భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

సంప్ర‌దాయ‌, ఇలాచీ, అల్లం, మ‌సాలా రుచుల‌లో ఆజాదీ అమృత్ చాయ్ విడుల


పార్ల‌మెంటులోని టీ బోర్డ్ కౌంట‌ర్‌, ట్రైఫెడ్ దుకాణాలు, ఉద్యోగ్ భ‌వ‌న్‌, ఇత‌ర కేంద్ర ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌లో రిటైల్ అమ్మ‌కాల‌కు అందుబాటులో ఆజాదీ అమృత్ చాయ్‌

Posted On: 24 OCT 2021 5:51PM by PIB Hyderabad

భారీ ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని తేయాకు రంగంలో ఉన్న కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ ఎం/ఎ స్ ఆండ్రూ యూల్ & కో లిమిటెడ్ సంస్థ భార‌త దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన 75 సంవ‌త్స‌రాలు అయిన సంద‌ర్భంగాను, ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ వేడుక‌ల‌లో భాగంగానూ సంప్ర‌దాయ‌, ఇలాచీ, అల్లం, మ‌సాలా రుచుల‌లో ఆజాదీ అమృత్ చాయ్ పేరిట ప‌లు రుచుల పరంప‌ర‌ను విడుద‌ల చేసింది. కేంద్ర భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి డాక్ట‌ర్ మ‌హేంద‌ర్ నాథ్ పాండే శుక్ర‌వారం నాడు ఆజాదీ అమృత్ చాయ్‌ను విడుద‌ల చేశారు. ఈ తేయాకు రిటైల్‌లో 100 గ్రాముల ప్యాకెట్ రూ. 75 ప‌రిచ‌య ధ‌ర‌గా నిర్ణ‌యించి పార్ల‌మెంటులోని టీ బోర్డ్ కౌంట‌ర్‌లోనూ, ట్రైఫెడ్ దుకాణాల‌లోనూ, ఉద్యోగ భ‌వ‌న్‌లోనూ, ఇత‌ర కేంద్ర ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌లోనూ అమ్మ‌కానికి అందుబాటులో ఉంచ‌నున్నారు. 
ఎం/ఎ స్ ఆండ్రూ& యూల్ కంపెనీ లిమిటెడ్ 158 ఏళ్ళ‌నాటి కంపెనీ. ఈ సంస్థ‌కు అస్సాం, ప‌శ్చిమ బెంగాల్ వ్యాప్తంగా 15 తేయాకు వ‌నాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 14000మంది సిబ్బంది ప‌ని చేస్తున్నారు. అన్ని వ‌నాలూ కూడా 100 ఏళ్ళ‌నాటివి కావ‌డ‌మే కాక అధిక నాణ్య‌త క‌లిగిన 110 ల‌క్ష‌ల కిలోల సిటిసి, సంప్ర‌దాయ‌, గ్రీన్‌, వైట్ టీని ఉత్ప‌త్తి చేస్తున్నాయి. 

***(Release ID: 1766231) Visitor Counter : 157