ఉక్కు మంత్రిత్వ శాఖ
స్పెషాలిటీ స్టీల్ నిమిత్తం పీఎల్ఐ పథకం మార్గదర్శకాలు నోటిఫై
- అక్టోబర్ 25, 2021న స్పెషాలిటీ స్టీల్ కోసం పీఎల్ఐ పథకంపై సెమినార్
Posted On:
22 OCT 2021 6:20PM by PIB Hyderabad
స్పెషాలిటీ స్టీల్ కోసం 2021 జూలై 29వ తేదీన నోటిఫై చేయబడిన ఉత్పత్తి-లింక్డ్ ప్రోత్సాహక పథకానికి (పీఎల్ఐ) కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నోటిఫికేషన్ తరువాత ఉక్కు మంత్రిత్వ శాఖ పరిశ్రమతో సంప్రదింపులు జరిపింది. ఈ సంప్రదింపుల నుంచి అందిన సూచనలు, సలహాలు ఆధారంగా.. గతంలో ప్రకటించిన పథకం అమలు నియమాలను వివిధ మార్గదర్శకాల రూపంలో తయారు చేయబడ్డాయి. సమర్థవంతమైన ఆపరేషన్ మరియు పీఎల్ఐ పథకం సజావుగా అమలు చేయడానికి గాను అవసరమైన ఆయా మార్గదర్శకాలను స్టీల్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో 2021 అక్టోబర్ 2021న నోటిఫై చేయబడింది. దరఖాస్తు, అర్హత, ప్రోత్సాహకం పంపిణీ, మొదలైన పథకాల కార్యాచరణ అంశాలపై ఇక్కడ మార్గదర్శకాల స్పష్టత లభిస్తుంది. ఆయా మార్గదర్శకాల కోసం ఈ క్రింది లింక్‌ను క్లిక్ చేయండి:-
https://steel.gov.in/sites/default/files/Scheme%20Guidelines_Final_Upload.pdf
https://steel.gov.in/sites/default/files/Scheme%20Guidelines_Final_Upload.pdf
2026-27 చివరి నాటికి స్పెషాలిటీ స్టీల్ ఉత్పత్తి 42 మిలియన్ టన్నులుగా మారుతుందని అంచనా. ఇది సుమారుగా రూ.2.5 లక్షల కోట్ల విలువైన స్పెషాలిటీ స్టీల్‌ని ఉత్పత్తి చేస్తుంది. లేదంటే దేశంలో దీనిని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
అదేవిధంగా, స్పెషాలిటీ స్టీల్ ఎగుమతి దాదాపు 5.5 మిలియన్ టన్నులకు చేరుతుంది. ప్రస్తుతమున్న 1.7 మిలియన్ టన్నుల స్పెషాలిటీ స్టీల్ ఎగుమతి రూ.33,000 కోట్ల ఫోరెక్స్‌ను పొందుతోంది. ఈ పథకం యొక్క ప్రయోజనం ఉక్కు రంగంలోని పెద్దపెద్ద ఉత్పత్తిదారులకు అంటే ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ల వారికి మరియు చిన్న ఆటగాళ్లకు (సెకండరీ స్టీల్ ప్లేయర్స్) కూడా లభిస్తుంది.
స్పెషాలిటీ స్టీల్ అనేది వాల్యూడ్ యాడ్ స్టీల్, దీనిలో సాధారణ ఫినిషింగ్ స్టీల్ పూత, ప్లేటింగ్, హీట్ ట్రీట్మెంట్ మొదలైన వాటి ద్వారా పనిచేస్తుంది, దీనిని ఆటోమొబైల్ కాకుండా రక్షణ, అంతరిక్షం, విద్యుత్ రంగంతో పాటుగా ప్రత్యేక మూలధన వస్తువులు తయారీ వంటి వివిధ వ్యూహాత్మక అప్లికేషనల్లోనూ ఉపయోగించవచ్చు. పీఎల్ఐ స్కీమ్‌లో ఎంపిక చేయబడిన స్పెషాలిటీ స్టీల్ యొక్క ఐదు కేటగిరీలు:
పూత/ప్లేటెడ్ ఉక్కు ఉత్పత్తులు,
అధిక సామర్థ్యం/వేర్ రెసిస్టెంట్ స్టీల్,
ప్రత్యేక పట్టాలు,
అల్లాయ్ స్టీల్ ఉత్పత్తులు మరియు స్టీల్ వైర్లు, ఎలక్ట్రికల్ స్టీల్
ఈ పథకంపై చర్చలు జరిపే లక్ష్యంతో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ రామ్ చంద్ర ప్రసాద్ సింగ్ నేతృత్వంలోని ఉక్కురంగంలోని వారితో 25 అక్టోబర్ 2021న న్యూ ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఒక్కరోజు సమావేశం ఏర్పాటు చేయబడింది. పరిశ్రమల వారు, పరిశ్రమల దిగ్గజాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
*****
(Release ID: 1765887)
Visitor Counter : 226