ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

జికా వైరస్ వ్యాధి కేసు నమోదైన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు ప్రత్యేక నిపుణుల బృందాన్ని పంపిన కేంద్రం

Posted On: 25 OCT 2021 1:56PM by PIB Hyderabad

జికా వైరస్ వ్యాధి కేసు నమోదైన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ఒక 57 సంవత్సరాల వ్యక్తికి జికా వైరస్ సోకినట్టు 2021 అక్టోబర్ 22న నిర్ధారణ అయ్యింది. 

నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మరియు న్యూ ఢిల్లీలోని డాక్టర్ ఆర్‌ఎంఎల్ హాస్పిటల్ కు చెందిన ఒక ఎంటమాలజిస్ట్, ప్రజారోగ్య నిపుణులు, గైనకాలజిస్ట్‌ సభ్యులుగా ఏర్పాటైన ప్రత్యేక బృందాన్ని  రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులకు సహకరించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పంపింది. జికా వైరస్ నియంత్రణ చర్యలను అమలు చేయడానికి ఈ బృందం సహకరిస్తుంది.  

రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఈ బృందం కలిసి పనిచేసి క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అధ్యయనం చేసి జికా వైరస్ వ్యాధి నివారణకు  ఆరోగ్య మంత్రిత్వ శాఖ రూపొందించిన మార్గదర్శకాలు అమలవుతున్న తీరుపై  నివేదిక అందిస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జికా వైరస్ వ్యాధి నివారణకు అమలు చేయాల్సిన చర్యలను కూడా బృందం సూచిస్తుంది. 

***



(Release ID: 1766353) Visitor Counter : 152