భారత పోటీ ప్రోత్సాహక సంఘం
పారెక్సెల్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్‌ను ఫీనిక్స్ పేరేంట్‌కో ఐఎన్‌సి కొనుగోలు చేసేందుకు ఆమోదం తెలిపిన సిసిఐ
Posted On:
25 OCT 2021 6:28PM by PIB Hyderabad
ఫీనిక్స్ పేరెంట్‌కో, ఐఎన్‌సి ద్వారా పారెక్సెల్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ కొనుగోలును కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదించింది. ప్రతిపాదిత కలయికలో భాగంగా పారెక్సెల్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ (టార్గెట్)లోని 100% ఈక్విఈ వాటాలను ఫీనిక్స్ పేరెంట్ కంపెనీ (కొనుగోలుదారు) భవిష్యత్తులో కొనుగోలు చేయనుంది. కొనుగోలుదారు ఈక్యూటీ ఫండ్ మేనేజ్‌మెంట్ ఎస్.ఎ.ఆర్.ఎల్ (ఈక్యూటీ), గోల్డ్‌మాన్ సాక్స్ గ్రూప్, ఐఎన్‌సి (గోల్డ్‌మాన్ సాక్స్) సంయుక్తంగా నియంత్రిస్తున్నాయి.
టార్గెట్ కేంద్రకార్యాలయం యుఎస్ఎలోని దర్హాంలో ఉంది. ఈ సంస్థ బయోఫార్మాస్యూటికల్ కంపెనీల (జీవ ఔషధ) కు బయోఫార్మస్యూటికల్ ఔట్‌సోర్సింగ్ సేవలను అందిస్తుంది. టార్గెట్ అంతర్జాతీయ స్థాయిలో చేపట్టే కార్యకలాపాలను క్లినికల్ సొల్యూషన్స్, కన్సెల్టింగ్ వంటి విస్త్రత విభాగాలుగా వర్గీకరించవచ్చు.
దీనికి సంబంధించిన సిసిఐ వివరణాత్మక ఉత్తర్వులు జారీ కానున్నాయి.
***
(Release ID: 1766421)
Visitor Counter : 154