Counter : 144


Read this release in: Urdu , English , Hindi , Tamil